2021 January 1 నుంచి టెక్నాలజీ రంగంలో కొత్త మార్పులు!! పాటించక తప్పదు
2020 సంవత్సరం డిజిటల్ పరంగా అందరిని ఉహించని స్థాయికి తీసుకువెళ్ళింది. గత ఆరు నెలలో మాత్రమే గత దశాబ్దం కంటే ఎక్కువ డిజిటల్ పరివర్తనను పొందడం అందరూ గమనించారు. అయితే ఇప్పటికే జరుగుతున్న కొన్ని వేగవంతమైన పరివర్తన ప్రయత్నాల కారణంగా వెనుకబడిన కొంత మంది మాత్రం కొన్ని సమస్యలను ఎదురుకోవలసి ఉంటుంది.2021 లో AI మరియు డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన రంగాలు ఎక్కువ ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2021 సంవత్సరం మొదలు నుంచి అంటే జనవరి 1 నుండి కొంత మందికి మాత్రం బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన అప్‌డేట్లు మరియు రాబోయే అప్‌డేట్లను పొందకపోతే చాలా విషయాలను కోల్పోవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన వాట్సాప్ యొక్క యాక్సిస్ ను కోల్పోవడం. మిగిలిన వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ మద్దతు కోల్పోవడం
ఫేస్‌బుక్ యాజమాన్యంలో పనిచేసే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గత సంవత్సరం నుండి కొన్ని పాత స్మార్ట్‌ఫోన్‌లకు తన యొక్క అన్ని రకాల సర్వీసుల మద్దతును అందివ్వడం లేదు. అయితే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కొన్ని ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా తన యొక్క మద్దతును ముగించనున్నట్లు తాజా నివేదికలో తెలిపింది. కొత్తగా విడుదల అయిన నివేదికల ప్రకారం ఐఫోన్‌లలో iOS 9 లేదా ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే ఫోన్‌లలో వాట్సాప్ ను ఉపయోగించడం జనవరి 1 నుండి కుదరదు. దీనికి కారణం ఈ ఫోన్‌లలో వాట్సాప్ తన యాక్సిస్ ను అందివ్వడం డిసెంబర్ 31తో ముగిస్తున్నది. వాట్సాప్ కొత్త ఫీచర్‌లను ఆస్వాదించడానికి యూజర్లు తమ యొక్క ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోమని వినియోగదారులను సిఫార్సు చేస్తుంది.

5G టెక్నాలజీ అందుబాటులోకి
5G యొక్క ప్రయోజనాల గురించి అందరు ఇప్పటి వరకు వింటున్నారు అయితే రిమోట్ వర్క్, వీడియోకాన్ఫరెన్సింగ్ మరియు డిజిటల్ కోలాబరేషన్ వంటివి ఈ సంవత్సరం మన జీవితంలో ముఖ్య భాగాలుగా అయ్యాయి. వీటి కోసం నమ్మదగిన కనెక్టివిటీ మరియు మరింత బ్యాండ్‌విడ్త్ మరియు నిజమైన కాంక్రీట్ ప్రయోజనం అవసరం అయ్యింది. ఫోన్లు, టాబ్లెట్‌లు మరియు ఇతర పరికరాలపై మనం ఎక్కువగా ఆధారపడటంతో పాటుగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఐయోటి సెన్సార్‌లతో సహా టెలికమ్యూనికేషన్ కంపెనీలకు మల్టీ-లేన్ సూపర్ హైవే యొక్క 5G అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ రోజు వ్యాపారాలు డిస్‌కనెక్ట్ చేయబడటం అనేది సాధ్యం కాదు మరియు 5G విస్తరణలు పరిష్కారంలో కీలకమైన భాగంగా మారాయి. కాబట్టి 2021లో ఇండియాలో 5G అందుబాటులోకి వచ్చే అవకాశం అధికంగా ఉంది.

2021 జనవరి 1 నుంచి ఫాస్‌ట్యాగ్ ఖచ్చితం
NHAI మీద ప్రయాణం చేసే నాలుగు చక్రాల కంటే పైన ఉన్న వాహనం వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగానే షాక్ ఇచ్చింది. జనవరి 1 నుండి కేవలం ఫాస్‌ట్యాగ్ ద్వారానే టోల్ గేట్ వద్ద యూజర్ ఫీజు చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. జనవరి 1 నుంచి టోల్ ఫీజులను డబ్బుల రూపంలో చెల్లించడానికి ఎటువంటి అవకాశం లేదు. టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ పద్దతిలో చెల్లించడానికి ఈ సంవత్సరం ఫాస్‌ట్యాగ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫాస్‌ట్యాగ్ ను ఖచ్చితం చేసింది. 2021 నుంచి ఫాస్‌ట్యాగ్ లేకపోతే కనుక టోల్ గేట్ దాటలేని పరిస్థితి. కావున మీరు NHAI లలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటే కనుక వెంటనే ఫాస్‌ట్యాగ్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది.

ల్యాండ్‌లైన్ కాలింగ్ లో మార్పులు
2021 జనవరి 1 నుంచి టెలికాం రంగంలో గల అతిపెద్ద మార్పులలో ల్యాండ్‌లైన్ కాలింగ్ ఒకటి. ల్యాండ్‌లైన్ నుంచి ఎవరికైనా ఎక్కడికైనా సరే ఫోన్ కాల్ చేయడానికి ఫోన్ నెంబర్ ముందు ఖచ్చితంగా "0" ను అదనంగా జతచేయవలసి ఉంటుంది. అయితే మొబైల్ నుంచి ఫోన్ కాల్స్ చేయడంలో మాత్రం ఎటువంటి మార్పులను తీసుకురాలేదు.

డెబిట్/క్రెడిట్ కార్డు PIN ఉపయోగంలో మార్పులు
ముందు నుంచి డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు పెట్టడానికి PIN ఖచ్చితంగా ఉండేది. అయితే ఈ సంవత్సరం ఇందులో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. కార్డుల ద్వారా రూ.2000 వరకు ఖర్చు చేయడానికి PIN అవసరం లేకుండా RBI సవరణ చేసింది. అయితే 2021 సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సవరణలో మరిన్ని మార్పులను తీసుకురానున్నది. జనవరి 1 నుంచి కార్డు వినియోగదారులు రూ.5000 వరకు PIN అవసరం లేకుండా ఖర్చు చేసే అవకాశాన్ని అందివ్వనున్నది.


Click it and Unblock the Notifications








