2020లో అధికంగా అమ్ముడైన 5G హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

|

ప్రపంచం మొత్తం ప్రస్తుతం 5G మీద మక్కువను పెంచుకున్నది. ఇందులో భాగంగా 5G హ్యాండ్‌సెట్లలో స్థిరమైన రోల్ అవుట్ రావడంతో 5G స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోంది. వాస్తవానికి సరికొత్త ఐఫోన్‌లు మరియు హై-ఎండ్ ఫీచర్స్ శామ్‌సంగ్ ఫోన్‌లతో సహా చాలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 5G మద్దతు గల స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటినుంచే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ మీద జరిపిన కొన్ని రీసెర్చ్ ల యొక్క తాజా నివేదిక ప్రకారం ఐఫోన్ 12 సిరీస్ తో పాటు శామ్సంగ్, హువాయి మరియు ఒప్పో సంస్థల నుండి వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో 16% వాటా కలిగిన ఆపిల్ ఐఫోన్ 12 & 12 ప్రో
 

5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో 16% వాటా కలిగిన ఆపిల్ ఐఫోన్ 12 & 12 ప్రో

రీసెర్చ్ యొక్క నెలవారీ మార్కెట్ పల్స్ సర్వీస్ ప్రకారం కొత్త ఐఫోన్ 12 5Gu స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 16% మార్కెట్ వాటాను ఆక్రమించింది. ఇది అక్టోబర్‌ నెలలో ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన 5G స్మార్ట్‌ఫోన్ లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఆపిల్ యొక్క ఐఫోన్ 12 ప్రో అక్టోబర్లో అత్యధికంగా అమ్ముడైన 5G మోడల్ లో కూడా ఉంది. ఐఫోన్ 12 మరియు 12 ప్రో కలిసి అక్టోబర్‌లో జరిగిన 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో నాలుగో వంతుకు దగ్గరగా ఉన్నాయి.

అత్యంత ప్రాచుర్యం పొందిన ఆండ్రాయిడ్ 5Gలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G

అత్యంత ప్రాచుర్యం పొందిన ఆండ్రాయిడ్ 5Gలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ కూడా అధిక ప్రజాదరణను పొందింది. అక్టోబర్‌ నెలలో ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ 5G స్మార్ట్‌ఫోన్ ఇదే అవ్వడం గొప్ప విషయం. ప్రపంచంలోని మొత్తం 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 4% మార్కెట్ వాటాతో అత్యధికంగా అమ్ముడైన 5G స్మార్ట్‌ఫోన్ లో మూడవ స్థానంను కలిగి ఉంది.

హువాయి నోవా 7 5G స్మార్ట్‌ఫోన్‌ - అత్యధికంగా అమ్ముడైన 5G జాబితాలో చోటు

హువాయి నోవా 7 5G స్మార్ట్‌ఫోన్‌ - అత్యధికంగా అమ్ముడైన 5G జాబితాలో చోటు

హువాయి నోవా 7 5G స్మార్ట్‌ఫోన్ మొదటిసారి ఏప్రిల్ 2020 లో చైనాలో ప్రారంభించబడింది. ఇది సంస్థ యొక్క సొంత కిరిన్ 985 ప్రాసెసర్ మరియు 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల FHD + OLED డిస్ప్లే ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు హువాయి యొక్క సొంత EMUI 10.1 తో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఫ్లాగ్‌షిప్ హువాయి P40 5G మార్చిలో చైనాలో ప్రారంభించబడింది. ఇది పరిమిత సంఖ్యలో లభించనప్పటికీ ప్రపంచంలోని మొత్తం 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 3% మార్కెట్ వాటాతో ప్రసిద్ధ 5G హ్యాండ్‌సెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

ఒప్పో 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా
 

ఒప్పో 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా

మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ఫీచర్ తో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో A72 5G కూడా ప్రసిద్ధ 5G ఫోన్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఒప్పో A72 5G స్మార్ట్‌ఫోన్ yuan1899 (రూ. 20,220) ధరతో మాలి-G75 GPU ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఒప్పో రెనో 4SE 5G ఫోన్ కూడా చైనాలో 2,499 యువాన్ల (రూ .27,100) బడ్జెట్ ధర వద్ద ప్రారంభించబడి అత్యధికంగా అమ్ముడైన 5G హ్యాండ్‌సెట్లలో ఒకటిగా అవతరించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ 5G కనెక్టివిటీ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల మార్కెట్ వాటా

శామ్‌సంగ్ గెలాక్సీ 5G కనెక్టివిటీ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల మార్కెట్ వాటా

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 5G ఫోన్ అనేది 2020లో 5G కనెక్టివిటీతో ప్రపంచంలో విస్తృతంగా లభించే ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఒకటి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. అలాగే శామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ 5G ఫోన్ కూడా 2020 లో ప్రారంభించిన 5G హ్యాండ్‌సెట్లలో ఇప్పటికీ ఎక్కువ ప్రజాదరణ పొందిన వాటిలో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Worldwide Most Popular 5G Handset Smartphones in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X