ఈ-మెయిల్‌తో పర్యావరణానికి పెను ముప్పు

By Hazarath
|

అవును మీరు విన్నది నిజమే..పర్యావరణాన్ని మీరు పంపే ఈ మెయిల్ నాశనం చేస్తోంది. అది అత్యంత ప్రమాదకరంగా మారింది.దాని ద్వారా అనేక రకాలైన వ్యర్థాలు బయటకు విడుదలవుతున్నాయి. మెకాపీ అధ్యయనంలో వెల్లడయిన ఈ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. మీరు పంపే ఈ -మెయిల్స్ ఓ కారు కిలో మీటరు దూరం నడిపితే వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ తో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఆసక్తిగొలుపుతున్న కథనం స్లైడర్ లో..

Read more: 25 సంవత్సరాల్లో ముఖ్యమైన ఆవిష్కరణలు

మనం పంపే ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా

మనం పంపే ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా

రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా భారీ సంఖ్యలో ఈ-మెయిల్స్ పంపుతున్నారా? ఇతరులకు సమాచారాన్ని చేరవేయడం పక్కన పెడితే.. మనం పంపే ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మనం పంపే ఈ-మెయిల్ నాలుగు గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్..

మనం పంపే ఈ-మెయిల్ నాలుగు గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్..

మనం పంపే ఈ-మెయిల్ నాలుగు గ్రాముల (0.14 ఔన్సుల) కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) వాతావరణంలోకి విడుదల చేస్తుందట.

ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే..

ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే..

ఇక ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే.. దాదాపు 50 గ్రాముల సీవో2ను గాలిలోకి విడుదల చేస్తున్నదని మెకాఫీ సంస్థకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.

ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా..

ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా..

ప్రతీ రోజు ఓ వ్యక్తి 65 ఈ-మెయిల్ పంపడం, ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

స్పామ్ ఈ-మెయిల్ కూడా 0.3 గ్రాముల సీవో2

స్పామ్ ఈ-మెయిల్ కూడా 0.3 గ్రాముల సీవో2

మనం ఓపెన్ చేయనటువంటి స్పామ్ ఈ-మెయిల్ కూడా 0.3 గ్రాముల సీవో2 విడుదల చేస్తున్నదనే అంశాన్ని పరిశోధకులు వెల్లడించారు.

1 లక్షల మంది కారు యజమానులు వినియోగించే..

1 లక్షల మంది కారు యజమానులు వినియోగించే..

ఏడాదికి స్పామ్ ఈ-మెయిల్స్ వల్ల వెలువడే గ్రీన్‌హౌజ్ వాయువులు.. 31 లక్షల మంది కారు యజమానులు వినియోగించే రెండు వందల కోట్ల గ్యాలన్ల చమురుకు సమానమని తెలిపారు. అలాగే ప్రతీ ప్లాస్టిక్ బ్యాగ్‌తో 10గ్రాముల కర్బనం విడుదలవుతుందని పేర్కొన్నారు.

కంప్యూటర్లు, సర్వర్లు, రూటర్లుతోపాటు కారు డ్రైవింగ్

కంప్యూటర్లు, సర్వర్లు, రూటర్లుతోపాటు కారు డ్రైవింగ్

కంప్యూటర్లు, సర్వర్లు, రూటర్లుతోపాటు కారు డ్రైవింగ్, వెలుతురు కోసం లైట్ స్విచ్ వేయడం, చిన్న ఎస్సెమ్మెస్ పంపడం లాంటి పనుల వల్ల పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని మెకాఫీ పరిశోధకులు వెల్లడించారు.

24 అంగుళాల ప్లాస్మా టెలివిజన్ చూడటం ద్వారా..

24 అంగుళాల ప్లాస్మా టెలివిజన్ చూడటం ద్వారా..

కాలక్షేపం కోసం రెండు గంటలపాటు 24 అంగుళాల ప్లాస్మా టెలివిజన్ చూడటం ద్వారా 440 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని పరిశోధకులు తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write What's the Carbon Footprint of an Email?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X