100 కోట్ల వైపు వాట్సప్ పరుగులు

Written By:

స్మార్ట్ ఫోన్ల రాకతో మేసేజ్ యాప్స్ తమ సత్తాను చాటుతున్నాయి. మనుషులు పక్కనే ఉన్నా కాని ఫోన్ లో మేసేజ్ లు చేస్తారే తప్ప డైరక్ట్ గా మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మేసేజ్ లు ఇచ్చినంత ఈజీగా కూడా వారు డైరక్ట్ గా మాట్లాడలేరు..అందుకే మేసేజ్ యాప్స్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతున్నాయి. ఇందులో భాగంగా వాట్స్ ఆప్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. మరి వాట్సప్ కు ఎంతమంది వినియోగదారులు ఉన్నారు..ఏయే వయస్సుల వారు వాడుతున్నారు..దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:ఫేస్‌బుక్‌లో ఉద్యోగాలివే బాసూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దూసుకుపోతున్న వాట్సప్

గూగుల్ హ్యాంగ్ అవుట్స్, వి చాట్ వంటివి తీవ్ర పోటీ ఇస్తున్నప్పటికీ వాట్సప్ ని ఎవరూ బీట్ చేయలేకపోతున్నారట.

90 కోట్లకు

రోజురోజుకు వాట్సప్ ని వినియోగించేవారు పెరిగిపోతున్నారని ఇప్పుడు ఆ సంఖ్య 90 కోట్లకు చేరిందని వాట్సాప్ సీఈవో జాన్ కోమ్ చెప్పారు.

ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను కొన్న తర్వాత ప్రజాదరణ

ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను కొన్న తర్వాత ప్రజాదరణ మరింత పెరిగిందన్నారు.

ఐదు నెలల్లోనే 10 కోట్ల మంది

గత ఏప్రిల్ లో వాట్సాప్ వినియోగదారులు 80 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఐదు నెలల్లోనే 10 కోట్ల మంది కొత్తగా చేరానని ఆయన తెలిపారు.

అన్ని వర్గాల, వయసుల ప్రజలు వాడుతున్నారంటూ హర్షం

ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ను అన్ని వర్గాల, వయసుల ప్రజలు వాడుతున్నారని జాన్ కోమ్ సంతోషం వ్యక్తంచేశారు.

ఐదు నెలల కాలంలోనే కొత్తగా 10 కోట్ల మంది వాట్సప్‌ యూజర్లు

గత ఐదు నెలల కాలంలోనే కొత్తగా 10 కోట్ల మంది వాట్సప్‌ యూజర్లుగా మారారు. దీన్ని బట్టి వాట్సప్‌ కున్న క్రేజ్‌ ఎంతో తెలుస్తుంది.

ప్రస్తుతం వాట్సప్‌కు 90 కోట్ల మంది యూజర్లు

ప్రస్తుతం వాట్సప్‌కు 90 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లున్నారని వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కౌమ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకున్నందుకు జాన్‌ను ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అభినందించారు.ఫేస్‌బుక్‌ సిఒఒ షెరిల్‌ సాండ్‌బర్గ్‌ కూడా అభినందనలు తెలియజేశారు.

గూగుల్ తో పోటీ పడి మరీ అధిక ధరకు

వాట్సప్‌ను సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ గత ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్ తో పోటీ పడి మరీ అధిక ధరకు ఫేస్ బుక్ వాట్సప్ ను సొంతం చేసుకుంది.

1,900 కోట్ల డాలర్లకు డీల్‌

1,900 కోట్ల డాలర్లకు ఈ డీల్‌ కుదిరింది. ఇంత భారీ మొత్తంలో వాట్సప్‌ కోసం చెల్లించడం అప్పట్లో సంచలనం కూడా రేపింది.

వాట్సప్ పై కొత్త చట్టం

సోషల్ మీడియాలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న వాట్సప్ పై కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దానిని నిషేదించాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. మరి అది కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

భారతదేశంలోనే దాదాపు 7 కోట్లు

60 కోట్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నప్పుడు అందులో మన భారతదేశంలోనే దాదాపు 7 కోట్లు ఉన్నారు.

భారత్ లో 10 కోట్లు దాటి ఉంటుందని అంచనా

ఉన్నారు.ఇప్పుడు 90 కోట్లకు వాట్సప్ చేరింది.మరి ఈ సంఖ్య భారత్ లో 10 కోట్లు దాటి ఉంటుందని అంచనా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile messaging app WhatsApp now has 900 million regular and active users around the world, following the addition of 100 million users in last five months.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot