డెస్క్‌టాప్ వాట్సప్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

Written By:

స్మార్ట్‌ఫోన్లను వాడుతూ, సామాజిక మాధ్యమం వాట్సప్‌లో చక్కర్లు కొట్టే వారికి శుభవార్త. మీరు వాడే కంప్యూటర్ లో సైతం వాట్సప్‌ను లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పుడు దగ్గరైంది. అటు విండోస్, ఇటు మాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధారిత కంప్యూటర్లలో పనిచేసే వాట్సప్ వర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ వెల్లడించింది.

Read more : వాట్సప్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్ వస్తోంది

డెస్క్‌టాప్ వాట్సప్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

ఇది స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌తో సింక్ అయి వుంటుందని, స్మార్ట్‌ఫోన్లో యాప్ ఉంటేనే డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారని వాట్సప్ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ వెల్లడించింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే, https://www.whatsapp.com/download ను సందర్శించాల్సి వుంటుంది. అక్కడ కనిపించే విండోస్ (వర్షన్ 8 కన్నా లేటెస్ట్ అయ్యుండాలి), మ్యాక్ (10.9 వర్షన్ కన్నా లేటెస్ట్ అయ్యుండాలి) లింక్‌లను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary
Here Write WhatsApp just released desktop apps for Mac and Windows
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting