వాట్సప్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్ వస్తోంది

By Hazarath
|

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా వాట్సప్..వాట్సప్ అంటూ కలవరిస్తున్నారు. అయితే వాట్సప్ తమ కష్టమర్ల కోసం ఇప్పుడు ఓ అద్భుతమైన ఆఫర్ ని తీసుకొస్తోంది. అదే వీడియో కాలింగ్. ఇప్పటికే ఉన్న స్కైప్ అలాగే ఆపిల్ ఫేస్ టైం అలాగే ఐఎమ్ఓ వంటి యాప్స్‌కు ధీటుగా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ కసరత్తులు చేస్తోంది.డేటా కనెక్షన్ ఉపయోగించుకుని వినియోగదారులు ఫేస్ టూ ఫేస్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

Read more: మొబైల్ లేకుండానే వాట్సప్‌లో ఛాట్..

ఈ ఫీచర్ తో పాటు మేజర్ ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు వాట్సప్ రెడీ అవుతోంది. కాల్ బ్యాక్‌, వాయిస్ మెయిల్‌, జిప్ ఫైల్ షేరింట్ వంటివి సపోర్ట్ చేసేవిధంగా వాట్సప్‌ను తీర్చిదిద్దుతోంది. ఆండ్రాయిడ్ పోలీసు వెబ్‌సైట్ కథనం ప్రకారం బెటా వెర్షన్ వాట్సప్‌ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్‌ త్వరలోనే యాప్‌ కు చేర్చే అవకాశముందని, దీని స్క్రీన్‌ షాట్స్‌ను కూడా అది పోస్టు చేసింది. నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచే వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్‌పై వదంతులు షికారు చేస్తున్నాయి. ఇదిగో వచ్చింది.. అదిగో వచ్చింది అంటూ దీని గురించి ఊరిస్తూ కథనాలు వచ్చాయి.

Read more: శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు లేనేలేదు

ఇతర భాషల నుంచి అనువదించుకునే స్ట్రీంగ్స్‌ను వాట్సప్‌ యాడ్ చేసిన తర్వాత వీడియో కాల్ వచ్చేసిందంటూ కొన్ని దేశాల్లో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిస్ కాల్ ఫీచర్‌ ను జోడించిన వాట్సప్‌ త్వరలోనే వీడియో కాల్‌ అవకాశాన్ని కూడా చేర్చవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.వాట్సప్‌లో ఉన్న ఫీచర్స్ పై ఓస్మార్ట్ లుక్కేద్దాం.

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ కొత్తగా ఈ అన్ రీడ్ మార్క్ ను ప్రవేశపెట్టింది. మీకు ఇతరులు పంపిన మెసేజ్ చూడకపోయినా చూసినట్లు పంపినవాళ్లకు తెలుస్తోంది. దీంతో మీరు మెసేజ్ ఇంకా చూడకపోయినా పంపిన వాళ్లు చూసారని అనుకుంటారు. ఇప్పటికే ఉన్న మార్క్ మెసేజ్ కు ఇది పూర్తిగా భిన్నమయినది.

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ కొత్తగా కష్టమ్ నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ ఫీచర్ సింగిల్ కాంటాక్ట్స్ కు మాత్రమే వర్తిస్తుంది.ఉదాహరణకు నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కు ఏదైనా రింగ్ టోన్ పెట్టుకోవాలనుకుంటే సాంగ్ ను సెలక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న పర్సన్ నుంచి కాల్ లేదా మేసేజ్ రాగానే ఆ రింగ్ టోన్ నీకు వినిపిస్తుంది.

వాట్సప్ ఫీచర్స్
 

వాట్సప్ ఫీచర్స్

ఇప్పుడున్న మ్యూట్ ఆప్సన్ ఓన్లీ గ్రూప్ కన్వర్షన్ కు మాత్రమే ఉపయోగపడుతోంది. అయితే కొత్తగా వచ్చిన ఫీచర్ తో సింగిల్ కాంటాక్ట్ ను కూడా మ్యూట్ చేసుకోవచ్చు. ఏ కాంటాక్ట్ నైనా మ్యూట్ లో పెట్టుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ సెలక్ట్ చేసుకుని మెనూ బార్ లో కెళ్లి మ్యూట్ బటన్ సెలక్ట్ చేసుకుంటే చాలు. ఇందులో నీకు మ్యూట్ టైం కూడా కనిపిస్తుంది.

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ కాల్స్ వాట్సప్ లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ తో మీకు వాట్సప్ కాల్ ఎక్కువైతే డాటా ను రెడ్యూజ్ చేసుకోమని అడుగుతుంది. ఛాట్, కాల్స్ కు సంబంధించిన మెనూ సెట్టింగ్ లోకి వెళితే అందులో లో లో డాటా యూజేజ్ అని కింద ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే చాలు మీ డాటా సేవ్ గురించి అడుగుతుంది.

వాట్సప్ ఫీచర్స్

వాట్సప్ ఫీచర్స్

ఈ పీచర్ నిజం కాదని చాలా రోజుల నుంచి రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే అవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. నీవు చాట్ చేసిన తరువాత దాన్ని గూగుల్ అకౌంట్ లో భద్రపరుచుకోవచ్చు. ఇది నీవు చెక్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ ఆప్సన్ లోకి వెళ్లి సెట్టింగ్ లో నెట్ వర్క్ యూజేజ్ మెనూ డాటా consumption గురించి వివరాలు అడుగుతుంది. అది ఫూర్తి కాగానే నీ డాటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. ఇందులో నీ మేసేజ్ లు,ఫోటోలు,వీడియోస్,వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here Write WhatsApp may soon allow video calls

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X