వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్న డిమార్ట్ గిఫ్ట్ మెసేజ్!! నమ్మోరో అంతే సంగతులు...
వాట్సాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్ లను ఉపయోగించి స్కామర్లు పౌరులను మోసగించడానికి సాధారణ సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఉచిత బహుమతులు ఇస్తామని హామీ ఇస్తామని తెలుపుతూ ప్రస్తుతం వాట్సాప్ సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త మెసేజ్ హల్ చల్ చేస్తున్నది. వివరాలలోకి వెళితే డిమార్ట్ తన 20 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలుపుతూ వాట్సాప్‌లో కొత్త మెసేజ్ వైరల్ అవుతున్నది. ఈ వేడుకలో భాగంగా సంస్థ వినియోగదారులకు ఉచిత బహుమతులు ఇస్తోందని తెలుపుతూ నకిలీ వెబ్‌సైట్‌తో కూడిన లింక్ తో మెసేజ్ వైరల్ అవుతున్నది.

వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఫార్వర్డ్ మెసేజ్ లోని లింక్‌పై క్లిక్ చేస్తే నకీలీ వెబ్‌పేజీ ఓపెన్ చేయబడుతుంది. ప్రత్యేకమైన బహుమతిని గెలుచుకోవడానికి వినియోగదారులను అందులోని చక్రం తిప్పమని అడుగుతుంది. పౌరులను మోసం చేయడానికి తమ నిజాయితీని తెలుపుతూ ప్రతి ఒక IPకి ఒక బహుమతి మాత్రమే అనుమతించబడుతుంది అని చూపుతుంది.

వినియోగదారులు బహుమతులను పొందటానికి తెరపై కనిపించే సూచనలను అనుసరించమని కోరతారు. తాము గెలుచుకున్న బహుమతిని క్లెయిమ్ చేయడానికి ఈ ‘ఉచిత బహుమతి' పోటీని మీకు తెలిసిన ఇతర స్నేహితులతో పంచుకోవాలని సూచిస్తుంది. ఇందులో భాగంగా "వాట్సాప్‌లో 5 గ్రూపులు / 20 మంది స్నేహితులతో పంచుకోండి" అని చూపుతుంది. స్క్రీన్‌పై బ్లూ బార్ నిండినంత వరకు వినియోగదారులు తప్పనిసరిగా ఈ మెసేజ్ ను ఇతరులకు షేర్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బహుమతి కార్డును క్లెయిమ్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయమని కోరతారు.

ఆన్‌లైన్ మోసాలలో భాగంగా పౌరులను మోసగించడానికి ఉపయోగించే నకిలీ మరియు మోసపూరిత పద్ధతిలో ఇది కూడా ఒకటి అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మెసేజ్ లు ఎన్ని వచ్చిన కూడా మోసానికి గురికావద్దు అని ప్రభుత్వం చాలా సందర్భాలలో తెలిపింది. ఎటువంటి కంపెనీ అయినా అది పెద్దది లేదా చిన్నది కూడా కావచ్చు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇటువంటి పథకాలను ఖచ్చితంగా అమలు చేయదు. ఆన్‌లైన్ పద్దతిలో వినియోగదారులకు ఉచిత బహుమతులను అందించే అవకాశం లేదు.

ఇటువంటి మెసేజ్ లను నివారించడం మరియు వాటిని మీ వాట్సాప్ స్నేహితులకు ఫార్వార్డ్ చేయకుండా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. వీటిని షేర్ చేయడం వలన మీ కారణంగా మీ స్నేహితులు ఆన్‌లైన్‌లో జరిగే ఇలాంటి మోసాలకు గురవుతారు. కావున మీ కారణంగా ఇతరులు మోసపోవడం అంత మంచిది కాదు.


Click it and Unblock the Notifications








