ఆ ఒక్కఫోన్ కాల్ ఇండియా రాతను మార్చి వేసింది

|

భారత పరిశోధన శక్తిని ఖండాతరాలకు చాటి చెప్పిన అస్త్రం అగ్ని. ప్రపంచదేశాలకు భారత ఆయుధ శక్తిని రుచి చూపించిన శక్తివంతమైన క్షిపణిపై అమెరికా తన కుట్రలకు తెరలేపిందా...అది ఆపేందుకు కుయుక్తులు పన్నిందా..అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అగ్నిని ఆపాలని అప్పుడు మన మిస్సైల్ మ్యాన్ కలాంకు ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని కలాం తన పుస్తకంలో స్వయంగా వెల్లడించారు.అయినా దేశ పతాకాన్ని ప్రపంచదేశాల పక్కన సగర్వంగా నిలపాలని మిస్సైల్ మ్యాన్ ఆ ఒత్తిళ్లకు లొంగలేదు. అప్పుడు కలాంకు వచ్చిన కాల్ మన దేశ రాతను మార్చివేసిన కాల్ అని చెప్పాలి. అది ఎలానో మీరే చూడండి.

 

Read more: పెద్దన్న విశ్వరూపానికి అమాయకులు బలి

రెండు ప్రయోగాలు విఫలం

రెండు ప్రయోగాలు విఫలం

అప్పటికే రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి తినడానికి సరిగ్గా తిండిలేదు. బాలాసోర్ లో 72 గంటల పాటు సైట్ లోనే జీవితం. ఎప్పుడూ కూల్ గా ఉండే కలాం ఆరోజు ఎంత టెన్సన్ పడ్డారో అక్కడున్న వారిని అడిగితే తెలుస్తుంది.

ఓ పక్క హేళనలు

ఓ పక్క హేళనలు

ఓ పక్క హేళనలు మరో పక్క ఈ ప్రయోగం కూడా ఫెయిల్ అవుతుందా లేక విజయవంతమవుతుందా అన్న సందేహాలు..ఇలా అణుక్షణం కలాం అప్పుడు చిత్రవధ అనుభవించారు. ఓ దశలో ఈ ప్రయోగం ఫెయిల్ అయితే నేను శాశ్వతంగా పరిశోధన రంగం నుంచి నిష్క్రమిస్తానంటూ అప్పటికే శపధం కూడా చేశారు.

కలాం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలోనే అగ్రదేశాలు నుంచి ..
 

కలాం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలోనే అగ్రదేశాలు నుంచి ..

ఇలా కలాం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలోనే అగ్రదేశాలు నుంచి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ రాయబారాలు.మనదేశం ఆయుధరంగంలో దూసుకుపోతుందని పసిగట్టిన అగ్రరాజ్యాలు కుటిలనీతికి తెరలేపాయి. ప్రయోగాన్ని ఆపాలంటూ కలాంపై ఒత్తిడి తెచ్చాయి. కష్టాలకు వెరవని ధైర్యమున్న కలాం సారీ అంటూ వారికి తన మాటగా చెప్పారు.

 అది మే 22, 1989

అది మే 22, 1989

అవును అది మే 22, 1989. భారత్ ‘అగ్ని' క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొన్నిగంటల్లో ప్రయోగం జరుగుతుందనగా.. ఆరోజు వేకువజామున 3 గంటలకు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఇండియన్ మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఓ ఫోన్ వచ్చింది. ‘ప్రయోగం ఎంతవరకు వచ్చింది? దాన్ని ఆపాలని అమెరికా, నాటో కూటమినుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది' అని కాల్ సారాంశం. కలాం మదిలో ప్రశ్నలు మెదిలాయి.

ఇప్పుడేమీ చేయలేం

ఇప్పుడేమీ చేయలేం

అయినా.. అప్పుడిక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకుని ‘ప్రయోగాన్ని ఆపే స్థితి దాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేం' అని చెప్పారు. ఆరోజు తెల్లవారాక ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్నిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాలు కలాం చివరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా' లో ఉన్నాయి.

అగ్ని ప్రయోగం అత్యంత కీలక ఘట్టం

అగ్ని ప్రయోగం అత్యంత కీలక ఘట్టం

అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్ని ప్రయోగం అత్యంత కీలక ఘట్టం. భారత్ అమ్ముల పొదిలో అత్యుత్తమ క్షిపణిగా నిలిచిన అగ్ని ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నాటో, అమెరికాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎందుకు వచ్చింది. 1989లో అగ్ని క్షిపణి పరీక్షించే సమయంలో ప్రయోగాన్ని ఆలస్యం చేయాలనే సందేశాన్ని హాట్‌లైన్ ఫోన్‌కాల్ ద్వారా దాని రూపకర్త, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఎందుకు అందుకున్నారు.ఎన్నో ప్రశ్నలు ఈ ఫోన్ కాల్ తో మన ముందుకు వచ్చాయి.

 శేషన్ ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి క్యాబినెట్ కార్యదర్శి

శేషన్ ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి క్యాబినెట్ కార్యదర్శి

మరి కలాంకు ఆ సందేశాన్ని అందించింది ఎవరో కాదు.. టీఎన్ శేషన్. ఆ సమయంలో శేషన్ ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి క్యాబినెట్ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఈ విషయాన్ని అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రం చాలెంజ్ టు అపర్చునిటీ అనే పుస్తకంలో కలాం స్వయంగా వెల్లడించారు.

ఉదయం 3 గంటలకు హాట్‌లైన్ ద్వారా టీఎన్ శేషన్ నుంచి ఫోన్

ఉదయం 3 గంటలకు హాట్‌లైన్ ద్వారా టీఎన్ శేషన్ నుంచి ఫోన్

పుస్తకంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 1989 మే 22న అగ్ని ప్రయోగానికి కొద్దిగంటల ముందుగా ఉదయం 3 గంటలకు హాట్‌లైన్ ద్వారా టీఎన్ శేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్ పరమార్థం మంచిగా గోచరించలేదు అని పేర్కొన్నారు.ఫోన్‌లో నా జవాబు వినకుండానే అగ్ని ప్రయోగ కార్యక్రమంలో మనం ఏ దశలో ఉన్నాం. మనపై అమెరికా, నాటోల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. వారితో మనకు అనేక దౌత్యపరమైన ప్రయోజనాలున్నాయి . అగ్ని ప్రయోగాన్ని ఆలస్యం చేసే మార్గమేమైనా ఉందా? అని శేషన్ అడిగినట్లు కలాం తెలిపారు.

అగ్ని ప్రయోగ ప్రక్రియలో మనం ఏదశలో..

అగ్ని ప్రయోగ ప్రక్రియలో మనం ఏదశలో..

తాను జవాబు ఇచ్చేంతలోపే మరోసారి మళ్లీ అగ్ని ప్రయోగ ప్రక్రియలో మనం ఏదశలో ఉన్నామని అడిగారని పుస్తకంలో పేర్కొన్నారు. అగ్ని ప్రయోగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘావర్గాల సమాచారం తనకు అందిందని.. ప్రధాని, పీఎంవోపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నదనే విషయం తెలుసునని కలాం అడ్వాంటేజ్ ఇండియాలో వెల్లడించారు.

అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక

అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చండీపూర్ ప్రాంతాన్ని తుఫాన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టే అవకాశాలున్నాయనే విషయం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. అసలు అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక జరిగింది. పరిమితమైన బడ్జెట్, సాంకేతిక సౌకర్యాలు అందకపోవడం, ఇతర దేశాల నుంచి తొలగింపులు, మీడియా ఒత్తిడి లాంటి అనేక అంశాలు, సమస్యలు ప్రాజెక్టుకు అడ్డంకిగా నిలిచాయి.

అహర్నిశలు కష్టపడుతున్నారు అనే విషయం

అహర్నిశలు కష్టపడుతున్నారు అనే విషయం

ఇలాంటి సమస్యలన్నింటిని అధిగమించి.. అగ్ని క్షిపణి ప్రయోగాన్ని సాకారం చేసేందుకు మహిళలు, పురుషులతో కూడిన శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు అనే విషయం తన మదిలో మెదిలిందని తన పుస్తకంలో కలాం పేర్కొన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం నిలిపివేసే అవకాశం లేదు

ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం నిలిపివేసే అవకాశం లేదు

ఇలాంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత.. తన గొంతు సవరించుకొని సర్.. ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం నిలిపివేసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రయోగాన్ని వాయిదా వేసుకోలేం. ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించారు అని చెప్పానని కలాం పేర్కొన్నారు.

అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ..

అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ..

అయితే ఈ విషయంపై సుదీర్ఘమైన వాదన జరుగుతుందని భావించిన తనకు ఆశ్చర్యకరమైన రీతిలో.. ఒకే అయితే అలానే కానివ్వండి అని తన బాస్ శేషన్ ఉదయం 4 గంటల సమయంలో ఫోన్ పెట్టేశారని తెలిపారు. ఈ ఘటన అనంతరం మూడు గంటల తర్వాత 1989 మే 22న అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ దూసుకుపోయింది.

ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ చరిత్రను..

ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ చరిత్రను..

ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ చరిత్రను తిరగరాసింది. మరుసటి రోజున చండీపూర్‌లోని క్షిపణి ప్రయోగ వేదికను తుఫాన్ పాక్షికంగా దెబ్బతీసింది. అయితే అప్పటికే అగ్ని ప్రయోగాన్ని సఫలం చేశామని విజయగర్వంతో మేమంతా ఉన్నాం అని కలాం తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఆనాడు ఈ ప్రయోగం ఆపి ఉంటే..

ఆనాడు ఈ ప్రయోగం ఆపి ఉంటే..

ఆనాడు ఈ ప్రయోగం ఆపి ఉంటే భారత్ పరిశోధన రంగంలో ఇప్పుడు ఎక్కడ ఉండేది. అగ్ర దేశాల ముందు తలెత్తుకుని జీవించేదా..వారి చేత ఔరా అని అనిపించుకునేదా...అగ్ని 1,2.3.4,5 ఇలా వరుసగా భారత్ అస్త్రాలు మన ముందుకు వచ్చేవా.. నాటి నేంచి నేటి దాకా కుట్రలు కుతంత్రాలు.

ప్రపంచ పటంలో ఇండియాని చూసేందుకు..

ప్రపంచ పటంలో ఇండియాని చూసేందుకు..

ప్రపంచ పటంలో ఇండియాని చూసేందుకు అగ్రదేశాలు ఇష్టపడటం లేదు.అందుకే ఎప్పుడూ అవాంతారాలు సృష్టిస్తూనే ఉన్నాయి.

సొంత పట్టణం రామేశ్వరానికి..

సొంత పట్టణం రామేశ్వరానికి..

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సంబంధించిన వస్తువులను ఆయన సొంత పట్టణం రామేశ్వరానికి తరలించారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో కలాం నివసించిన ఇంటి నుంచి వస్తువులను ఆయన సొంతూరుకు తరలించారు కూడా.

రామేశ్వరంలోనే కలాం స్మారక మందిరాన్ని..

రామేశ్వరంలోనే కలాం స్మారక మందిరాన్ని..

రాజాజీ మార్గ్‌లో కలాం నివసించిన నివాసాన్ని స్మారక మందిరంగా, లేదా నాలెడ్జ్ సెంటర్‌గా మార్చాలని లేదా రాజధానిలోని మరో ప్రదేశంలోనైనా మెమోరియల్‌ను నిర్మించాలని కేంద్రానికి ఆయన కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే రామేశ్వరంలోనే కలాం స్మారక మందిరాన్ని నిర్మిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఆయన వస్తువులు, పెద్ద సంఖ్యలో పుస్తకాలను తమిళనాడులోని సొంత పట్టణం రామేశ్వరంకు తరలించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాజలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లకి చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write When Kalam got a hotline call just before Agni launch!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X