కేక పుట్టిస్తున్నఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఫీచర్స్

Written By:

ఆండ్రాయిడ్ వర్షన్ లో రానున్న తరువాతి తరం వెర్షన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ రిలీజ్ కు ముందు అదిరే ఫీచర్లతో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వెర్షన్ ముందుగా గూగుల్ స్మార్ట్ ఫోస్స్ కు మాత్రమే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీంతో పాటు మార్కెట్లోకి త్వరలో రానున్నఎల్‌జీ వి20 కి కూడా అప్ డేట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో కి అప్ డేట్ గా వస్తున్న నౌగట్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు రాబోతుంది.

ఊరిస్తున్న జియో కమర్షియల్ లాంచ్ డేట్ అదేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విఆర్‌ టెక్నాలజీ

రానున్న వెర్షన్ వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీకి మరింతగా సహకరిస్తుంది. డేడ్రీమ్‌ ఫీచర్‌ అప్‌డేట్‌తో మరింత సరికొత్త అనుభూతితో వీడియోలు వీక్షించే వీలుంటుంది.

డైరెక్ట్‌ రిప్లై టు నోటిపికేషన్స్‌

మన స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌కు ఈ అప్ డేట్ లో న్యూ టెంప్లెట్‌ ఉంటుంది. అందులో వాట్సప్‌ నోటిఫికేషన్‌, ఫేస్‌బుక్‌ లైక్‌, ట్వీటో కనిపిస్తే.. ఆ టెంప్లెట్‌ను ఓపెన్‌ చేసి అక్కడి నుంచే డైరెక్ట్‌గా రిప్లై ఇవ్వవచ్చు.

మల్టీ విండో

రానున్న ఆండ్రాయిడ్‌ కొత్తవెర్ష్షన్‌లో మల్టీ విండో ప్రధాన ఆకర్షణ. సిస్టమ్‌లో లాగా ఒకటి కంటే ఎక్కువ విండోలను ఓపెన్‌ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా ఒకేసారి రెండు యాప్స్‌ను ఓపెన్‌ చేసి పక్క పక్కన ఉంచి చూసుకునే అవకాశం కల్పించారు.

క్విక్‌ సెట్టింగ్స్‌

ఐకాన్స్‌ సెట్టింగ్స్‌ విషయంలో ఈ ఫీచర్ మరింత మెరుగులతో వస్తోంది. ఒకే స్వైప్‌తో ఫ్లాష్‌లైట్‌, వైఫై, బ్లూటూత్ లాంటివే కాకుండా మనకు నిత్యం ఉపయోగపడే ఐకాన్స్‌ మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్‌లో సెట్‌ చేసుకోవచ్చు.

బ్యాటరీలైఫ్‌

బ్యాటరీ లైఫ్‌ను మరింత పెంచేందుకు గతేడాది డోచ్‌ అనే ఫీచర్‌ను మార్స్‌మాలో వెర్షన్‌లో పరిచయం చేశారు. తాజా ఆండ్రాయిడ్‌ 7.0 లో ఇది మరోసారి అప్‌డేట్‌ అయింది. అనవసరమైన యాప్స్‌తో చార్జింగ్‌ ఖర్చుకాకుండా ఈ ఓఎస్‌ చూసుకుంటుంది. బ్యాటరీలైప్ ను పెంచుతుంది.

ప్రకటనల నోటిఫికేషన్

మీరు లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్లను సైలెంట్ లోకి పెట్టుకోవచ్చు.అలాగే టర్న్ ఆఫ్ చేయవచ్చు.

Android Nougat performance

ఈ ఫీచర్ ద్వారా గేమ్స్ ప్రియులు చెప్పలేని మధురానిభూతిని పొందుతారు.బెటర్ గ్రాఫిక్స్ తో గేమ్స్ ప్రియులను ఈ ఫీచర్ ఇట్టే కట్టిపడేస్తుంది.

 

 

ఇతర ఫీచర్లు

రానున్న ఈ కొత్త వెర్షన్‌లో దాదాపు 250 ఫీచర్స్‌ అప్‌డేట్‌ అయ్యాయని తెలుస్తోంది. త్వరలో గూగుల్‌ ఫోన్స్‌, ఎల్‌జీ ఫోన్స్‌ అప్‌డేట్‌ కానున్న ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0 ఆ తర్వాత సాంసంగ్‌, సోనీ, ఎమ్‌ఐ లాంటి స్మార్ట్‌ఫోన్స్‌లోనూ అప్‌డేట్‌ అవుతుంది.అప్పుడ కాని దీని గురించి పూర్తి సమాచారం తెలియదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write when youll get Android Nougat and everything you need to know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot