ఊరిస్తున్న జియో కమర్షియల్ లాంచ్ డేట్ అదేనా..?

Written By:

ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ఫీవర్ కనిపిస్తోంది. అదే రిలయన్స్ జియో ఫీవర్..ఈ ఫీవర్ మార్కెట్ మొత్తాన్ని షేక్ చేసి పడేస్తోంది. అయితే గతేడాది నుంచి జియో లాంచ్ కు సంబంధించిన సమాచారం వినియోగదారులను ఊరిస్తుందే కాని ఎప్పుడు కమర్షియల్ గా లాంచ్ అవుతుందో తెలియని పరిస్థితి. దాని అధినేత ముఖేష్ అంబాని సైతం ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఈ నేపథ్యంలో జియో లాంచ్ ఎప్పుడు అనేది సెప్టెంబర్ 1న జరగనున్న కంపెనీ యాన్యువల్ మీటింగ్ లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కమర్షియల్ లాంచ్ డేట్ ఎప్పుడనేది కూడా ముందే లీకయినట్లుగా తెలుస్తోంది.

90 రోజుల తర్వాత జియో పరిస్థితి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టెంబర్ 1న అనౌన్స్ చేసే అవకాశాలు

రిలయన్స్ జియో కమర్షియల్ లాంచ్ కు సంబంధించిన ప్రకటనను జియో అధినేత ముఖేష్ అంబాని సెప్టెంబర్ 1న అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈమేరకు  సమాచారం లీకయినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి

సెప్టెంబర్ 1న కంపెనీ Annual General Meeting

లీకయిన సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 1న కంపెనీ Annual General Meeting ఉన్న నేపథ్యంలో ముఖేష్ అంబాని ఆ రోజు షేర్ హోల్డర్లకు అలాగే ఇన్వష్టర్లకు జియో కమర్షియల్ లాంచ్ డేట్ గురించి తెలిపే అవకాశం ఉంది.

ఇండియా మొత్తం ఈ జియో సర్వీసుల కోసం

ఇప్పటికే ఇండియా మొత్తం ఈ జియో సర్వీసుల కోసం ఎదురుచూస్తోంది. గతేడాది రిలయన్స్ ఫ్యామిలీకి మాత్రమే రిలయన్స్ జియో బేటా ఆఫర్ ని లాంచ్ చేశారు. అక్కడ నుంచి జియో సునామి మొదలై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది.

జియో ప్రివ్యూ ఆఫర్ అంటూ మార్కెట్లో ప్రకంపనలు

అదే తరుణంలో ఈ ఏడాది జియో ప్రివ్యూ ఆఫర్ అంటూ మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తించారు. అలాగే కంపెనీ ఎల్వైఎఫ్ హ్యాండ్ సెట్లతో 4జీ మార్కెట్లో మరింతగా దూసుకుపోయిన విషయం విదితమే.

జియో కమర్షియల్ లాంచ్ డిసెంబర్ 28న

అయితే మీటింగ్ లో ముఖేష్ అంబాని అనౌన్స్ చేసే కమర్షియల్ డేట్ పై కొన్ని కధనాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 1న జరగనున్న సమావేశంలో జియో కమర్షియల్ లాంచ్ డిసెంబర్ 28న విడుదల చేస్తామనే ప్రకటన రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతేడాది రిలయన్స్ జియో బేటా లాంచ్ కూడా డిసెంబర్ 28నే

ఎందుకంటే గతేడాది రిలయన్స్ జియో బేటా లాంచ్ కూడా డిసెంబర్ 28నే జరిగింది. ముంబైలో అట్టహాసంగా జరిగిన బేటా లాంచ్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ సందడి చేశారు. షారూఖ్ ఖాన్ . ఎఆర్ రెహ్మాన్ ముఖ్య అతిధిలుగా ఈవెంట్ దుమ్మురేపింది.

డిసెంబర్ 28న స్పెషాలిటీ ఏంటి

అయితే డిసెంబర్ 28న స్పెషాలిటీ ఏంటి అనే డౌటు రావచ్చు. ఆ రోజు రిలయన్స్ ప్రస్థానానికి బాటలు పరిచిన ధీరూభాయి అంబాని పుట్టినరోజు. అదే రోజు ఆయన జయంత్యుత్సవాల్లో ఈ ఆనందకరమైన ప్రకటన చేసే అవకాశం ఉందనే వదంతులు వినిపిస్తున్నాయి.

29 రాష్ట్రాల్లో దాదాపు 18000 పట్టణాల మొత్తాన్ని

గతేడాది జరిగిన ఏజీఎమ్ మీటింగ్ లో జియోలాంచ్ ని 29 రాష్ట్రాల్లో దాదాపు 18000 పట్టణాల మొత్తాన్ని కవర్ చేసే విధంగా లైవ్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇది దాదాపు 80 శాతం వరకు దేశం మొత్తాన్ని కవర్ చేసింది.

ఈ ఈవెంట్ దేశం మొత్తాన్ని కవర్ చేసే విధంగా

అయితే ఈ సారి జరగబోయే ఈవెంట్ దేశం మొత్తాన్ని దాదాపు 100 శాతం కవర్ చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. అక్కడ జియోకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

తరీఫ్ ప్లాన్లను ఇప్పటికే ట్రాయ్ కి తెలియజేసిన నేపథ్యంలో

జియోకి సంబంధించిన తరీఫ్ ప్లాన్లను ఇప్పటికే ట్రాయ్ కి తెలియజేసిన నేపథ్యంలో జియోకి సంబంధించిన తరీఫ్ వివరాలన్నీ డిసెంబర్ 28న లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. వినియోగదారులకు సంబంధించిన బెనిపిట్స్ కూడా ఆ రోజే తెలిసే అవకాశం ఉంది.

ఇప్పటికే అన్ని కంపెనీలు డేటా ఆఫర్లు

అయితే ఇప్పటికే అన్ని కంపెనీలు డేటాకు సంబంధించిన ఆఫర్లు భారీగా ఇచ్చిన నేపథ్యంలో జియో కమర్షియల్ లాంచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఆ రోజు లాంచ్ అవుతుందా లేదా అన్నది పెప్టెంబర్ 1న జరగబోయే మీటింగ్ లో తెలుస్తుంది .అంతవరకు వేచి చూడక తప్పదు.

జియోకు సంబంధించి మరిన్ని స్టోరీల కోసం..

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే.. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mukesh Ambani to Announce Reliance JIO 4G Commercial Launch on September 1st – Reports
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot