వీటిలో ఏది మీ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్..?

Posted By:

షియోమి రెడ్మీ 2.. మోటరోలా ఇ2.. లెనోవో ఏ6000, రూ.6,999 ధర సెగ్మంట్ లో లభ్యమవుతోన్న ఈ మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లలో ఏది గొప్ప ఫోన్..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి...

ఇంకా చదవండి: వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

ఇండియా వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్, మోటరోలా, లెనోవో, షియోమి, మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.

ఇంకా చదవండి: మైక్రోసాఫ్ట్‌కు 40ఏళ్లు.. 10 ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ 2

డిజైన్:

షియోమీ రెడ్మీ1ఎస్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన షియోమి రెడ్మీ 2 పర్‌ఫెక్ట్ సైజ్ స్మార్ట్‌ఫోన్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫోన్ డిజైన్ సాదాసీదాగా ఆకట్టుకుంటుంది.

 

720x1280 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4.7 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్‌ను షియోమి రెడ్మీ 2 ఫోన్ కలిగి ఉంది. పిక్సల్ డెన్సిటీ 312 పీపీఐ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్ డివైస్ డిస్‌ప్లేకు మరింత సెక్యూరిటీగా నిలుస్తుంది.

హార్డ్ వేర్ విషయానికొస్తే..

1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ ఎస్410 ప్రాసెసర్, డ్యుయల్ సిమ్ రెడ్మీ2 2జీ, 3జీ, ఇంకా 4జీ (ఎల్టీఈ ఎఫ్‌డీడీ బ్యాండ్3, ఎల్టీఈ ఎఫ్‌డీడీ బ్యాండ్4) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇతర కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (వై-ఫై బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, వై-ఫై హాట్‌స్పాట్), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,

 

కెమెరా:

షియోమీ రెడ్మీ2 కెమెరా విషయానికొస్తే 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఫ్లాష్ సపోర్ట్. తక్కువ వెళుతురు వాతావరణాల్లోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని పొందే విధంగా హెచ్‌డీఆర్, బీఎస్ఐ సెన్సార్ వంటి ఫీచర్లను ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

 

ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే...

షియోమీ రెడ్మీ2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన తన సొంత ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ2 ఫోన్ కు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్ అందుతుంలో లేదో చూడాలి.

 

డిజైన్

లెనోవో ఏ6000, ఈ 5 అంగుళాల తాకేతర ఫోన్‌ను నాజూకు శ్రేణి తక్కువ బరువు స్మార్ట్‌ఫోన్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

డిస్‌ప్లే:

లెనోవో ఏ6000 5 అంగుళాల పదునైన ఇంకా స్ఫుటమైన డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లోపించింది.

 

లెనోవో ఏ6000 హార్డ్‌వేర్ విషయానికొస్తే...

64బిట్ స్నాప్‌డ్రాగన్ 410 సాక్, 2జీ, 3జీ ఇంకా 4జీ ఎల్టీఈ కనెక్టువిటీలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 2.300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. వై-ఫై బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, వై-ఫై హాట్‌స్పాట్, 1జీబి, 8జీబి ఇంటర్నల్ మెమరీ.

 

ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే...

లెనోవో ఏ6000 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన తన సొంత వైబ్ యూఐ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్ అందుతుంలో లేదో చూడాలి.

2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

డిజైన్

మోటో ఇ మొదటి వర్షన్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదలైన మోటో ఇ సెకండ్ జనరేషన్ రూ.7,000 ధర పరిధిలో బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు.

 

ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే...

540x960పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4.5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్‌ను మోటో ఇ (సెకండ్ జనరేషన్) ఫోన్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.

 

హార్డ్‌వేర్ విషయానికొస్తే..

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసర్, 2జీ ఇంకా 3జీ కనెక్టువిటీలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయిత (వై-ఫై బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, వై-ఫై హాట్ స్పాట్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ.

 

ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే..

మోటో ఇ (సెకండ్ జనరేషన్) ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. స్లీప్ మోడ్ , షేట్ టూ వేకప్ వంటి ఫీచర్లను మోటో ఇ సెకండ్ జనరేషన్ ఫోన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చూడొచ్చు.

 


ఫోన్ కెమెరా విషయానికొస్తే...

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ సపోర్ట్‌తో).

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
which is the best budget smartphone..?. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot