మొబైల్ డిస్‌ప్లే గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

By Hazarath
|

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లలో ప్రతి ఒక్కరూ డిస్ ప్లేకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి ఇమేజ్ క్వాలిటీ అలాగే హై డెఫినేషన్ రిజల్యూస్ ఇంకా పెద్ద స్కీన్ ఇలా ప్రతిదీ పెద్దదిగా ఉండాలని కోరుకుంటారు. దీనికి తగ్గట్లుగా కంపెనీలు కూడా వివిధ రకాల డిస్ ప్లేలతో వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల డిస్ ప్లే ఫోన్లు హల్ చల్ చేస్తున్నాయి. వాటన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

బ్లాక్‌‌బెర్రీ వదిలి వెళ్లిన తీపి గుర్తులు

స్పెసిఫికేషన్స్‌

స్పెసిఫికేషన్స్‌

ఇప్పుడు మార్కెట్లో TFT, TFD, IPS LCD, LED, OLED, AMOLED, Capacitive Touchscreen, Resistive Touchscreen స్పెసిఫికేషన్స్‌తో మొబైల్స్ వస్తున్నాయి. వీటిపైన పూర్తి అవగాహన చాలా అవసరం.

ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ

ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ

మొబైల్ ఫోన్లలో ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా రెండు రకాల డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. అవే లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే - ఎల్ సీడీ (LCD), లైట్ ఎమిటింగ్ డయోడ్-ఎల్ఈడీ (LED) స్క్రీన్లు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్టీఎన్ - సీఎస్టీన్ డిస్‌ప్లే
 

ఎస్టీఎన్ - సీఎస్టీన్ డిస్‌ప్లే

మొబైల్ ఫోన్లలో తొలి తరంలో వచ్చిన ఎల్ సీడీ డిస్‌ప్లేలు ఇవి. నోకియా నుంచి మోటరోలా, సోనీ ఎరిక్సన్ వంటి మనకు తెలిసిన తొలి తరం ఫోన్లన్నీ ఇవే డిస్ప్లేలతో వచ్చాయి. తొలుత వచ్చినవి STN (సూపర్ ట్విస్టెడ్ నెమాటిక్) తరహావి. నోకియా 3310, నోకియా 1100 వంటివాటి డిస్ప్లేలు ఇవే.

మోనో కలర్, కలర్ స్క్రీన్లు

మోనో కలర్, కలర్ స్క్రీన్లు

ఆ తర్వాత మోనో కలర్, కలర్ స్క్రీన్లు వచ్చాయి. వీటిని CSTN (కలర్ సూపర్ ట్విస్టెడ్ నెమాటిక్) డిస్‌ప్లే గా పేర్కొంటారు. ఈ తరహా డిస్‌ప్లేలను ఇప్పటికీ బేసిక్ మొబైల్ ఫోన్లలో వినియోగిస్తున్నారు. వీటిలో ఇమేజ్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంటుంది. కానీ ధర అతి తక్కువ. చాలా తక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

TFT LCD డిస్‌ప్లే

TFT LCD డిస్‌ప్లే

ఎల్సీడీ టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చి TFT 'థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ టెక్నాలజీ (టీఎఫ్‌టీ)' డిస్‌ప్లేను అభివృద్ధి చేశారు. అంతకు ముందు వచ్చిన ఎల్‌సీడీ డిస్‌ప్లేల కంటే ఇవి ఎక్కువ ఇమేజ్ క్వాలిటీని ఇస్తాయి. అయితే బ్యాటరీని కూడా ఎక్కువగా వినియోగించుకుంటాయి. దీంతో పాటు ఈ స్క్రీన్లలో వ్యూ యాంగిల్ తక్కువగా ఉంటుంది.

TFD డిస్‌ప్లేలు

TFD డిస్‌ప్లేలు

TFT టెక్నాలజీని కొద్దిగా అభివృద్ధి చేసి రూపొందించినదే TFD (థిన్ ఫిల్మ్ డయోడ్) టెక్నాలజీ. ఇవి TFT డిస్‌ప్లేలతో పోల్చితే ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. మరికొంచెం వేగంగా పనిచేస్తాయి. విద్యుత్ వినియోగం, ధర కూడా స్వల్పంగా తక్కువ. అయితే ఇది పెద్దగా వినియోగంలోకి రాలేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPS LCD డిస్‌ప్లేలు

IPS LCD డిస్‌ప్లేలు

TFT, TFD డిస్‌ప్లేల కంటే ఆధునికమైనవి, మరింత నాణ్యమైనవి IPS (ఇన్ ప్లేన్ స్విచింగ్) LCD డిస్‌ప్లేలు. స్క్రీన్ రిజల్యూషన్ కూడా మరింత ఎక్కువగా అందించేందుకు ఈ టెక్నాలజీ వీలు కల్పించింది. LCD టెక్నాలజీలతో పోలిస్తే IPS టెక్నాలజీ అత్యుత్తమమైనది. 

ఓఎల్ఈడీ (OLED) డిస్‌ప్లేలు

ఓఎల్ఈడీ (OLED) డిస్‌ప్లేలు

LCD డిస్‌ప్లేల కంటే ఆధునికమైన టెక్నాలజీ LED (లైట్ ఎమిటింగ్ డయోడ్). ఈ డిస్‌ప్లేలు మరింత నాణ్యంగా ఉండి, తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి.LED మొబైల్ డిస్‌ప్లేలలో తొలుత వచ్చిన టెక్నాలజీయే OLED (ఆర్గానికి లైట్ ఎమిటింగ్ డయోడ్). LCD డిస్‌ప్లేల కన్నా ఈ డిస్‌ప్లేల ధర కొంచెం ఎక్కువ.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ

నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ

కానీ మరింత ప్రకాశవంతమైన, నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. మరిన్ని ఎక్కువ రంగులను వీక్షించవచ్చు. అంతేకాదు బ్యాటరీని కూడా తక్కువగా వినియోగించుకుంటాయి. వేగంగా పనిచేస్తాయి. సన్నగా ఉంటాయి, బరువు కూడా తక్కువ. వ్యూ యాంగిల్ చాలా ఎక్కువ. అంటే పక్కల నుంచి కూడా డిస్‌ప్లే దాదాపు స్పష్టంగా కనిపిస్తుంది.

అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేలు

అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేలు

అమోలెడ్ డిస్‌ప్లేలు మరింత సన్నగా ఉంటాయి, బరువు మరింత తక్కువ. బ్యాటరీని కూడా మరింత తక్కువగా వినియోగించుకుంటాయి. అంతేకాదు ఎండ, ఎక్కువ వెలుతురులో డిస్‌ప్లే కనిపిస్తుంది. అయితే ఈ డిస్‌ప్లేల ధర కొంత ఎక్కువ. అందువల్ల హైఎండ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అమోలెడ్ డిస్‌ప్లేలను అందిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూపర్ అమోలెడ్ (Super - AMOLED) డిస్ప్లేలు

సూపర్ అమోలెడ్ (Super - AMOLED) డిస్ప్లేలు

అమోలెడ్ డిస్‌ప్లేలకన్నా అత్యాధునికమైన టెక్నాలజీ ఇది. దీనిని సామ్సంగ్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి సన్నని డిస్‌ప్లే ఇదే. మిగతా అన్ని రకాల డిస్‌ప్లేలతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంటుంది. ధర ఎక్కువ. వీటిలోనే సూపర్ అమోలెడ్ ప్లస్, సూపర్ అమోలెడ్ ప్లస్ హెచ్ డీ అనే రకాలూ అందుబాటులోకి వచ్చాయి.

రెటీనా (Retina) డిస్‌ప్లే

రెటీనా (Retina) డిస్‌ప్లే

IPS LCD టెక్నాలజీని కొంత మెరుగుపర్చి ఎక్కువ రెజల్యూషన్ అందించేందుకు ఆపిల్ సంస్థ అభివృద్ధి చేసిన టెక్నాలజీయే రెటీనాడిస్‌ప్లే. నిర్ణీత దూరం నుంచి చూసినప్పుడు డిస్‌ప్లేపై పిక్సెల్స్ ను విడిగా గమనించడానికి వీలు లేనంత PPI ని అందించడమే దీని లక్ష్యం. దీనిని తొలుత ఐఫోన్లలో అందుబాటులోకి తెచ్చారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Which screen is best: Super AMOLED, Super LCD or Retina display read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X