జియో సిమ్‌కి IMEI నంబర్‌ ఎందుకు అడుగుతున్నారు..?

Written By:

దేశం మొత్తం ఇప్పుడు జియో ఫీవర్ లో మునిగి తేలుతోంది. రిలయన్స్ డిజిటల్ షో రూంల ముందు అయితే కష్టమర్ల క్యూ ఓ మహసముద్రాన్నే తలపిస్తున్నట్లుంది. ఇప్పటికే చాలామంది జియో సిమ్ తీసుకున్నారు కూడా. అయితే మీరు జియో సిమ్ తీసుకుంటున్నారా..అయితే సిమ్ తీసుకునే ముందు మీరు కొంచెం ఆలోచించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందేహాలను వెలిబుచ్చుతున్నారు. అవేంటో మీరే చూడండి.

ఎయిర్‌టెల్‌ జియోల మధ్య స్నేహ బంధం:లక్ష్యానికి దూరంగా జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిమ్ తీసుకునే సమయంలో

జియో సిమ్ తీసుకునే సమయంలో మీ మొబైల్ ఐయంఈఐ నంబర్ తో పాటు ఆధార్ కార్డ్ జెరాక్స్ అడుగుతున్నారు. మరి అది ఎందుకు అడుగుతున్నారు అనేది కొంచెం సందేహాస్పదంగా ఉంది.

నిపుణులు ఏమంటున్నారంటే

దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే మీరు జియో సిమ్ తీసుకునే సమయంలో మీ ఐయంఈఐ నంబర్ కు జియో సిమ్ ట్యాగ్ చేయబడుతుందని భవిష్యత్ లో మీరు ఇంకో సిమ్ వేసుకోడానికి వీలు కాదని చెబుతున్నారు.

మూడు నెలలు ఉచిత ఆఫర్ ని

మూడు నెలలు ఉచిత ఆఫర్ ని వాడుకొని పక్కన పడేసి కొత్త సిమ్ తీసుకోవచ్చనుకునేవారికి ఇది కష్ట సాధ్యంగా మారే అవకాశం ఉంది. అదీగాక జనవరి నుంచి రెంటల్ ఛార్జీలతో జియోని వాడాల్సి ఉంటుంది.

టర్మ్స్ అండ్ కండీషన్స్

ఇక మీరు సిమ్ తీసుకునే సమయంలో టర్మ్స్ అండ్ కండీషన్స్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది.

మీరు అన్ని అంగీకరించినట్లుగా

దీని ద్వారా మీరు అన్ని అంగీకరించినట్లుగా ఒప్పందం కుదిరినట్లే. దీనిపై న్యాయపరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకునేందేకు ఆస్కారం ఉండదు.

అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతనే

కాబట్టి మీరు జియో సిమ్ తీసుకునే సమయంలో అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతనే సంతకం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

మీరు 4జీ ఫోన్ వాడుతున్నారా..

మీరు 4జీ ఫోన్ వాడుతున్నారా..అయితే మీ మొబైల్ జియోకి పనిచేస్తుందో లేదోనని సందేహపడుతున్నారా.. అయితే ఇప్పుడు అలాంటి వాటికి రాంరాం చెప్పి మీరే నేరుగా మీ ఫోన్ జియో సిమ్ కి పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.

ఒక సిమ్‌తో 10 ఫోన్లకు జియోని పొందడం ఎలా

ఒక సిమ్‌తో 10 ఫోన్లకు జియోని పొందడం ఎలా..? మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why is Reliance asking for our phone's IMEI/EMIE no. for buying R-Jio sim? read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot