భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

Written By:

మొన్న విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు కొన్ని కంపెనీలకు భారీ నష్టాలను మిగల్చడంతో టెలికం దిగ్గజ కంపెనీ టెలినార్ భారత్ కు బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునెపెన్నడూ లేనంతగా ఘోరమైన నష్టాలను చవిచూశామని ఇది ఇలాగే కొనసాగితే భారత్ నుంచి తమ కంపెనీ వైదొలగక తప్పదని కంపెనీ సీఈఓ ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..
Read more : దారుణమైన నష్టాల్లో ఆపిల్: గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

తక్కువ ధరలకు స్పెక్ట్రం గనుక లభించకపోతే తాము భారత్ కార్యకలాపాలకు గుడ్‌బై చెప్పకతప్పదని నార్వే టెలికం దిగ్గజం టెలినార్ సంకేతాలిచ్చింది.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

భారత్‌లో టెలికం వ్యాపారానికి సంబంధించి తాము దాదాపు రూ.2,350 కోట్ల(310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్) నిర్వహణపరమైన నష్టాల్లో కూరుకుపోయామని పేర్కొంది. నార్వేలో కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా టెలినార్ గ్లోబల్ సీఈఓ సెగ్వీ బ్రెకీ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

భారత్‌లో దీర్ఘకాలంపాటు మేం కొనసాగుతామా లేదా అనేది అదనపు స్పెక్ట్రం కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని, పెరుగుతున్న డేటా మార్కెట్‌కు అనుగుణంగా ఇప్పుడు మాకున్న స్పెక్ట్రంతో ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడలేకపోతున్నాం. అందుకని తక్కువ ధరకు స్పెక్ట్రం లభిస్తే ఇండియాలో కార్యకలపాలు సాగిస్తామన్నారు.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

భారత్‌లో లాభదాయకమైన వ్యాపారం చేయడానికే వచ్చామని, అనుకున్నట్లు రాబడులు లేకపోతే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వస్తుందని టెలినార్ సీఎఫ్‌ఓ మార్టెన్ కార్ల్‌సన్ సార్బీ పేర్కొన్నారు.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు ఉండగా ఆరు సర్కిళ్లలో(ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర ప్రదేశ్ వెస్ట్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర) మాత్రమే టెలినార్ ఇండియా కార్యకలాపాలు ఉన్నాయి.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

ఫిబ్రవరి చివరినాటికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 5.16 కోట్లుగా నమోదైంది. వాయిస్ సేవల వినియోగం తగ్గడంతో కంపెనీకి ఒక్కో కస్టమర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్‌పీయూ) 8 శాతం మేర తగ్గి.. రూ.90కి దిగజారింది.

భారత్‌కు దిగ్గజ టెలికం కంపెనీ బైబై !

కాగా, రానున్న స్పెక్ట్రం వేలానికి సంబంధించి 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ధరను ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485గా ట్రాయ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అన్ని బ్యాండ్‌విడ్త్‌లోనూ చూస్తే ఇదే అత్యధిక వేలం రేటుగా నిలవనుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Why is Telenor threatening to exit India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot