విండోస్ 10.. మైక్రోసాఫ్ట్‌ ఆఖరి ఓఎస్ కానుందా..?

Posted By:

మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న విండోస్ సిరీస్‌లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆఖరి వర్షన్ కానుందా..? అవును, విండోస్ సిరీస్ నుంచి తామందిస్తున్న విండోస్ 10 చివరిది కాబట్టి ఎంతో ఏకాగ్రతతో ఈ ప్లాట్ ఫామ్ ను అభివృద్థి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చికాగోలో నిర్వహించిన ఇగ్నైట్ కాన్ఫిరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. (ఇంకా చదవండి: ‘విండోస్ 10'.. 10 బెస్ట్ ఫీచర్లు)

విండోస్ 10.. మైక్రోసాఫ్ట్‌ ఆఖరి ఓఎస్ కానుందా..?

మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తన విండోస్ సిరీస్ నుంచి విండోస్ 7, విండోస్ 8 ఓఎస్ వర్షన్ లను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు కొత్త ఓఎస్ ను అందుబాటులోకి తీసుకువచ్చే సాంప్రదాయానికి ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్ ఇక పై విండోస్ 10ను సబ్‌స్ర్కిప్షన్ విధానం క్రింద కొత్త అప్‌డేట్‌లతో అందించే అవకాశం ఉంది.

విండోస్ 10.. మైక్రోసాఫ్ట్‌ ఆఖరి ఓఎస్ కానుందా..?


విండోస్ 10 అన్ని డివైస్‌లకు ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుంది. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి విండోస్ 10 కోసం రూపొందించిన యాప్స్ డెస్క్‌టాప్, ఫోన్, ఎక్స్‌బాక్స్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల పైనా పనిచేస్తాయి. విండోస్ 8 వర్షన్‌లో కోల్పొయిన స్మార్ట్ మెనూను విండోస్ 10 వర్షన్‌లో మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రవేశపెట్టింది. 

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే మరింత వేగవంతంగా స్పందించే ఈ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ నేషనల్ టూల్, డిస్ట్ర్రాక్షన్ ఫ్రీ రీడింగ్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ యాప్ ఫర్ విండోస్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని డివైజ్‌లలో ఈ ఎడ్జ్ బ్రౌజర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

English summary
Windows 10 Might Be The Final Version For Windows OS. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot