విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

Written By:

ప్రపంచ టెక్నాలజీ పటంలో దూసుకుపోతున్న టెక్ దిగ్గజం విప్రోకు భారీ షాక్ తలిగింది. కంపెనీలో పని చేస్తున్న విప్రో తనకు భారీ నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ ఉద్యోగిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనను లైంగింకగా అందరూ వేధించారని కంపెనీ యాజమాన్యానికి చెబితే వారు అసలు పట్టించుకోలేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తను కేవలం ఇండియన్ అయినందుకే కామెంట్లు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more : ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆమెపై తోటి ఉద్యోగులు వివక్ష

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

లండన్ కు చెందిన విప్రో కంపెనీలో శ్రేయా పనిచేస్తున్న సమయంలో లింగవివక్షతో పాటు లైంగిక వేధింపులకు గురయింది. మహిళా ఉద్యోగి, అందులో భారత్ కు చెందిన వ్యక్తి అని ఆమెపై తోటి ఉద్యోగులు వివక్ష చూపేవారు. అసభ్య పదజాలంతో దూషించేవారు.

వీటికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

వీటికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను ప్రవేశపెడుతూ తనకు న్యాయం చేయాలంటూ 2014లో కోర్టును ఆశ్రయించింది. విప్రో కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పింది.

పురుష ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

తాను బెంగళూరులో ఏడేళ్లు జాబ్ చేశాక, 2010లో లండన్ లో తమ కంపెనీలో జాయిన్ అయినట్లు వివరించింది. పురుష ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు, అసభ్య పదజాలంతో నిత్యం దూషించేవారని ఆవేదన చెందింది.

తనకు 1.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

తనకు 1.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని తన పిటిషన్ లో పేర్కొంది. రాజీనామా లేఖ ఇస్తే, కంపెనీ అందుకు అంగీకరించలేదన్నది. తాను సిక్ లీవ్ లో ఉన్నప్పుడు తనను ఇబ్బందులకు గురిచేశారని, ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని తన బాధలను ఒక్కోక్కటిగా చెప్పుకొచ్చింది.

శ్రేయాకు న్యాయం చేయాలని

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

శ్రేయాకు న్యాయం చేయాలని, ఆమె డిమాండ్ చేసిన నష్టపరిహారం ఇప్పించేందుకు ట్రైబ్యునల్ సిద్ధంగా ఉందని ఆమె తరఫు లాయర్ కిరణ్ దౌర్కా తెలిపారు. జీతంతో పాటు ఆమెను మానసికంగా వేధించినందుకు కంపెనీ తగిన మూల్యం చెల్లించుకోనుందని తన క్లైయింట్ కు కొన్ని రోజుల్లో న్యాయం జరగనుందని లాయర్ ధీమా వ్యక్తంచేశారు.

దీనిపై కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

అయితే దీనిపై కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ కంపెనీ నియమ నిబంధనలను పాటించనందునే శ్రేయాతో పాటు మరో ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించడం జరిగిందని, ఇందులో వివక్ష అన్నది లేనేలేదని విప్రో వాదించింది.

తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

ఈ నేపథ్యంలో బ్రిటన్ ట్రైబ్యునల్ తమ వాదనను సమర్థిస్తూ, తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్రో వెల్లడించింది.

ఇప్పటికైనా మహిళలను సమానంగా చూడాలని

విప్రోలో లైంగిక దాడి: రూ. 1.5 కోట్ల నష్టపరిహారం కోసం పిటిషన్

కాగా, ఇప్పటికైనా మహిళలను సమానంగా చూడాలని, సమాన వేతనాలు చెల్లించాలని ఉకిల్ కోరుతున్నారు. ఈ తీర్పు కంపెనీకి పూర్తి అనుకూలంగా ఏమీ లేదని, మహిళలు సమాన హక్కుల కోసం పోరాడేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Wipro faces Rs 10 crore sexual harassment lawsuit in UK
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting