చెత్త కుప్పలో కోట్ల ఖరీదు చేసే కంప్యూటర్

Posted By:

 చెత్త కుప్పలో కోట్ల ఖరీదు చేసే కంప్యూటర్

కోట్ల ఖరీదు చేసే పాత యాపిల్ కంప్యూటర్‌ను రీసైకిలింగ్‌కు ఇచ్చేసిన మహిళ కోసం యూఎస్‌లోని ఓ రిసైకిలింగ్ కేంద్రం ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళితే ఎలక్ట్రానిక్ బాక్సుల్లో కట్టుదిట్టుంగా ప్యాక్ చేయబడిన ఈ రెండు లక్షల డాలర్ల కంప్యూటర్‌ను సదరు మహిళ తన భర్త మరణం అనంతరం చేపట్టిన గ్యారేజీ క్లీనింగ్‌లో భాగంగా వెలికితీసి తమకు రిసైకిలింగ్‌కు ఇచ్చేసినట్లు కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ క్లీన్ బే ఏరియా వైస్ ప్రెసిడెంట్ విక్టర్ గిచున్ తెలిపారు.

(చదవండి: ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు)

ఇందుకు ఆమె ట్యాక్స్ రిసిప్ట్ కూడా తీసుకోలేదని,  తనను కాంటాక్ట్ చేసేందుకు ఏ విదమైన సమాచారం కూడా తమ వద్ద లేదని సదరు రిసైకిలింగ్ సంస్థ వెల్లడించింది. ఆమె ఆ బాక్సును విడిచి పెట్టి వెళ్లిన కొద్ది వారాల తరువాత ఓపెన్ చూసి చూసామని,  అందులో అత్యంత విలువైన యాపిల్ 1 కంప్యూటర్ ఉన్నట్లు అప్పుడే తమ దృష్టికి వచ్చిందని సంస్థలోని ఉద్యోగులు వాపోయారు.

English summary
Woman dumps computer worth £130,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot