20 మంది బాయ్‌ఫ్రెండ్స్, 20 ఐఫోన్లు, అమ్మేసి ఏకంగా ఇల్లు కొనేసింది

Written By:

బుర్రలో తెలివి ఉండాలే కాని డబ్బులు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. అతి తెలివి తేటలున్న వారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. సరిగ్గా అలాంటి సంఘటనే చైనాలో జరిగింది. ఓ అమ్మాయి తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ నుంచి ఐఫోన్లను బహుమతిగా అందుకోని వాటితో ఏకంగా ఓ ఇల్లే కొనేసింది.

డేటా స్పీడ్ విషయంలో మోసం, ట్రాయ్ దిమ్మతిరిగే వార్నింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమ్మాయి పేరు షియోలి

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం అమ్మాయి పేరు షియోలిగా ఉంది. ఆమె తల్లి దండ్రులు ముసలి వాళ్లు కావడంతో ఆమెపై కుటుంబ భారం పడిందని సొంతిల్లు కూడా లేదని తెలుస్తోంది. దీనికోసం ఆమె ఇలాంటి ఎత్తుగడకు తెరలేపిందని ఆ కధనంలో తెలిపారు.

20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఐ ఫోన్లను గిప్ట్ గా

ఇప్పటివరకు ఆమెకు 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఐ ఫోన్లను గిప్ట్ గా ఇచ్చారట. వారు అలా ఇవ్వడం ఆలస్యం వాటిని అమ్మేసి డబ్బు కూడబెట్టింది. ఇలా మొత్తం 20 ఐఫోన్లను అమ్మేసి దాదాపు CNY 120,000 మన కరెన్సీలో రూ. 12 లక్షలు కూడబెట్టింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12 లక్షల రూపాయల డబ్బును

ఈ 12 లక్షల రూపాయల డబ్బును డౌన్ పేమెంట్ గా చెల్లించి ఇల్లు కొనుక్కుంది. విచిత్రమేమిటంటే ఈ విషయం వారి బాయ్ ప్రెండ్స్ ఎవరికీ తెలియదు.

ఆమె సహద్యోగి ఒకరు

అయితే నిజం ఎల్లకాలం దాగదన్నట్లు... షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహద్యోగి ఒకరు 'Tian Ya Yi Du బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్ గా ఆమె తీసుకుందని తెలిపాడు. 

చాలా మంది ఆసక్తి

అయితే ఆమె ఇల్లు కొనుక్కున్న తీరే తనకు నమ్మశక్యంగా లేదని, ఈ విషయం తెలియగానే షియోలీ కొనుకున్న ఇల్లును చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు.

మీడియా షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి

ఇక ఇటువంటి విషయాల్లో ముందుండే మీడియా షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి ఆమె వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది.

20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్

ఇప్పుడు షీయోలీ స్టోరీ '20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్ 'హ్యాష్ టాగ్ తో చైనా సోషల్ మీడియా Weiboలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. కొంతమంది ఆమెను ప్రసంసిస్తే, మరికొంత మంది ఆమె చేసిన పని కరెక్ట్ కాదని తిట్టిపోశారు. మరి

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Woman gets 20 'boyfriends' to buy her iPhones then sells them to buy a house Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot