ఐసిస్ పేరు ఉంటే కొంప కొల్లేరే

Written By:

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ అండ్ సిరియా ఉగ్రవాద గ్రూపు సంక్షిప్త నామం ఐఎస్ఐఎస్. దీనిని కలిపి చదివితే ఐసీస్ అవుతుంది. ఇదే పేరును కలిగి ఉండటంతో ఓ మహిళా స్టాఫ్‌వేర్ డెవలపర్‌కు ఫేస్‌బుక్‌ నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఆమె ఖాతాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఖాతాగా భావిస్తూ ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. దీనిపై శాన్‌ఫ్రాన్సికోకు చెందిన ఐసీస్ యాంచలీ అహసనం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్ లాగిన్ పేజీలో 'అకౌంట్‌ డిజెబుల్డ్' అని వచ్చిన సందేశాన్ని ప్రింట్‌స్ర్కీన్ తీసి.. ఆమె ట్విట్టర్‌లోని ఫేస్‌బుక్ పేజీలో పెట్టి.. ' మీరు నా పర్సనల్ అకౌంట్‌ను ఎందుకు తొలగించారు. నా అసలు పేరు ఐసీస్‌ యాంచలీ' అని తనను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.

Read more: ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తున్న హ్యాకర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జరిగిందేమిటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయి ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. జరిగిందేమిటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. తన ఫేస్ బుక్ పేజీని పునరుద్దరించుకోవటం కోసం మూడుసార్లు ప్రయత్నించి విసిగిపోయింది.

నిదానంగా ఈ అమ్మడికి అర్థమైందేమంటే.

నిదానంగా ఈ అమ్మడికి అర్థమైందేమంటే.. తన పేరులో ఉన్న ‘ఐసిస్' అన్న పదమే తన ఫేస్ బుక్ పేజీ బ్లాక్ కావటానికి కారణంగా అర్థం చేసుకొని.. మరోసామాజిక నెట్ వర్క్ అయిన ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది.పేరులో ఐసిస్ అని ఉంటే.. ఇలా ఫేస్ బుక్ బ్లాక్ చేస్తారా అంటూ ట్వీట్లు చేయటంతో ఆమె ఆవేదన ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇంతా చేస్తే ఈ ఐటీ ఇంజనీర్ పేరు.. ‘‘ఐసిస్ అన్ షలీ''.

ఐసిస్ అన్న పేరు వినిపిస్తేనే ఉలిక్కిపడే పరిస్థితి.

ఇస్లామిక్ స్టేట్ షార్ట్ కట్ లో ‘‘ఐసిస్''గా వ్యవహరిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ ఇటీవల ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఉగ్రదాడికి పాల్పడిన నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ అన్న పేరు వినిపిస్తేనే ఉలిక్కిపడే పరిస్థితి.

ఈ రకంగా ఇబ్బంది పెట్టటం

తమదైన ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ రాక్షసుల పట్ల అందరూ జాగరూకతో ఉంటున్న పరిస్థితి. అలా అని పేరులో ఐసిస్ అని ఉంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టటం ఎంతవరకూ సబబు అని ‘ఐసిస్ అన్ షలీ' ప్రశ్నిస్తోంది.

పేరులో ఐసిస్ అని ఉంటే ఉగ్రవాది అయిపోతారా?

పేరులో ఐసిస్ అని ఉంటే ఉగ్రవాది అయిపోతారా? అని నిలదీస్తున్న ఆమె.. తన ఖాతా పునరుద్దరణ కోసం ఫేస్ బుక్ కు తన పాస్ పోర్ట్ నకలు కాపీని స్క్రీన్ షాట్లు తీసి మరీ పంపానని.. అయినప్పటికీ ఖాతాను రీ ఓపెన్ చేయలేదంటూ అగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఐసిస్ అన్ షలీ ట్వీట్ ఇప్పుడు పలువురిని..

ఐసిస్ అన్ షలీ ట్వీట్ ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించేలా చేస్తోంది. ఎంత పేరులో ఐసిస్ అని ఉంటే మాత్రం ఇంతలా చేస్తారా? ఐసిస్ అన్న పేరు ఉన్న వారంతా ఉగ్రవాదులే అంటూ అవమానించటం సబబు కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా మొదలైన ఆన్ లైన్ రచ్చ ఫేస్ బుక్ దృష్టికి

తాజాగా మొదలైన ఆన్ లైన్ రచ్చ ఫేస్ బుక్ దృష్టికి వెళ్లింది. ఆ యువతికి ఆన్ లైన్ లో పెరుగుతున్న మద్దతు.. ఫేస్ బుక్ మీద వెల్లువెత్తుతున్న విమర్శలతో కళ్లు తెరిచిన ఎఫ్ బీ.. ఎట్టకేలకు ఆమె ఫేస్ బుక్ ఖాతాను రీ ఓపెన్ చేసింది.

‘ఐసిస్ అన్ షలీ'' ఖాతాను పునరుద్దరించటమే కాకుండా

‘‘ఐసిస్ అన్ షలీ'' ఖాతాను పునరుద్దరించటమే కాకుండా.. జరిగింది తప్పేనని.. తమను క్షమించాలంటూ లెంపలేసుకోవటంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది. నకిలీ అకౌంట్లను తొలగించే చర్యలో భాగంగా పొరపాటును ఈ ఘటన జరిగిందని, పొరపాటు తెలిసిన వెంటనే ఆమె ఖాతాను పునరుద్ధరించామని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

ఐసిస్ అన్న పేరు ఉన్న వారంతా తమను తాము పరిచయం

చూస్తుంటే.. ఐసిస్ అన్న పేరు ఉన్న వారంతా తమను తాము పరిచయం చేసుకునే సమయంలో ‘‘మై నేమ్ ఈజ్ ఐసిస్.. బట్ ఐమాయ్ నాట్ ఏ టెరర్రిస్ట్'' అని చెప్పుకోవాలేమో..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Facebook thinks I'm a terrorist': woman named Isis has account disabled
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot