ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

Posted By:

డబ్బుతో అన్ని పనులు సాధ్యమవనప్పటికి కొన్ని పనులు మాత్రం సాధ్యమవుతాయి. సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఉన్నతమైన జీవనశైలికి అలవాటు పడిన అపర కుబేరుల కోసం పలు ఖరీదైన సాంకేతిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే సాంకేతిక వస్తువులు ఖరీదైన ధరను కలిగి ఉంటాయి.

ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు ‘బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు. వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు డిజైన్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్‌లను క్రింది స్లైడ్ షో చూడొచ్చు

‘పెన్‌డ్రైవ్‌లు'... ఇలా కూడా ఉంటాయా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

1. ఐఫోన్ 4ఎస్ ఎలైట్ గోల్డ్ (iPhone 4S Elite Gold):

డిజైనర్: స్టువర్ట్ హ్యూగ్స్, డిజైనింగ్‌లో భాగంగా అత్యంత ఖరీదైన వజ్రాలతో పాటుబంగారాన్ని వినియోగించారు.

ధర: 46,80,00,000.

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

2.) ఐప్యాడ్ 2 గోల్డ్ హిస్టరీ ఎడిషన్ (iPad 2 Gold History Edition):

డిజైనర్: స్టువర్ట్ హ్యూగ్స్, డిజైనింగ్‌లో భాగంగా అత్యంత ఖరీదైన వజ్రాలతో పాటు బంగారాన్ని వినియోగించారు.

ధర రూ.39,00,00,000

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

3.) మ్యాక్‌బుక్ ఎయిర్ సుప్రీం ఫైర్ ఎడిషన్ (Macbook Air SUPREME FIRE Edition):

ఈ ల్యాపీ బరువు రెండు కిలలో ఆరు వందల గ్రాములు ఉంటుంది.

ధర రూ. 1,71,59,610.

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

4.) 24 క్యారెట్ గోల్డ్ యూఎస్బీ డ్రైవ్ (24K Gold USB Drive):

స్వచ్చమైన 24క్యారెట్ గోల్డ్ బంగారంతో ఈ యూఎస్బీ డ్రైవ్‌ను రూపందించారు.
4జీబి ఇంకా 32జీబి వేరియంట్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్ లభ్యమవుతోంది.

ధర రూ. 42,000.

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

5.) ఐపోడ్ టచ్ 24 క్యారెట్ గోల్డ్ సుప్రీమ్ ఫైర్ ఎడిషన్ (iPod Touch 24ct Gold Supreme Fire Edition):

ధర రూ.1,63,79,610

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

6.) నింటెండో వై సుప్రీమ్ (Nintendo Wii SUPREME):

ఈ ప్రత్యేక గేమింగ్ స్టేషన్ రూపకల్పనలో భాగంగా 2,500 గ్రాములు బంగారాన్ని వినియోగించారు.

ధర రూ. 2,33,99,610

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

7.) సోనీ పీఎస్3 సుప్రీమ్ (SONY PS3 SUPREME):

ఈ ప్రత్యేకమైన గేమింగ్ కన్సోల్ రూపకల్పనలో భాగంగా 1600 గ్రాముల 22 క్యారెట్ బంగారంతో పాటు విలువైన వజ్రాలను ఉపయోగించారు.

ధర రూ.1,55,99,610

 

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

8. బ్యాంగ్ & వోల్యుఫ్సన్ బియోసౌండ్ 24 క్యారట్ గోల్డ్ & డైమండ్ ఎడిషన్ (Bang & Olufsen Beosound 24 carat gold & diamond edition):

ఈ ప్రత్యేకమైన సౌండ్ బాక్సుల రూపకల్పనలో భాగంగా 32కిలో గ్రాములు 24 క్యారెట్ క్వాలిటీ బంగారాన్ని ఉపయోగించారు.

ధర రూ.9,36,00,000

ప్రపంచపు ఖరీదైన గాడ్జెట్‌లు!

9.) డైమండ్ బ్లాక్‌బెర్రీ 9700 బోల్డ్ II ఎలైట్ (Diamond Blackberry 9700 Bold II Elite):

ఈ ప్రత్యేకమైన ఫోన్ రూపకల్పనలో భాగంగా 6 క్యారెట్ వీవీఎస్1 వజ్రాలను ఉపయోగించారు.

ధర రూ.11,69,610.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot