ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే !

Written By:

ఇప్పుడు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నది ఏదైనా ఉందంటే అది స్మార్ట్ ఫోన్ మాత్రమే. చేతిలో ఏం ఉన్నా లేకున్నా స్మార్ట్ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. అందులో డేటా బ్యాలన్స్ వేసి ఇంటర్నెట్ ని జల్లెడ పట్టాల్సిందే. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది వినియోగదారుల మనసును గెలుచుకున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొన్ని ఉన్నాయి. వీటిల్లో స్మార్ట్‌ఫోన్ రారాజు శాంసంగ్ దిగ్గజ స్థానాన్ని ఆక్రమించింది. కంపెనీ కొన్ని విమర్శలు ఎదుర్కున్నప్పటికీ వినియోగదారులు మాత్రం శాంసంగ్ వైపై మొగ్గు చూపారు.

షియోమి నుంచి కొత్త ఫోన్ లీకయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్

గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో ఉక్కిరిబిక్కిరి అయిన శాంసంగ్ అవేమి కనపడకుండా వినియోగదారుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. ఈ ఏడాది బెస్ట్ ఫోన్ కంపెనీలలో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది.

ఆపిల్

ఆపిల్ కంపెనీకి ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. అమ్మకాల్లో తన సత్తాను చాటింది. ఐఫోన్ ఎస్ఈ ఫోన్ రికార్డు స్థాయి అమ్మకాలను జరిపింది.

హువాయి

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హువాయిది మూడో స్థానం. కంపెనీ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ ఫోన్లు భారీ స్థాయిలో అమ్మడుపోయాయి.

ఒప్పో

ఈ ఏడాది ఒప్పో ఏకంగా నాలుగవ స్థానానికి దూసుకొచ్చింది. ఏకంగా దిగ్గజాలకే షాక్ పుట్టించింది. కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు కెమెరాతో అదరగొట్టడం కంపెనీకి ప్లస్ పాయింట్ అయింది.

వివో

ఆ తరువాతి స్థానంలో చైనా కంపెనీ వివో నిలిచింది. కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు అమ్మకాల్లో సునామినే తలపించాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Worlds 10 biggest smartphone companies Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot