Home
News

అమెజాన్ లో తక్కువ ధరకు షియోమి Mi బ్యాండ్ 4

షియోమి కొత్తగా ప్రారంభించిన Mi బ్యాండ్ 4 యొక్క అమ్మకాలు ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి మొదలుకానుంది. ఇది కూడా అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. షియోమి ఇటీవల రెండు రోజుల ముందు తన తాజా ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ఇండియాలో ప్రారంభించింది. మొదట Mi బ్యాండ్ 4 చైనాలో ప్రారంభించబడింది. ఇది Mi బ్యాండ్ 3 ఫిట్‌నెస్ ట్రాకర్‌కు అప్డేట్ వేరియంట్ గా ఇండియాలోకి అడుగుపెట్టింది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

షియోమి యొక్క Mi బ్యాండ్ 4 ఫిట్‌నెస్ ట్రాకర్ 0.95-అంగుళాల కలర్ AMOLED 2.5D టచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 x 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టచ్ డిస్ప్లే Mi బ్యాండ్ 3 లో ఉన్నదానికంటే 39.9 శాతం పెద్దది. కొత్తగా ప్రారంభించిన Mi బ్యాండ్ 4 సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ సెన్సార్, పెద్ద బ్యాటరీను కలిగి ఉంటుంది. ఇండియాలో దీని యొక్క ధర 2,299 రూపాయలు.

ఫీచర్స్

ఫీచర్స్

Mi బ్యాండ్ 4 సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ సెన్సార్‌తో వస్తుంది. ఇది మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు లేదా కదలికలో ఉన్నప్పుడు శారీరక శ్రమలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా Mi బ్యాండ్ 4 సైక్లింగ్, స్విమింగ్ , వ్యాయామం, రన్నింగ్ మరియు వాకింగ్ వంటి శారీరక శ్రమలను పర్యవేక్షించగలదు. అంతేకాకుండా ఫిట్‌నెస్ ట్రాకర్ 5 ATM రేట్ తో చేయబడింది. ఇది స్విమింగ్ స్ట్రోక్‌ల సమూహాన్ని గుర్తించగలదు. వీటిలో ఫ్రీస్టైల్, మిక్స్డ్-స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ కూడా ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ

షియోమి ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను 512 KB ర్యామ్‌తో మరియు 16 MB స్టోరేజ్ ఆప్షన్‌తో అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో 135 ఎంఏహెచ్ అతి బ్యాటరీ కూడా ఉంది. ఇది ఒక సారి చేసే ఛార్జీతో 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అదనంగా దీని యొక్క బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్

అంతేకాక వినియోగదారులు Mi బ్యాండ్ ఉపయోగించి వారి స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనవచ్చు లేదా మ్యూజిక్ ట్రాక్‌ను ఒకే ట్యాప్‌తో మార్చవచ్చు. అదేవిధంగా Mi బ్యాండ్ వినియోగదారులు వాతావరణం యొక్క స్థితిగతులు మరియు స్టాక్ అప్డేట్ లను కూడా తనిఖీ చేయవచ్చు. ఇందులో నిర్మించిన అంతర్నిర్మిత మైక్రోఫోన్ కారణంగా వాయిస్ ఆదేశాలను కూడా అనుమతిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 BLE కి మద్దతునిస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకర్ Android 4.4 లేదా iOS 9తో నడుస్తున్న ఫోన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi Band 4 Sale Start Today in India via Amazon: Price, availability, offers and other details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X