Xiaomi MIUI 12 ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి... కెమెరా ఫీచర్స్ అదుర్స్....

|

షియోమి సంస్థ తన అన్ని రకాల ఫోన్ ల కోసం కొత్తగా MIUI 12 సాఫ్ట్ వెర్ ను తీసుకువచ్చింది. షియోమి MIUI 12 అనేది MIUI 11 యొక్క అప్ డేట్ వెర్షన్. అయితే MIUI 12 కొన్ని ప్రత్యేక ఫీచర్స్ మరియు మెరుగైన డార్క్ మోడ్‌ లక్షణాలతో వస్తుంది. ఇది దాని పాత సంస్కరణలకు పూర్తి బిన్నంగా ఉంటుంది.

షియోమి MIUI 12

షియోమి MIUI 12

ఇటీవలి కొన్ని నివేదికల ప్రకారం షియోమి ఇప్పటికే MIUI 13 ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. MIUI 12 యొక్క విషయానికి వస్తే దీని యొక్క లాంచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ప్రజలు ఇందులో ఏమి ఆశించారో దానికి భిన్నమైన ఫీచర్లను ఇది తీసుకువచ్చింది. ఇందులో భాగంగా షియోమి వినియోగదారుల గోప్యతా ముగింపుపై చాలా శ్రద్ధ కనబరిచింది మరియు డిస్ప్లే యొక్క సౌభావాన్ని కూడా చాలా మెరుగుపరిచింది. MIUI 12 తో మీరు ‘అల్ట్రా-స్మూత్ UI అనుభవాన్ని' కూడా పొందవచ్చు. MIUI 12 అందిస్తున్న కెమెరా యాప్ యొక్క మార్పులు మరియు మెరుగుదలల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

MIUI 12 కెమెరా యాప్ పూర్తి వివరాలు

MIUI 12 కెమెరా యాప్ పూర్తి వివరాలు

MIUI 12 కెమెరా యాప్ ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడంలో షియోమి ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. వినియోగదారు ఇంటరాక్షన్ పరంగా ఇది సరళమైనది. మీరు ఇప్పుడు షూటింగ్ మోడ్‌ల క్రమాన్ని మార్చవచ్చు. అలాగే మీకు ఎక్కువ సౌకర్యవంతంగా అనిపించే ప్రదేశంలో మీరు ఎక్కువగా ఉపయోగించే వాటిని ఉంచవచ్చు. క్రొత్త యాప్ పాతదానికి సమానంగా కనిపిస్తుంది కానీ దాని కంటే మెరుగైన కలర్ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. అలాగే ఇందులోని చాలా రకాల ఫాంట్‌లు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఎగువ నుండి క్రిందికి స్వైప్ చేసినప్పుడు మీరు త్వరగా కారక నిష్పత్తి మరియు టైమర్‌ను సెట్ చేయవచ్చు లేదా ఫ్రేమింగ్ గ్రిడ్‌ను జోడించవచ్చు వంటి మరెన్నో కూడా చేయవచ్చు.

MIUI 12 మ్యాజిక్ క్లోన్

MIUI 12 మ్యాజిక్ క్లోన్

Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??MIUI 12 కెమెరా యాప్ లో గల ‘మ్యాజిక్ క్లోన్' ద్వారా ఫోటోల యొక్క గుణకారాన్ని మరింత మెరుగు చేస్తుంది. ఇంతకుముందు ఒక మ్యాజిక్ కాలిడోస్కోప్ మాత్రమే ఉంది. కాలిడోస్కోప్ ప్రభావంతో మెరుగైన చిత్రాలు తీయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇప్పుడు కెమెరా యాప్ లో కొత్తగా AI అల్గోరిథంలు కూడా చేర్చబడ్డాయి. దీని సహాయంతో మీరు జూమ్-ఇన్ చేసినప్పుడు కూడా మెరుగైన చిత్రాలను తీయవచ్చు. ఇప్పుడు షట్టర్ బటన్ చిత్రాలను క్లిక్ చేయడానికి లేదా వీడియోను రికార్డ్ చేయడానికి ఉపయోగించవచ్చు. వీడియోను రికార్డ్ చేయడానికి ఎక్కువసేపు నొక్కి ఉంచడం మరియు చిత్రాన్ని క్లిక్ చేయడానికి వేలిని నొక్కడం వంటి సమస్యలు కూడా ఉండవు.

 

 

 

Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??

MIUI 12 ఫీచర్స్

MIUI 12 ఫీచర్స్

షియోమి సంస్థ యొక్క తాజా MIUI 12 మెరుగైన డార్క్ మోడ్, కొత్త యానిమేషన్లు, మెరుగైన గోప్యతా నియంత్రణలు వంటి మరెన్నో మార్పులను తీసుకువస్తున్నది. ఈ కొత్త అప్ డేట్ డార్క్ మోడ్ 2.0 ను అందిస్తుంది. ఇది 42 ఇన్‌బిల్ట్ యాప్ లకు మద్దతు ఇస్తుంది. షియోమి పంచుకున్న MIUI 12 రోడ్‌మ్యాప్ ప్రకారం జూన్ 2020 లో అనేక ఫోన్‌లు స్థిరమైన ఈ ఫీచర్ ను పొందడం ప్రారంభిస్తాయి. జూన్‌లో MIUI 12 ను పొందే హ్యాండ్‌సెట్లలో షియోమి రెడ్‌మి కె 20 సిరీస్, రెడ్‌మి కె 30 సిరీస్, Mi 10 సిరీస్, Mi 10 యూత్ ఎడిషన్ వంటివి మరిన్ని ఉన్నాయి.

షియోమి స్మార్ట్‌ఫోన్‌లు

షియోమి స్మార్ట్‌ఫోన్‌లు

షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో, రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి 8A, రెడ్‌మి 7, రెడ్‌మి 6 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది చివర్లో MIUI12 అప్‌డేట్ పొందవచ్చని భావిస్తున్నారు. ఇంకా షియోమి పరికరాలలో Mi 6, Mi 6X , Mi మిక్స్ 2, Mi నోట్ 3, మరియు రెడ్‌మి నోట్ 5 వంటి వాటికి బీటా బిల్డ్‌లు జూన్ నుంచి విడుదల కానున్నట్లు తెలిసింది. ఈ బ్రాండ్ త్వరలో Mi 10 సిరీస్‌తో పాటు MIUI 12 ను భారతదేశంలో విడుదల చేయనుంది.

Best Mobiles in India

English summary
Xiaomi MIUI 12 Interesting Camera Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X