ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

Posted By:

యాపిల్, లెనోవో, హెచ్‌పీ వంటి ప్రముఖ కంపెనీలకు సవాల్ విసురుతూ చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమి ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాదిలో తన మొదటి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం.

Read More : ఒళ్లుజలదరించే శాటిలైట్ చిత్రాలు

ఇదే జరిగితే యాపిల్, లెనోవో కంపెనీలకు షియోమి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ అలానే లెనోవో థింక్ ప్యాడ్‌లకు పోటీగా షియోమీ డిజైన్ చేస్తున్న నోట్‌బుక్ 2016 మొదటి క్వార్టర్‌లో మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి.

Read More : ట్విట్టర్ సీఈఓగా బెజవాడ మహిళ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

షియోమీ డిజైన్ చేస్తున్న నోట్‌బుక్‌లకు సంబంధించి మెమరీ చిప్‌‍లతో పాటు డిస్‌ప్లేలను సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సమకూరుస్తోందని ఓ రూమర్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

పించిన 5 సంవత్సరాల వ్యవధిలోనే గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిన షియోమీ బడ్జెట్‌ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకట్టుకోవటంలో పూర్తిస్థాయిలో విజయం సాధించింది.

ధరలు మరంతగా తగ్గే అవకాశం

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

పర్సనల్ కంప్యూటర్‌ల తయారీ రంగంలోకి షియోమీ అడుగుపెట్టిన పక్షంలో ల్యాప్‌టాప్‌ల ధరలు మరంతగా తగ్గే అవకాశముందని, పర్యావసానంగా లెనోవో, హెచ్‌పీ, యాపిల్ వంటి కంపెనీలు ధర ఒత్తిళ్లను ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమ్మకాల జోరు

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

షియోమీ ఉత్పత్తుల అమ్మకాల జోరు అటు చైనా మార్కెట్లోనే కాకుండా ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కొనసాగుతోంది.

 

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్స్

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

ప్రస్తుతానికి షియోమీ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్స్ వంటి ఉపకరణాలను అందిస్తోంది.

బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తోన్న షియోమీ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో చైనాలో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల కంపెనీగా అవతరించింది.

 

 

ఏప్రిల్ 6, 2010న ప్రారంభం

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

ఏప్రిల్ 6, 2010న ప్రారంభమైన ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. అనతికాలంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అవతరించిన బ్రాండ్‌లలో షియోమీ ఒకటి.

భారత్‌లో షియోమీ కార్యకలాపాలను

ఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

భారత్‌లో షియోమీ కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. షియోమీ ఉత్పత్తులను భారత్ లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi plans to launch laptop to take on Apple . Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot