ట్విట్టర్ సీఈఓ రేసులో బెజవాడ మహిళ..?

Posted By:

సీఈఓ వేటలో నిమగ్నమైన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ తమ సంస్థ సారథ్య బాధ్యతలను మాజీ సిస్కో ఎగ్జిక్యూటివ్ పద్మశ్రీ వారియర్‌కు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read More : సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

ట్విట్టర్ సారథ్య బాధ్యతల నుంచి డిక్ కాస్టోలో వైదొలిగిన తరువాత తమ సంస్థకు మంచి సీఈఓను వెతికే పనిలో ట్విట్టర్ నిమిగ్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది పేర్లను పరిశీలించిన ట్విట్టర్ అంతిమంగా పద్మశ్రీ వారియర్‌తో పాటు సీబీఎస్ ఇంటారాక్టివ్ విభాగం అధినేత జిమ్ లాన్ జోన్ పేర్లను ఎంపిక చేసినట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.

Read More : 3జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ దింపేసింది

అయితే, పద్మశ్రీ వారియర్ కన్స్యూమర్ ఇంటర్నెట్ వ్యాపారంతో అపారమైన అనుభవాన్ని కలిగిన నేపథ్యంలో ఈమెకే తమ సారథ్య బాధ్యతలను అప్పగించేందుకు ట్విట్టర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే, ట్విట్టర్ ఆఫర్‌పై పద్మశ్రీ ఇంకా ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

పద్మశ్రీ వారియర్ స్వస్థలం కృష్ణాజిల్లాలోని విజయవాడ.

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

విజయవాడలోని మాంటిస్సోరి స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివిన పద్మశ్రీ స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

పద్మశ్రీ ఢిల్లీ ఐఐటి నుంచి 1982లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు.

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

అమెరికాలో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన తరువాత 1984లో మోటరోలాతో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు.

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

23 సంవత్సరాలు పాటు ఆమె మోటోరోలా సంస్థకు సేవలందించారు. 

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

ఆ తరువాత ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన సిస్కో సిస్టమ్స్ కంపెనీకి పద్మశ్రీ వారియర్ చీఫ్ టెక్నాలజీ ఇంకా స్ట్రాటజి అధికారిగా .

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

సిలికాన్ వ్యాలీలో మగవారితో పోటీపడుతున్న అతికొద్ది మంది మహిళల్లో ఈమె ఒకరు

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

మోటరోలాతో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మశ్రీ వారియర్ అంచెలంచెలుగా టెక్నాలజీ రంగంలో ఎదుగుతూ ఎన్న మైలురాళ్లను అధిగమించారు. 

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

పద్మశ్రీ వారియర్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలను నిద్రలేస్తారట.

పద్మశ్రీ వారియర్ గురించి ఆసక్తికర విషయాలు

ముందుగా ఈ - మెయిల్స్‌ను చెక్ చేసుకోవటం ఆ తరువాత జిమ్, ఆపై పిల్లలను స్కూల్‌కు పంపి 8.30 ప్రాంతంలో ఆఫీసుకు బయలుదేరే వారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Twitter has talked to Cisco's Padmasree Warrior about being its next CEO. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot