మేక్ ఇన్ ఇండియా శుధ్ధ దండుగ , భారతీయులవి అరుపులే: చైనా బరితెగింపు

Written By:

చైనా రోజురోజుకి బరితెగిస్తోంది. ఈ సారి ఏకంగా మేక్ ఇన్ ఇండియా మీదనే తన చెత్త డైలాగులను వదిలింది. చైనా ఉత్పత్తులను భారత్ ఢీ కొట్ట లేదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. భారత్ తమ స్థాయికి చేరుకోవాలంటే ఏన్నో ఏళ్లు పడుతుందంటూ విమర్శలు చేసింది. చైనా ఎలా బరితెగించిందో మీరే చూడండి.

చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఎండమావే ! షాకింగ్ కారణాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా మీడియా ఎద్దేవా

యూరీ ఉగ్రదాడి అనంతరం పాక్ ను అన్ని రకాలుగా వెనకేసుకుని వస్తున్న చైనా మీడియా భారతీయులను తీవ్రంగా అవమానిస్తోంది. సోషల్ మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్న నేపథ్యంలో దీనిని చైనా మీడియా ఎద్దేవా చేసింది.

చైనాకు దిమ్మతిరిగింది :అప్పుడే హెచ్చరికలు మొదలుపెట్టింది

 

 

భారతీయుల ప్రచారం విజయవంతం కాదని

అంతే కాకుండా భారతీయుల ప్రచారం విజయవంతం కాదని, భారత్ లో చైనా వస్తువులను ఢీ కొట్టగల ఉత్పత్తులు లేవని స్పష్టం చేసింది. చైనా వస్తువులను తట్టుకుని నిలబడగలిగే వస్తువులను భారత్ ఉత్పత్తి చేయలేదని గర్వంగా ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమ స్థాయికి చేరుకోవాలంటే

భారత్ తమ స్థాయికి చేరుకోవాలంటే చాలా కాలం పడుతుందని, అంత వరకు భారతీయ మార్కెట్‌లో చైనా ఉత్పత్తుల అమ్మకాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది.

భారతీయులవి ఉత్తుత్తి అరుపులేనని

భారతీయులవి ఉత్తుత్తి అరుపులేనని, అవి తమనేమీ చేయలేవంటూ ‘గ్లోబల్ టైమ్స్' పత్రిక స్పష్టం చేసింది. అంతే కాకుండా చైనా వాణిజ్యాన్ని అడ్డుకునే సత్తా భారత్‌ కు లేదని తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమకంటే చాలా విషయాల్లో

చైనా వస్తువుల పట్ల భారతీయులను ఆకట్టుకోవడం వెనుక ధరలు, వేరియంట్లు వంటి చాలా కారణాలు ఉన్నాయని, సాంకేతిక ప్రమాణాల్లో కూడా భారత్ తమకు సాటి రాదని, దీంతో తమకంటే చాలా విషయాల్లో వెనకబడి ఉన్న భారతదేశం తమ ఉత్పత్తులను అడ్డుకోలేదని తెలిపింది.

ఆ దేశానికి అందని ద్రాక్షగానే

ముందు ఆ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ, నీటి సరఫరా వంటి వాటి సంగతి చూసుకోవాలని ఉచిత సలహా పారేసింది. పెరిగిపోతున్న అవినీతితో అభివృద్ధి అనేది ఆ దేశానికి అందని ద్రాక్షగానే ఉంటుందని తెలిపింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోడీ మేక్ ఇన్ ఇండియాపై

ఇక మోడీ మేక్ ఇన్ ఇండియాపై కూడా విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా' కూడా శుద్ధ దండగ కార్యక్రమమని తెలిపింది. భారత్‌ లో చైనా కంపెనీలు దుకాణాలు ప్రారంభించడం కంటే చైనాలో మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు స్థాపించుకుని, ఎగుమతి చేయడమే ఉత్తమమని సూచించింది.

18 రోజుల్లోనే పది లక్షల స్మార్ట్‌ ఫోన్లు

ఓ వైపు ఇలాంటి విమర్శలు చేస్తూనే మరో వైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోపోతోంది. ఈ నెలలో కేవలం 18 రోజుల్లోనే పది లక్షల స్మార్ట్‌ ఫోన్లు విక్రయించి షియోమీ రికార్డు సృష్టించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు నుంచి ఐదేళ్లలో నంబర్ వన్ స్థానాన్ని

భారత్‌‌లో రానున్న మూడు నుంచి ఐదేళ్లలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ గ్లోబల్ సీఈవో లీ జున్ తెలిపారు. భారత్ తమకు ప్రధాన మార్కెట్ అన్న ఆయన భారత్ మార్కెట్ కారణంగా షియోమీ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని తెలిపారు.

మరోసారి మరింత మార్కెట్ సాధించాలని

ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్, స్నాప్‌ డీల్ ద్వారా ఈ నెల మొదట్లో లక్షలాది ఫోన్లను విక్రయించిన షియోమీ, దీపావళి ఆఫర్ల పేరుతో మరోసారి మరింత మార్కెట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గత ఏడాది ఒక్క నెల రోజుల్లో ఐదు లక్షల ఫోన్లు

గత ఏడాది ఒక్క నెల రోజుల్లో ఐదు లక్షల ఫోన్లు విక్రయించగా ఈ ఏడాది గత ఆరు నెలల్లో 20 లక్షలకుపైగా ఫోన్లు విక్రయించినట్టు తెలిపింది.

ఓ వైపు విమర్శలు చేస్తూనే

ఓ వైపు విమర్శలు చేస్తూనే మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్న చైనా ఇప్పటికైనా తన వంకరబుద్దులు మానుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. చైనా ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నదే చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Xiaomi sells 1 million smartphones in 18 days in India, says will be No 1 in 3-5 years Read more at gizbot relugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot