షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్స్ ప్రపంచంలోకి రివ్వున దూసుకొచ్చిన ప్రముఖ చైనా కంపెనీ షియోమి (Xiaomi) 5వ వసంతంలోని అడుగుపెట్టింది. ‘యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీని ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు.
ఇంకా చదవండి: వీటిలో ఏది మీ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్..?
చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న షియోమీ సంస్థకు చైర్మన్ ఇకా సీఈఓగా ఈయనే వ్యవహరిస్తున్నారు. షియోమి 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో 5 ఆసక్తికర విషయాలను మీముందుంచుతున్నాం...

షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
షియోమి అధికారిక మాస్కట్ బన్నీ ఇదే. పేరు మిటు (Mitu)

షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
చైనా భాషలో షియోమి ఇంటే 'చిన్న రైస్' ( little rice) అని అర్థం.

షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
షియోమి సంస్థను యాపిల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సంస్థ వ్యవస్థాపకులైన లీ జన్ ను ‘స్టీవ్‌జాబ్ప్ ఆఫ్ చైనా'గా పిలుస్తారు.

షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
షియోమి కంపెనీలో మొదటి 9 లీడర్ షిప్ స్థానాల్లోని మూడు స్థానాలను మాజీ గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు. వారి వివరాలు లిన్ బిన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా అధ్యక్షుడు), హాంగ్ ఫింగ్ (సహ వ్యవస్థాపకులు ఇంకా ఉపాధ్యక్షుడు), హ్యూగో బర్రా, వైస్ ప్రెసిడెంట్.

షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు
షియోమి ఫోన్ లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవటంతో కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది. 2013లో షియోమి అమ్మకాలు 4.3బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాటిలో అర్జించిన లాభం 56 మిలియన్ డాలర్లు. 2014లో షియోమి టెక్నాలజీ అమ్మకాలు 11.97 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభాల శాతం వెల్లడి కావల్సి ఉంది.


Click it and Unblock the Notifications