ఇంటిదారి పట్టనున్న 17 వందల మంది యాహూ ఉద్యోగులు !

By Hazarath
|

యాహూ ఉద్యోగులు ఇంటిదారి పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా యాహూ అనుకున్నంతగా ఫలితాలను రాబట్టలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్రైమాసిక లాభాల రిపోర్ట్ విడుదలయిన తర్వాత ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఎంతమంది ఉద్యోగులు ఇంటిదారి పట్టనున్నారు అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: అమ్మాయిల మధ్యలో నేనొక్కడినే : బిల్‌గేట్స్

యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు
 

యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది.

త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత

త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత

నేడు త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.

సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.

సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.. దాదాపు 1700 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా

మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా

మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది.

కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపారా యూనిట్లను
 

కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపారా యూనిట్లను

ఉద్యోగులను తొలగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపారా యూనిట్లను కూడా మూసివేయ నుందని సమాచారం.

గూగుల్‌ ఆల్ఫాబేట్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తీవ్ర పోటీ

గూగుల్‌ ఆల్ఫాబేట్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తీవ్ర పోటీ

ముఖ్యంగా సెర్చ్‌, ప్రకటనలు, వార్తలు, క్రీడా వెబ్‌సైట్‌లు, ఈ-మెయిల్‌ సర్వీస్‌ల విభాగంలో గూగుల్‌ ఆల్ఫాబేట్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది.2012 నుంచి యాహూ తన ఆదాయంలో తగ్గుదల నమోదు చేస్తూ వస్తోంది.

చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని

చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని

గతేడాది డిసెంబర్ లో యాహు కంపెనీలో ఓ ఇన్వెస్టర్ స్ప్రింగ్ ఓల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ను నియమించడంతో పాటు 80శాతం ఉద్యోగాలకు కోతపెట్టింది. చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని నిర్ణయించుకుంది.

యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో

యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో

గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు.

యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో

యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో

సరిగ్గా అదేరోజు కంపెనీ ఉద్యోగుల కోత విషయం బయటకు రావడంతో సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write Yahoo to announce job cuts: report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more