తప్పులకు భారీ మూల్యం..లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు యాహూ పతనం

Written By:

గూగుల్ కంటే ముందు వచ్చి ప్రపంచ ఇంటర్నెట్ రంగాన్ని ఏలిన యాహూ స్వతంత్ర శకం ముగిసింది. సెర్ఛ్, మెయిల్,చాట్, న్యూస్, ఇలా ఏదైనా మొత్తం ఇంటర్నెట్ రంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న యాహూ గూగుల్ రాకతో ఒక్కసారిగా కుదేలైంది. గూగుల్ తో పోటీ పడలేక వరుస నష్టాలను మూటగట్టుకుంది. తెచ్చిన కొత్త ఉత్పత్తులన్నీ ఫ్లాప్ కావడంతో ఇంకా పాతాళానికి దిగజారిపోయింది. అయితే వచ్చిన అవకాశం చేజార్చుకుంటే ఎంత ఫలితం అనుభవించాలన్నదే యాహూకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. యాహూ పతనంపై స్పెషల్ స్టోరి.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మారుతున్న కాలానికి

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే ఎంతగా నష్టపోవాల్సి వస్తుందన్న దానికి యాహూ ఓ మంచి ఉదాహరణగా భవిష్యత్ తరాల కళ్ల ముందు నిలిచింది.

గూగుల్ దూసుకెళుతున్న వేళ

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ఇతర సంస్థలు ప్రధానంగా గూగుల్ దూసుకెళుతున్న వేళ, అపారమైన ఆర్థిక వనరులుండి కూడా ముందడుగు వేయలేక చతికిలబడిన యాహూ ఇంటర్నెట్ కార్యకలాపాలను టెలికం సంస్థ వేరీజోన్ రూ. 32 వేల కోట్లకు కొనుగోలు చేసింది.

2000 సంవత్సరంలో యాహూ విలువ

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

అయితే ఇదే యాహూ ఇంటర్నెట్ విలువ 2000 సంవత్సరంలో ఎంతో తెలుసా.. 125 బిలియన్ డాలర్లు! డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 45 .. ఆ రేటుపై లెక్కిస్తే, యాహూ విలువ రూ. 5.60 లక్షల కోట్లు.

నిర్లక్ష్యం

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

1998 లో గూగుల్ ను ప్రారంభించిన లారీ పేజ్, సెర్జి బ్రిన్ ను దాన్ని కొనుక్కోవాలని యాహూను సంప్రదిస్తే, నిర్లక్ష్యం చేసి తిరస్కరించారు. ఆపై అదే గూగుల్ తో డీల్ కుదుర్చుకుని ఆ సంస్థ శరవేగంగా ఎదిగేందుకు సహకరించి, సమగ్రమైన సొంత సెర్చింజన్ ను తయారు చేసుకోలేకపోయారు.

మైక్రోసాఫ్ట్ తోనూ నిర్లక్ష్యం

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ఆ తరువాత ఎనిమిదేళ్లకు నెట్ ప్రపంచంలో దూసుకువచ్చిన మైక్రోసాఫ్ట్, 2008 సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ .1.76 లక్షల కోట్లు -. ఒక డాలర్ రూ 40 పై.) ఇచ్చి యాహూను కొనేందుకు ముందుకు వచ్చినా, బోర్డు డైరెక్టర్లు ససేమిరా అన్నారు.

2000 సంవత్సరం ముందు వరకూ

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

2000 సంవత్సరం ముందు వరకూ యాహూ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2008 లో కూడా యాహూను కొనుగోలు చేయడం కోసం మైక్రోసాఫ్ట్ 44 బిలియన్ డాలర్లకు బిడ్ వేయడం గమనార్హం.

టంబ్లర్ తో భారీ నష్టాలు

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ఇక యాహూ సోషల్ మీడియాపై పట్టు సంపాదించేందుకు ఆన్లైన్ బ్లాగింగ్ సంస్థ టంబ్లర్ను 2013 లో బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.కాని అది ఫ్లాప్ కావడంతో మరిన్ని నష్టాలను మూటగట్టుకుంది.

ఎనిమిదేళ్లు గడిచేసరికి

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

2015 లో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 4.4 బిలియన్ డాలర్ల నష్టం రావటం గమనార్హం. మరో ఎనిమిదేళ్లు గడిచేసరికి యాహూ విలువ మరెన్నో రెట్లు పడిపోయింది. 

స్టార్టప్ లతో ఇంకా పతనం

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ఇక 2000 తరువాత వచ్చిన డాట్ కాం బూమ్ ను ముందుగా అంచనా వేయలేకపోయిన యాహూ డైరెక్టర్లు, యాజమాన్యం ఆపై తేరుకొని ఫ్లిక్కర్, డెలిషియస్, అప్ కమింగ్, మై బ్లాగ్ లాగ్ వంటి స్టార్టప్ లను భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేయగా, అవి కలసిరాలేదు.

యాహూ మార్కెట్ విలువ

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ప్రస్తుతం యాహూ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లు (దాదాపు రూ .2.5 లక్షల కోట్లు) గా ఉంది. అయితే, ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో యాహూకు ఉన్న 15 శాతం వాటా ఆధారంగానే ఇంతటి విలువ ఉంది. అలీబాబాలో ఉన్న యాహూ వాటా విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లు.

ఉద్యోగులు

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాహూలో 2014 వరకూ 11,000 మంది ఉద్యోగులుండగా కోతల కారణంగా ఈ మార్చి నాటికి 9.400 మంది మిగిలారు.

వెరిజాన్ ఆధీనంలో

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

దాదాపు 228 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న అమెరికా టెలికం అగ్రగామి వెరిజాన్ గతేడాది ఏఓఎల్ను 4.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా హఫింగ్టన్ పోస్ట్, టెక్క్రంచ్, ఎన్గ్యాడ్జెట్ తదితర న్యూస్ వెబ్సైట్లను తన యాజమాన్యంలోకి తీసుకొచ్చింది.

తప్పు మీద తప్పు చేస్తూ

లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు..యాహూ పతనానికి కారణాలనేకం

మొత్తానికి తప్పు మీద తప్పు చేస్తూ వచ్చిన సంస్థ అందుకిప్పుడు తగిన మూల్యాన్నే చెల్లించుకుందన్నది నెట్ నిపుణుల అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Yahoo: the rise and fall of an internet pioneer
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot