25వేల సెల్ఫీలతో మీ జీవితం సమాప్తం

Written By:

సెల్పీ.....మనిషి జీవితంలో ఇప్పుడు ఓ భాగమైపోయింది. తినడానికి తిండి లేకపోయినా కాని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపేయవచ్చని ఈ కాలం యువతరం ఆలోచిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏమైనా అందమైన ప్రదేశం కనిపిస్తే చాలు అక్కడ సెల్ఫీ క్లిక్ మనాల్సిందే..ఇక హర్రర్ కి సంబంధించి ఏదైనా కనిపిస్తే చాలు దాన్ని కూడా క్లిక్ మనిపించాల్సిందే....ఓ మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎన్ని సెల్ఫీలు తీసుకుంటారో అనే దానిపై ఈ మధ్య పరిశోధనలు నిర్వహించారు..సో దాని మీద ఓ స్మార్ట్ లుక్కేయండి మరి.

Read more:మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలు

జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలు

ఓ వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోవచ్చు..? 1980 తర్వాత జన్మించిన వారు ముసలివాళ్లు అయ్యే వరకు సెల్ఫీలు తీసుకుంటే మొత్తం ఎన్ని సేకరించవచ్చు.ఓ పరిశోధన ప్రకారం ఒక్కొక్కరు తమ జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలను తీసుకోవచ్చట.

25,676 సెల్ఫీలు

25,676 సెల్ఫీలు

లస్టర్ ప్రీమియం వైట్ నిర్వహించిన సర్వలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సెల్ఫీల సరదా ఉన్నవారు తమ జీవిత కాలంలో సరాసరిన 25,676 సెల్ఫీలు తీసుకుంటారని అంచనా వేసింది.

సెల్ఫీల సరదా ఎక్కవ

సెల్ఫీల సరదా ఎక్కవ

సోషల్ మీడియా,ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇన్ స్టా గ్రాం లో అకౌంట్లు ఉన్నవారికి సెల్ఫీల సరదా ఎక్కవగా ఉంటుందని ఆ సర్వేలో వెల్లడయింది.

1000 మంది అమెరికన్లను సర్వే

1000 మంది అమెరికన్లను సర్వే

1000 మంది అమెరికన్లను సర్వే చేయగా ఏదైనా వేడుక లేదా కుటుంబ సభ్యుల,స్నేహితులతో కలిసి గడిపిన సంధర్భంగా సెల్ఫీలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక 63 శాతం మంది సెల్ఫీలు తీసుకోవడానికి విహార యాత్ర అనువైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు.

సెల్ఫీలు తీసుకునే ముందు..

సెల్ఫీలు తీసుకునే ముందు..

సగంమంది సెల్ఫీలు తీసుకునే ముందు జట్టును సవరించుకుంటామని తెలిపారు.మరో 53 శాతం మంది సెల్ఫీ దిగేముందు అద్దంతో తమ ముఖం చూసుకుంటామని చెప్పారు.

ఒక్క సెల్ఫీ అయినా..

ఒక్క సెల్ఫీ అయినా..

47 శాతం మంది సెల్ఫీలకు ముందు ముఖకవళికలను ప్రాక్టీస్ చేస్తామని వెల్లడించారు. 95 శాతం మంది కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకున్నారని సర్వేలో తెలిపింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

సో మీరు ఎన్ని సెల్ఫీలు తీసుకుంటారో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోండి మరి. మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write You will snap over 25,000 selfies in your lifetime!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting