యుద్ధానికి సై అంటున్న పాకిస్తాన్‌కు యూట్యూబ్ ఏం వరం ఇచ్చిందంటే..?

Written By:

ఓ వైపు దాయాది దేశంతో యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఈ టైంలో యూట్యూబ్ పాకిస్తాన్‌కు ఏం అవకాశం ఇచ్చిందో తెలుసా..అక్కడ 8 నెలల కిందట బంద్ అయిన యూ ట్యూబ్ ఇప్పుడు మళ్లీ ప్రారంభించేందుకు రెడీ అయింది. అదీ ఇంటర్నెట్ లేకుండానే వీడియోలను వీక్షించే అవకాశాన్ని కల్పించింది. అదీ ఈ సమయంలో కల్పించడం అనేది అర్థంకాని విషయంలా మారింది.

4జిబి ర్యామ్‌తో కూల్ ప్యాడ్ నోట్ 5 దిగింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్ లైన్ ల్లోనూ వీడియోలు

ఎనిమిది నెలల తర్వాత పాకిస్థాన్ లో యూట్యూబ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. కొత్త ఫీచర్లతో పాక్ యూజర్లు చేరువయ్యేందుకు యూ ట్యూబ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆఫ్ లైన్ ల్లోనూ వీడియోలు వీక్షించే అవకాశం కల్పించింది.

పాపులర్ వీడియోలు తాత్కాలికంగా

యూ ట్యూబ్ రీ లాంచింగ్ సందర్భంగా కరాచీలోని డీహెచ్ఏ గోల్ఫ్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ ఆఫ్‌లైన్ ఫీచర్లను ప్రకటించింది. పాపులర్ వీడియోలు తాత్కాలికంగా ఆఫ్ లైన్ లోనూ  వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పింది.

యూజర్లు తమకు ఇష్టమైన వీడియోలను

యూజర్లు తమకు ఇష్టమైన వీడియోలను సులువుగా వీక్షించేందుకు ఈ ఫీచర్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా వీడియోలకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయని గూగుల్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ టీమ్ హెడ్ తానియా అయిడ్రస్ తెలిపారు.

పాకిస్థాన్ వినియోగదారులకు

పాకిస్థాన్ వినియోగదారులకు వీడియో కంటెంట్ ను మరింత అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఈ వీడియోలు చూడొచ్చని వెల్లడించారు.

48 గంటల పాటు ఆఫ్‌లైన్ లో

దీంతో పాటు తాము ఎంచుకున్న వీడియో 48 గంటల పాటు ఆఫ్‌లైన్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. వై-ఫై, డేటా కనెక్షన్ లేకుండానే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చన్నారు.

కంటెంట్ క్రియేటర్స్ కోసం

కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీని ద్వారా వీడియోలు రూపొందించేవారికి అవకాశాలు, నైపుణ్యాలు పెంచుకోవచ్చని తెలిపారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే



English summary
YouTube launches new features in Pakistan read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting