YouTubeలో పరీక్ష దశలో కొత్త ఫీచర్!! షాపింగ్ చేయడం ఇంకా సులువు...

|

కొత్త సినిమా యొక్క ట్రైలర్ మరియు ఇతర వీడియోలను చూడడానికి ఎక్కువ మంది ఎంచుకునే వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో మొదటిది యూట్యూబ్. ఈ వీడియో స్ట్రీమింగ్ తన వినియోగదారుల కోసం క్రొత్తగా మరొక ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇది వినియోగదారులు వీడియోలను చూస్తున్నప్పుడు తమ ప్లాట్‌ఫాం నుండి నేరుగా కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

యూట్యూబ్ వీడియో

యూట్యూబ్ వీడియోలలో కనిపించే ఉత్పత్తులను వీక్షకులు కనుగొనగలరు మరియు షాపింగ్ చేయగలరు. యుఎస్‌లో తక్కువ సంఖ్యలో వినియోగదారులతో ఆండ్రాయిడ్, iOS మరియు వెబ్‌లో ఈ వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ ఫీచర్ ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. వీడియో యొక్క సృష్టికర్తలు ఎంచుకున్న షాపింగ్ బ్యాగ్ చిహ్నం ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న వాటిని వారి వీడియోలకు జోడించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యూట్యూబ్ కొత్త ఫీచర్

యూట్యూబ్ కొత్త ఫీచర్

గూగుల్ యాజమాన్యంలోని సంస్థ గూగుల్ సపోర్ట్ పేజీలో పరీక్షించబడుతున్న ఈ కొత్త ఫీచర్ గురించి వివరాలను విడుదల చేయలేదు. ఈ ఫీచర్ వీక్షకులకు సంబంధిత సమాచారాన్ని పొందడానికి మరియు వారు వీడియోలలో చూసే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలుగా కొన్ని ఎంపికలను అనుమతిస్తుంది అని యూట్యూబ్ తెలిపింది. ఈ ఫీచర్ ను ప్రఖ్యాతిగాంచిన సృష్టికర్తలతో కలిసి పనిచేస్తున్నట్లు ప్లాట్‌ఫాం తెలిపింది.

యూట్యూబ్ వీడియో షాపింగ్ బ్యాగ్ ఫీచర్

యూట్యూబ్ వీడియో షాపింగ్ బ్యాగ్ ఫీచర్

యూట్యూబ్ లోని వీడియోలలో దిగువవైపున ఎడమ మూలలో కనిపించే షాపింగ్ బ్యాగ్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా వీక్షకులు కొత్త ఫీచర్ లో భాగంగా జోడించిన ఉత్పత్తుల జాబితాను చూడగలరు. దాని మీద క్లిక్ చేయడంతో ఇక్కడ నుండి వారు నేరుగా ప్రోడక్ట్ యొక్క పేజీకి తరలించబడతారు. అక్కడ వారికి కావలసిన ఉత్పత్తులను అన్వేషించవచ్చు, అక్కడ వారు మరింత సమాచారం, సంబంధిత వీడియోలు మరియు ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ఎంపికలను కనుగొంటారు. యూట్యూబ్ యొక్క తాజా టెస్ట్ రన్ విస్తరణ దశలో ఉంది. కాలక్రమేణా ముందు ముందు ఎక్కువ మంది వినియోగదారులకు ఈ ఫీచర్‌ను యూట్యూబ్ విడుదల చేసే అవకాశం ఉంది.

గూగుల్ షాపింగ్ ప్రకటనలు

గూగుల్ షాపింగ్ ప్రకటనలు

యూట్యూబ్ ఆరు సంవత్సరాల క్రితం గూగుల్ షాపింగ్ ప్రకటనలను వినియోగదారులకు చూపించడం ప్రారంభించింది. ఇది డిజిటల్ స్టోర్ ఫ్రంట్‌గా ఉండటానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ ప్రకటనలు వినియోగదారులను వీడియోల ద్వారా నేరుగా షాపింగ్ చేయడానికి అనుమతించాయి.

యూట్యూబ్ సాఫ్ట్‌వేర్‌

యూట్యూబ్ సాఫ్ట్‌వేర్‌

వీడియోలలో కనిపించే ఉత్పత్తులను ట్యాగ్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి యూట్యూబ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించమని యూట్యూబ్ సృష్టికర్తలను కోరడం ప్రారంభించినట్లు 2020 అక్టోబర్‌లో బ్లూమ్‌బెర్గ్ సంస్థ మొదట నివేదించింది. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం డేటా గూగుల్ యొక్క షాపింగ్ టూల్స్ మరియు విశ్లేషణలకు అనుసంధానించబడుతుంది. ఈ ప్లాట్‌ఫాం పరిమిత సంఖ్యలో వీడియో ఛానెల్‌లతో ఫీచర్లను పరీక్షిస్తోంది. అలాగే ఉత్పత్తులపై సృష్టికర్తలకు నియంత్రణ ఉంటుందని యూట్యూబ్ ప్రతినిధి నివేదికలో దృవీకరించారు.

Best Mobiles in India

English summary
YouTube Testing New Feature in Videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X