యూట్యూబ్‌లో ఇక డబ్బులు చాలా కష్టం, రూల్స్ మార్చింది !

Written By:

అత్యంత తేలికగా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఉందంటే అది యూ ట్యూబ్ మాత్రమే. వీక్షకులందరినీ ఆకట్టుకునేలా సొంతంగా ఓ వీడియో రికార్డ్ చేసి అందులో పెడితే చాలు, ఆ వీడియోకు వచ్చిన వ్యూస్, వాటిలో కనిపించే యాడ్స్‌ను బట్టి ఆ వీడియో పెట్టిన వారికి డబ్బులు వస్తాయి. కాని ఇప్పుడు రూల్స్ మారాయి. 10 వేల వ్యూస్ వస్తేనే యాడ్ డిస్ ప్లే అవుతుంది.

జియోతో పోటీకి వచ్చే ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏకంగా చానల్స్ పెట్టి

చాలా మంది సొంతంగా యూట్యూబ్‌లో ఏకంగా చానల్స్ పెట్టి వీడియోలను షూట్ చేసి వాటిలోకి అప్‌లోడ్ ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్‌లో త్వరలో కఠినమైన రూల్స్

అయితే ఇకపై యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం చాలా కష్టతరమవుతుందని తెలిసింది. యూట్యూబ్‌లో త్వరలో కఠినమైన రూల్స్ రానున్నాయి.

యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు

ప్రస్తుతం యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు 1000 వ్యూస్ కి ఇంత, లేదంటే వీడియో మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌ను వీక్షిస్తే, వాటిని క్లిక్ చేస్తే ఇంత అని యూట్యూబ్ డబ్బులు చెల్లిస్తోంది.

యాడ్ డిస్‌ప్లే కావాలంటే కనీసం 10వేల వ్యూస్

అయితే ఇకపై అలా కాదు. ఏ వీడియోకైనా యాడ్ డిస్‌ప్లే కావాలంటే కనీసం 10వేల వ్యూస్ ఉండాల్సిందేనని తెలిసింది. దీంతోపాటు వీడియోలో వచ్చే యాడ్స్‌ను వీక్షకులు క్లిక్ చేస్తేనే అప్‌లోడర్‌కు డబ్బులు అందించేలా యూట్యూబ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ఎలాంటి అధికారిక సమాచారం

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఇవే రూల్స్‌ను యూట్యూబ్ త్వరలో అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది. తన ప్రత్యర్థి సంస్థలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే గూగుల్ తన యూట్యూబ్ సైట్‌లో ఇలాంటి మార్పులు తెస్తున్నట్టు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YouTube will no longer allow creators to make money until they reach 10,000 views Read more At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot