4జీబి ర్యామ్‌తో ‘రియల్ బీస్ట్’ వచ్చేస్తోంది

Written By:

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ 'యు’ (YU) తన తరువాతి ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'యుటోపియా' (Yutopia)ను డిసెంబర్ 7న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 'ద రియల్ బీస్ట్ 07.12.15వ తేదీన టౌన్‌లోకి రాబోతోందంటూ' ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన ప్రతులలో కంపెనీ పేర్కొంది. మైక్రోమాక్స్ సహవ్యవస్థాపకులు రాహుల్ శర్మ తమ యుటోపియా ఫోన్‌ను ప్లానెట్‌లోనే శక్తివంతమైన ఫోన్‌గా అభివర్ణించారు.

 4జీబి ర్యామ్‌తో ‘రియల్ బీస్ట్’ వచ్చేస్తోంది

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం యుటోపియా ఫోన్ శక్తివంతమైన స్పెక్స్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ మెటల్ డిజైనింగ్‌తో లభ్యమయ్యే అవకాశం. 

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో లభ్యమయ్యే అవకాశం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్‌ తో రాబోతున్నట్లు సమాచారం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

16జీబి ఇంకా 3జీబి స్టోరేజ్ వేరియంట్స్‌లో ‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ లభ్యమయ్యే అవకాశం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో లభ్యమయ్యే అవకాశం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ సపోర్ట్‌తో లభ్యమయ్యే అవకాశం.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్

‘యు యుటోపియా' స్మార్ట్‌ఫోన్ రూమర్స్

మార్కెట్లో దొరికుతున్న అన్ని ప్రీమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.30,000 అంతకన్నా ఎక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ అయిన YU హైఎండ్ స్పెక్స్ తో విడుదల చేయబోతోన్న అల్టిమేట్ ఫ్లాష్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్లో ఎంత ఉండొచ్చనే అంశం పై సర్వత్రా ఆసక్తిచర చర్చ సాగుతోంది. ఈ సస్పెన్స్ కు తెరపడాలండే డిసెంబర్ 7వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Yu Yutopia launching on December 7. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot