Home
News

ZEE5 ప్రీమియం వార్షిక చందా 50% తగ్గించింది!! మిస్ చేయకండి...

Zee ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEE) యొక్క వీడియో-ఆన్-డిమాండ్ సర్వీస్ ప్రారంభం అయ్యి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది. ఇటీవల ఫిబ్రవరి 14 న మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా కూడా జరుపుకున్నది. ఈ శుభసందర్భంగా ZEE5 తన వార్షిక చందా ధరను 50% తగ్గించి కేవలం 499 రూపాయలకు అందిస్తున్నది. ZEE5 యొక్క ఈ తగ్గింపు ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీడియో-ఆన్-డిమాండ్ సర్వీస్ మార్కెట్లలో ZEE5 వేగంగా అభివృద్ధి చెందుతున్నది.

OTT ప్లాట్‌ఫాం

2020 లో తన యొక్క OTT ప్లాట్‌ఫాంలో పలు భాషల్లోని కొన్ని ముఖ్యమైన వెబ్ సిరీస్‌లు మరియు సినిమాల హక్కులను పొందగలిగింది. SunNXT మాదిరిగానే ZEE5 కూడా ప్రాంతీయ మార్కెట్లలో బలమైన బేస్ ను కలిగి ఉంది. 2021 లో ZEE5 మరిన్ని ఒరిజినల్ టీవీ షోలు మరియు సినిమాలను అందించాలని చూస్తోంది. జనవరి 2021 లో Zee ప్లాట్‌ఫాంలో ఇప్పటికే మూడు ఒరిజినల్స్ మరియు సినిమాలను కూడా విడుదల చేసింది.

ZEE5 ప్రీమియం నో బ్రైనర్ డీల్

ZEE5 ప్రీమియం నో బ్రైనర్ డీల్

ZEE5 ప్రీమియం యొక్క సబ్స్క్రిప్షన్ సాధారణంగా 12 నెలల చెల్లుబాటు కాలానికి రూ.999 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్రస్తుత ఆఫర్లో భాగంగా పరిమిత కాలానికి ZEE5 ప్రీమియం యొక్క ధరను 499 రూపాయలకు తగ్గించింది. అలాగే ఒక నెల మరియు మూడు నెలల సభ్యత్వాలను రూ.99 మరియు రూ.299 ధరల వద్ద పొందవచ్చు. ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా కంపెనీ యొక్క వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు లేదా మొబైల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి యాక్టీవేషన్ ను ప్రారంభించవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 28 తో ముగుస్తుంది అని గుర్తుంచుకోండి.

ZEE5 ప్రీమియం

ZEE5 ప్రీమియం మీద ప్రస్తుతం 50% డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించడంతో పాటు మనోజ్ బాజ్‌పేయి నటించిన 'సైలెన్స్... కెన్ యు హియర్ ఇట్?' థ్రిల్లర్ సిరీస్ ZEE5 ప్రీమియంలో మార్చి 26 న విడుదల కానుందని ZEE5 ధృవీకరించింది. ఇప్పటివరకు ZEE5లో 2021 లో కాగాజ్, నెయిల్ పోలిష్ మరియు జీత్ కి జిడ్ వంటి మూడు ఒరిజినల్ సినిమాలను విడుదల చేసింది. OTT ప్లాట్‌ఫామ్ యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా కూడా ఈ సంవత్సరం ZEE5 లో మరిన్ని ఒరిజినల్ కంటెంట్ విడుదల చేయబడుతుందని ధృవీకరించారు.

ఎయిర్టెల్ & Vi రీఛార్జిలతో ZEE5 ఉచిత యాక్సిస్

ఎయిర్టెల్ & Vi రీఛార్జిలతో ZEE5 ఉచిత యాక్సిస్

ప్రస్తుతం ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని నేరుగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోతే కనుక మీరు ఎయిర్టెల్ యొక్క రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ లేదా వోడాఫోన్ ఐడియా యొక్క వివిధ సిరీస్ ప్రీపెయిడ్ రీఛార్జిలతో కూడా ఎంచుకోవచ్చు. ఇవి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ZEE5 ప్రీమియం చందాను అందిస్తాయి. Vi తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రీమియమ్‌కు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
ZEE5 Premium Annual Subscription Price Slashed Up to 50%
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X