వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

Written By:

అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు.

Read more: ఇండక్షన్ స్టవ్ సూత్రమేంటి..? దానితో లాభాలేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

శివునికి తోడుగా నందీశ్వరుడు కూడా అంతే ఎత్తులో ఉండాలనుకున్నారో ఏమో కాని అతి పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలెట్. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది.అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

అయితే ఈ దారులు ఆలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడు తగు జాగ్రత్తల కోసం తయారుచేసుకున్నారని కొంతమంది వాదిస్తుంటారు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 1000 year old secret drilling technology revealed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more