అడవుల్లో అంతుచిక్కని నగరాన్ని కనిపెట్టిన 15 ఏళ్లబాలుడు, నివ్వెరపోతున్న సైంటిస్టులు

|

దాదాపు 1700 సంవత్సరాల క్రితం మరుగనపడిపోయిన నగరాన్ని ఓ బాలుడు బయటి ప్రపంచానికి అందించాడు. ఎక్కడో మెక్సికన్ లోని దట్టమైన అడవుల్లో ఎవ్వరికీ కనపడకుండా పోయిన ఆ అద్భుతమైన నగరాన్ని. ఆ నగరానికి చెందిన నాగరికతను ఈ 15 ఏళ్ల బాలుడు కనిపెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ గా మారాడు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఆ బాలుడు కనుగొన్న నగరం మయన్ నాగరికతకు చెందినదిని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. ఆసక్తితో పాటు సంచలనంగా మారిన కథనం మీకోసం.

Read more: ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట వెలసిల్లిన నాగరికతల్లో మాయ నాగరికత ఒకటి. ఆ నాగరికత ఎందుకు కనుమరుగైందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

దట్టమైన మెక్సికన్‌ అడవుల్లో దాగి ఉన్న ఈ అద్భుత నగరాన్ని కెనడాకు చెందిన కుర్రాడు విలియం గడౌరి గుర్తించి పరిశోధకులు ఆశ్చర్యపోయేలా చేశాడు. శాటిలెట్ ఫొటోల ఆధారంగా బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు
 
15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని ఈ బాలుడు గుర్తించాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించి వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

మాయ నాగరికత మెక్సికోలోని యాక్టన్‌ ప్రాంతం నుంచి గుటెమల, హోండురస్‌ వరకు విస్తరించి ఉన్నట్లు పరిశోధకుల అంచనా. ఈ నాగరికత కాలంలో కళలు, గణితం, జ్యోతిషానికి ఎంతో ప్రాచుర్యం ఉండేది. మయన్‌ ప్రజలు శిల్ప నైపుణ్యం, నిర్మాణ శాస్త్రం, బొమ్మల లిపి వంటి కళల్లోనూ ప్రసిద్ధులు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

అప్పట్లో వారి కాలగణన కూడా ఎంతో విభిన్నంగా ఉండేది. దేవాలయాల్లోని శిల్పసౌందర్యం అయితే అనుపమానమైనది. అప్పటి ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పురాతన కట్టడాలు, నిర్మాణాలు దట్టమైన మెక్సికన్‌ అడవుల్లో ఇప్పుడు  బయటపడ్డాయి.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

అయితే 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. ఎంత వెతికినా దీని జాడ మాత్రం కానరాలేదు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

వారు కనిపెట్టలేని ఆ అదృశ్య నగరాన్ని ఈ బాలుడు తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా గుర్తించినట్లు చెప్తున్నాడు. మరి ఎలా కనుక్కున్నావంటే మాయ నాగరికత నాటి నిర్మాణాలున్న మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఈ నగరం ఉన్నట్లు తాను తెలుసుకున్నానని చెబుతున్నాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

వారు అలా ఎందుకు నిర్మించారో తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఈ నగరం బయటపడిందని చెబుతున్నారు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

అయితే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. ఆ నక్షత్రాల్లో ఎక్కువ ప్రకాశవంతమైనవి అలాగే పెద్ద నగరాలను సూచిస్తుండటం విశేషం.అయితే ఆ నక్షత్రాలు ఓ నగరాన్ని చూపించటం లేదని పసిగట్టాడు. ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్నాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

ఇంకా 23వ నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు ఉండగా, ఇప్పటి వరకు అందులో రెండు స్థానాల్లో ఉన్న నగరాలను మాత్రమే శాస్త్రవేత్తలు గుర్తించారు. మరిమూడో నగరం ఏమైంది అన్న ఆలోచనే ఈ నగరం బయటపడటానికి దారులు ఏర్పరచింది. మూడో నగరాన్ని గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌, ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి ఎక్కడ ఉందో గుర్తించాడు విలియం.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

అందులో భాగంగా రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాల ద్వారా అడవుల్లో దాగి ఉన్న ఆ అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అని గాని కొత్త పేరు పెట్టాలని కూడా ఈ కుర్రాడు భావిస్తున్నాడు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, ప్రపంచం ఈ నగరం ద్వారా కొత్త ఆవిష్కరణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి అక్కడి ప్రదేశాల్లోని ఓ ప్రదేశంలోని నిర్మాణాలను చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా చూపిస్తోందని రీసెర్చ్ అధికారులు చెప్తున్నారు. అయితే విలియమ్స్ కనుగొన్న ఈ పద్ధతిలో మయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే దారులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. 

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

కొత్త నగరాన్నిఅలాగే తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. 

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

మాయన్‌ నాగరికతకు ప్రపంచంలో అతి పురాతన గొప్ప నాగరికతల్లో ఒకటిగా పేరుంది. అలాంటి మయన్ కల్చర్ రహస్యాలు మన ఊహలకంటే సంక్లిష్టంగా ఉన్నాయని పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాయ ప్రజలు నిర్మించిన నగరాల్లో ఇదే భారీ నగరమని పరిశోధకులు భావిస్తున్నారు. క్రీ.శ 300 నుంచి 700 మధ్య కాలంలో ఈ నగరం విలసిల్లి ఉండొచ్చని అంచనా.

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

ఈ కుర్రాడు కనుగొన్న ప్రాంతంలో 30 భవంతులతో పాటు, ఓ పిరమిడ్‌ ఉంది. మాములుగా దేవాలయాల నిర్మాణం, భాషకు ఒక రాత, గణిత, ఖగోళ శాస్త్రాల ఆవిష్కరణ వంటి అనేక అంశాల పరంగా మయన్‌ నాగరికతకు మంచి పేరుంది. కాని దీని పుట్టుకకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా రహస్యాల చిక్కుముడి వీడనే లేదు. 

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

వేల ఏళ్ల కాలం నుంచి మయన్‌ పై ఇప్పటికి రెండు సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రస్తుత గ్వాటెమాలా , దక్షిణ మెక్సికోలో ఒకప్పటి అడవుల్లో ఇది పుట్టిందని కొందరు అంటుండగా, పురాతన ఆల్మెక్‌ నాగరికత, దాని కేంద్రమైన లావెంటా ప్రభావం వల్ల అభివృద్ధి చెందిందని మరికొందరు అంటున్నారు.

అడవుల్లో కనుమరుగైన రహస్యం : 15 ఏళ్ల బాలుడుకి చిక్కింది

అడవుల్లో కనుమరుగైన రహస్యం : 15 ఏళ్ల బాలుడుకి చిక్కింది

ఏది ఏమైనా ఓ అద్భుత నగరాన్ని బయటి ప్రపంచానికి అందించిన ఈ కుర్రాడిని నిజంగా అభినందించాల్సిందే 

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

15 ఏళ్ల బాలుడు అడవుల్లో అంతుచిక్కని నగరాన్నికనిపెట్టాడు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write it was written in the stars! 15-year-old claims to have discovered a forgotten Mayan City hidden in the Mexican jungle by studying constellations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X