శాస్త్రవేత్తలకు చుక్కలు చూపిస్తున్న రహస్యాలు..

Written By:

ఈ ప్లానెట్ ఎన్నో రహస్యాలకు వేదిక. ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు వీటిమీద అనేక రకాలైన ప్రయోగాలు చేస్తున్నారు. వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొన్ని రహస్యాలను అలాగే మిస్టరీలను కనుగొన్నారు. కాని ఇంకా ఎన్నో మిస్టరీలు అలాగే ఉన్నాయి. వాటిని చేధించడానికి అనేక రకాలైన పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని మిస్టరీలను మీకందిస్తున్నాం చూడండి.

Read more : దశాబ్దాల ఆ గీతల మిస్టరీ వీడినట్లేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sacsayhuamán

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

సుమారు వెయ్యేళ్ల క్రితం, ఇన్కా సామ్రాజ్యపు రాజధాని ‘కూకో'లోని సైనిక స్థావరం ఇది. 400 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల ఎత్తుగల ఈ గోడల కోసం వాళ్లు పెద్ద పెద్ద బండరాళ్లను వినియోగించారు. పెద్దది 120 టన్నులుండగలదు. వీటిని మూడు కిలోమీటర్ల అవతలి క్వారీలోంచి ఇక్కడికి ఎలా చేర్చారనేది ఇప్పటికీ ఆశ్చర్యమే! పైగా, ఈ రాళ్ల మధ్య పొందిక ఎంత చక్కగా ఉంటుందంటే, వాటిలోకి ఒక కాగితాన్ని కూడా దూర్చలేనంతగా! అందుకే ఎన్ని భూకంపాలు వచ్చినా ఇది తట్టుకుని నిలబడింది. దీని మీదకు దండెత్తిన స్పెయిన్ వాళ్లు అబ్బురపడి, కోపపు మెచ్చుకోలుతో, ఇలాంటివి దయ్యాలు మాత్రమే నిర్మించగలవు, అన్నారు.

The Gate of The Sun

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

తివానకులో ఉన్న పురాతన కట్టడం ఇది. బోలివియా నగరంలో ఉన్న అత్యంత పురాతనమైన కట్టడాల్లో ఇది ఒకటి. అయితే ఈ కట్టడంపై ఉన్న గీతల ఏంటనేవి పరిశోధకు మొదడును ఇప్పటికీ తినేస్తూనే ఉన్నాయి.

The Longyou Caves

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

ప్రపంచంలోనే అత్యంత మిస్టరీగా మారిన ప్రదేశాల్లో ఈ గుహలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 2వేల ఏళ్ల క్రితం నాటివని నమ్ముతారు. తవ్వకాల ద్వారామ బయటపడిన ఈ నిర్మాణాలను చూసిన సైంటిస్టులు సైతం నోరెళ్లబెట్టారు. ఎలా సాధ్యమైందనే విషయం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు.

The underwater city of Yonaguni – Japan

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

జపాన్ లో సముద్రం అడుగుభాగాన్న ఉన్న నగరం ఇది. గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి కనుగొన్న అత్యంత పురాతన నగరాల్లో ఈ నగరం చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది అనేక సందేహాలను లేవనెత్తుతోంది. 10 వేల సంవత్సరాల క్రితం వీటిని నిర్మించారని అయితే అప్పుడు ఇంత పెద్ద పిరమిడ్లను నీటి లోపలకు ఎలా తీసుకెళ్లి నిర్మించారని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు సైంటిస్టులు.

Mohenjo-Daro

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

గ్రేట్ మిస్టరీల్లో ఇది ఒకటి. ఈ నగరం ఎలా అదృశ్యమైందనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. కొంతమంది సిధ్ధాంత కర్తలు ఈ నగరాన్ని దేవుడు అత్యాధునిక న్యూక్లియర్ ఆయుధాలతో నాశనం చేశాడని చెబుతారు. మరి ఏది నిజమనేది మాత్రం మిస్టరీనే.

The underground city of Derinkuyu

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

ఆర్కియాలజిస్టలకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు సవాల్ విసురుతున్న మరొక మిస్టరీ ఇది. ఇది అండర్ గ్రౌండ్ లో ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారనేది ఎవ్వరూ తేల్చుకోలేకపోతున్నారు.

Giant Stone Spheres

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

బోస్నియా అండ్ హెర్జ్గోవినియా దగ్గర గల కోస్టారికాలో ఉన్న అత్యంత పెద్ద రాళ్లు ఇవి. వీటిని గ్రహాల అచూకి తెలసుకోవడానికి వినియోగించారని చెబుతారు. కాని అవి నిజమా కాదా అనేది మాత్రం మిస్టరీనే.

14 million-year-old vehicle tracks

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

14 మిలియన్ల సంవత్సరాల క్రితం నిర్మించిన ట్రాక్ లు ఇవి. మరి అప్పట్లో ఏం వాహనాలు తిరిగాయి. ఇలా ఈ నాగరికత ఎవరిది అనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ ట్రాక్ లను చూసిన సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఆ కాలంలో వాడిన టెక్నాలజీని చూసి షాక్ అవుతున్నారు.

2 billion-year-old Nuclear Reactor

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

2 బిలియన్ల సంవత్సరాల క్రితం న్యూక్లియర్ రియాక్టర్ ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. అప్పట్లో ఇది ఎలా సాధ్యమయిందనే దానిపై కిందామీదా పడుతున్నారు.

The Bosnian Pyramids

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

ఈ పిరమిడ్ మీద సూర్యుడు తన గీతలను ఇలా నిలువుగా కురిపిస్తాడు. ఇది 220 మీటర్ల వరకు ఇలా ఉంటుంది. అయితే ఈ పిరమిడ్ కొలతలు చూసిన సైంటిస్టులకు నిజంగానే దిమ్మతిరిగింది. 0 డిగ్రీలో ఇది వారికి కనిపించింది.

Nazca Lines

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

పెరూ ఎడారిలో నాజ్కా లైన్స్ కనిపించాయి. ఇవి వివిధ రకాలైన జంతువుల ఆకారాల్లో అక్కడ కనిపించాయి. అసలు అలా ఎందుకు చేశారనేది అంతుపట్టని మిస్టరీనే.

Star Child Skull

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

ఈ పుర్రెను మెక్సికో దేశంలో కనుగొన్నారు. అసలు ఇది మనుషులదా లేక మరేదైనా లోకంలోనిదా అనేదానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

Great Pyramid of Giza

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

పిరమిడ్లు ఉత్తి సమాధులు మాత్రమే కాదు; ఆ కాలపు జ్ఞానాన్ని, మావన వనరుల శ్రమను కుప్పపోసిన నిర్మాణాలు. 146.5 మీటర్ల ఎత్తుతో గిజా పిరమిడ్ వేల సంవత్సరాలపాటు అత్యంత పొడవైన నిర్మాణంగా భాసిల్లింది. క్రీ.పూ.2504లో పూర్తయిన ఈ నిర్మాణంలో 23 లక్షల రాతి పలకలు వినియోగించారు. పెద్దవి ఒక్కోటి 25-80 టన్నుల బరువుంటాయి. వాటిని 800 కిలోమీటర్ల దూరంలోంచి తెచ్చారు. 55 లక్షల టన్నుల సున్నపురాయి, 8000 టన్నుల గ్రానైట్, 5 లక్షల టన్నుల మోర్టార్ ఖర్చయ్యింది. ఇప్పటికీ నిపుణులకు అర్థం కానిది ఏమంటే, అంత బరువైన రాళ్లను అంత ఎత్తుకు ఎలా తరలించారన్నదే!

Aqueduct of Segovia

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

నీటి సరఫరా చేసే మార్గంలో లోతట్టు ప్రాంతాలు, లోయలు ఎదురైనప్పుడు ప్రవాహాన్ని సమరీతిగా ఉంచేందుకు ఈ ఆక్వెడక్ట్ (జలవాహమార్గం) అవసరమైంది. క్రీ.శ. 50లో దీని నిర్మాణం పూర్తయింది. 44 డబుల్ అర్చీలతో కలుపుకొని మొత్తం 167 అర్చీలున్నాయి. ఒక్కో అర్చీ 9 మీటర్ల ఎత్తుంటుంది. పొడవు 270 మీటర్లు. రోమన్ సామ్రాజ్యాధిపతి ట్రాజన్ కాలంలో 18 కిలోమీటర్ల దూరంలోని ఫ్రయో నది నుంచి సెగోవియా పట్టణానికి నీటిని తరలించడానికి దీన్ని నిర్మించారు. 24000 గ్రానైట్ బ్లాకులు వాడిన ఈ నిర్మాణంలో మోర్టార్ (ఇప్పటి సిమెంటు లాంటిది) వినియోగించకపోవడం విచిత్రం!

Chand Baori

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

పదవ శతాబ్దపు ఈ నిర్మాణం ఎడారి ప్రజల దాహార్తికి సంకేతం. నీటి కటకటకు జవాబుగా తవ్విన ఈ బావి వంద అడుగుల లోతుంటుంది. ఎవరైనా నీటిని తెచ్చుకునేందుకు వీలుగా 13 అంతస్తుల్లో 3500 మెట్లు నిర్మించారు. నడకను సులువు చేసేందుకు నేరుగా దిగువకు కాకుండా, పక్కకు నడిచేలా ఈ మెట్లు ఏర్పాటుచేయడం అప్పటి ఆలోచనాపరుల ప్రజ్ఞ. ఇంత సంక్లిష్ట నిర్మాణం ఆ కాలంలో ఎలా సాధ్యపడిందని ఇప్పటికీ అబ్బురమే. అందుకే దయ్యాలు ఒక్క రాత్రిలో కట్టేసి వెళ్లాయని స్థానికులు చెప్పుకునే గాథ!

Tajmahal

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

నిండుదనం, ఒక సంపూర్ణాకృతిని చూసిన అనుభూతి తాజ్‌మహల్ ఇస్తుందంటారు. ఇరవై ఏళ్లపాటు నిర్మాణం కొనసాగి 1653లో ముగిసింది. ఈ షాజహాన్ ప్రేమచిహ్నంలో 28 రకాల విలువైన రాళ్లు వినియోగించారు. వాటిని రాజస్థాన్‌లోని క్వారీల్లోంచి తెచ్చారు. పొద్దున గులాబీరంగులో, పగలు తెల్లగా, రాత్రి బంగారు కాంతిలో కనబడటం వీటి ప్రత్యేకత!

Akashi Kaikyō Bridge

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

రష్యా రాజధాని నగరం మాస్కో నుంచి ఆ దేశపు చిట్టచివరి అంచుల్ని కూడా కలిపే రైల్వే నెట్‌వర్క్ ఇది. చివరి కేంద్రమైన వ్లాడివోస్టాక్ 9289 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే పొడవైన రైల్వే లైనుగా వినుతికెక్కింది. 87 పట్టణాలు, నగరాలు; 6 టైమ్ జోన్లు; ఓల్గా, ఓబ్, ఓకా, కామా లాంటి 16 నదులు దాటుతూ ఈ నిర్మాణం సాగింది. 1904 పూర్తయిన ఈ రైల్వేలైనుకి చైనా, మంగోలియా, ఉత్తర కొరియాల్లోకి కనెక్టింగ్ ట్రాకులు ఉన్నాయి. సైబీరియాలాంటి ప్రాంతాల్లో మైనస్ 20 డిగ్రీల చలిని తట్టుకోగలిగే దృఢత్వం ఈ నిర్మాణపు గొప్పతనం!

grand canyon sky walk

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

భీతిగొలిపే లోతైన లోయ మీద నడిచే జలదరింపు అనుభవాన్ని ఇవ్వడానికన్నట్టుగా ఈ కేన్యన్ స్కైవాక్ నిర్మించారు. కొలరాడో నదికి 1219 మీటర్ల ఎత్తున ఉండే దీనిలో 450 మెట్రిక్ టన్నుల ఉక్కు, 37 మెట్రిక్ టన్నుల గాజు వినియోగించారు. 2007లో పూర్తయింది. పూర్తి భర్తీ అయిన 71 విమానాల్ని మోసేంత గట్టిగా ఉంటుంది.

Teotihuacan

సైంటిస్టుల ఊహలకే అందని మిస్టరీలు

క్రీ.పూ.100 కాలంలో నిర్మాణం ప్రారంభమైన ఈ నగర ఉచ్ఛదశలో రెండు లక్షల మంది నివాసం ఉండేవారు. ఉత్తర దక్షిణ అక్షాలను కలిపే రేఖకు ఈ నగరాన్ని అనుసంధానిస్తూ, సరిగ్గా ఆగస్టు 12న దానిమీద సూర్యుడు అస్తమించేట్టు చేశారు. వారు వాడిన మెసోఅమెరికన్ క్యాలెండర్ ప్రారంభమయ్యేది ఇదే తేదీన. అలాగే, ఈ నగరంలోని 71.2 మీటర్ల ఎత్తుగల ‘పిరమిడ్ ఆఫ్ ద సన్' నిర్మాణానికి నునుపైన మీకా పలకలు అట్టడుగున వినియోగించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పలకల్ని వాళ్లు 3000 కిలోమీటర్ల దూరానున్న బ్రెజిల్ నుంచి తెప్పించడం!

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 unexplainable ancient discoveries that science cant explain
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot