ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

By Hazarath
|

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ అన్ని పరీక్షల అనంతరం భారత ఆర్మీ చెంతకు చేరనుంది. దాదాపు రూ. 4,300 కోట్ల వ్యయంతో తయారు చేసిన బ్రహ్మోస్ రెజిమెంట్ ను చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రధాని తెలిపారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం క్లిష్టంగా ఉన్న నేపధ్యంలో ఈ మిసైల్ ను అక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థను పొందుపరిచిన బ్రహ్మోస్ క్షిపణులు, పర్వతాలు అడ్డొచ్చిన వేళ, వాటంతట అవే పైకీ, కిందకూ ప్రయాణిస్తూ వెళ్లి లక్ష్యాన్ని ఛేధించగలవు. 75 డిగ్రీల వరకూ వంపు తిరిగి దూసుకు వెళ్లగలవు. దీన్ని 90 డిగ్రీలకు పెంచేందుకు సైంటిస్టులు కసరత్తు చేస్తున్నారు. మరి బ్రహ్మోస్ పవర్ ఎలా ఉంటుందో తనకిచ్చిన లక్ష్యాలను ఎలా చేధించగలదో మీరే చూడండి.

శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. దీన్ని విమానం, నౌక, సబ్‌మెరైన్ లేదా ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. ఇది బహుళ లక్ష్యాలపై కేవలం మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగలదు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ ప్రతిక్షిపణీ (Anti missile) ఎదుర్కోలేదు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

రష్యా సహకారంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో తయారుచేసిన బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు, వేగం 2.8 మ్యాక్. భారత్, రష్యా దేశాల్లోని బహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్ల నుంచి 'బ్రహ్మోస్' అనే పేరును రూపొందించారు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ఇవి ఎన్నో రెట్లు మేలైనవి. ఉపరితల, సముద్ర రకం బ్రహ్మోస్ క్షిపణులు ఇప్పటికే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి. జలాంతర్గామి, వైమానిక క్షిపణి రకాలు శోధన స్థితిలో ఉన్నాయి.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

సుమారు 7 మ్యాక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ మార్క్-2 రకం హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. కలాం జ్ఞాపకార్థం ఈ క్షిపణిని బ్రహ్మోస్-2కె ('కె' అంటే కలాం) అని పిలవనున్నారు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్(ఎంఏల్ వాహనం)లో మూడు బ్రహ్మోస్ క్షిపణులు, సమాచార, రాడార్ వ్యవస్థలు అమర్చి ఉంటాయి. 

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం భారతీయ శాస్త్రవేత్తల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. అప్పటివరకు భారత్ కేవలం దీర్ఘవ్యాప్తి, స్ట్రాటజిక్, రక్షణ, టాక్టికల్, బాలిస్టిక్ క్షిపణులపైనే దృష్టిపెట్టింది. కానీ టొమహాక్ క్రూయిజ్ క్షిపణుల సాయంతో అమెరికా ఇరాక్‌ను ఓడించడంతో భారత్ కూడా క్రూయిజ్ క్షిపణులను తయారు చేయాలని నిర్ణయించింది.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

అబ్దుల్ కలాం నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ పనిని అప్పగించింది. 1995లో ఐజీఎండీపీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త శివథాను పిళ్లై ఆధ్వర్యంలో భారత్-రష్యా సంయుక్తంగా భవిష్యత్ క్షిపణి బ్రహ్మోస్ రూపకల్పన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. శివథాను పిళ్లైని 'బ్రహ్మోస్ పితామహుడిగా' పిలుస్తారు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ బ్లాక్-3 రకాన్ని 2015 మే 9న కార్ నికోబార్ ద్వీపంలో విజయవంతంగా 48వ సారి ప్రయోగించారు.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఈ రెండు స్టేజీల బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్షిపణి 2005 నుంచి భారత నావికా దళంలో సేవందిస్తుంది.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

బహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. 290 కి.మీ. దూరంలోని లక్షాన్ని ఛేదించగల శక్తి దీని సొంతం.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఇక గతేడాది 7,500 టన్నుల ఐఎన్‌ఎస్ కోచిని సెప్టెంబర్ 30న భారతీయ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఆ యుద్ధ నౌక 16 బ్రహ్మోస్ క్షిపణులను మోసుకు పోగలదు. నిట్టనిలువు స్థితిలో లాంచింగ్ చేస్తుంది.

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

భారత వైమానిక బలగాల్లో సుఖోయ్-30ఎంకెలలో మోహరించేందుకు బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

న్యూక్లియర్ క్షిపణిగా అభివృద్ధి చెందిన బ్రహ్మోస్ క్షిపణులు 290 కిలోమీటర్ల వరకూ ప్రయాణించి శత్రువుల భరతం పడతాయి. సాధారణ సబ్ - సోనిక్ మిసైళ్లతో పోలిస్తే, 9 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాయి

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో దాదాపు 4,507 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉండగా, దీని వెంట చైనా భారీగా ఆయుధాలను మోహరిస్తోంది.చైనా సైనికులు పలుమార్లు చొరబాట్లకు పాల్పడ్డారు కూడా. వారికి బుద్ధి చెప్పడానికి ఆ సరిహద్దులకు బ్రహ్మోస్ రెజిమెంట్ ను పంపనుంది.

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

సుఖోయ్ - 30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ఈ క్షిపణులను ప్రయోగించి, వాటి పనితీరును పరీక్షించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెలలోనే సుఖోయ్ లకు ల్యాండ్, సీ వేరియంట్ బ్రహ్మోస్ లను అమర్చి ప్రయోగాలు చేయనున్నామని బ్రహ్మోస్ ప్రాజెక్టు చీఫ్ సుధీర్ మిశ్రా వెల్లడించారు.

Best Mobiles in India

English summary
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ అన్ని పరీక్షల అనంతరం భారత ఆర్మీ చెంతకు చేరనుంది. దాదాపు రూ. 4,300 కోట్ల వ్యయంతో తయారు చేసిన బ్రహ్మోస్ రెజిమెంట్ ను చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రధాని తెలిపారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం క్లిష్టంగా ఉన్న నేపధ్యంలో ఈ మిసైల్ ను అక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X