చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన ఇండియా..ఇక చుక్కలే

Written By:

ఈ మధ్య దూకుడుతో భారత్‌కు సవాల్ విసురుతున్న డ్రాగన్ కంట్రీకి ఇండియా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మా దేశ వ్యవహారాల్లో తలదూర్చితే నీకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ సరిహద్దు వ్యవహారం తమ ఇష్టమని, తమ భూభాగంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఎలాంటి పనైనా చేసుకుంటామని, అది వేరే దేశాలకు సంబంధించినది కానందున ప్రతి అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో చైనా ఇండియాల మధ్య వాతావరణం వేడెక్కింది. పూర్తి సమాచారం స్లైడర్ లో..

ఆర్మీ చేతికి బ్రహ్మోస్..తొలి వేటు చైనా సరిహద్దులోనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

చైనా దూకుడుకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. అరుణా‌చల్ ప్రదేశ్‌లో బ్రహ్మోస్ క్షిపణుల మోహరింపుపై చైనా హెచ్చరికలను భారత్ కొట్టిపారేసింది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

తమ దేశ వ్యవహారంలో తలదూర్చొద్దంటూ చైనాకు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసినట్టు తెలిసింది. తమ నిర్ణయాలను బీజింగ్ ప్రభావితం చేయలేదంటూ తెగేసి చెప్పింది 'మా భూభాగానికి సంబంధించిన భద్రత, ఆందోళనలు పూర్తిగా మా స్వవిషయాలంటూ కితాబిచ్చింది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

దీంతో పాటు వాటిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా మాకు సంబంధించిన వ్యవహారమే. వేరే దేశాలకు ఇందులో ఏ మాత్రం ప్రమేయం లేదు. ప్రతి అంశాన్ని చెప్పాల్సి పని కూడా లేదు' అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

అయితే ఇండియా ఇప్పుడు అరుణాచల్‌లో ఉన్న భారత సరిహద్దు ప్రాంతంలో భారత్ బ్రహ్మాస్ సూపర్‌సోనిక్ క్షిపణులను విస్తరిస్తోంది. వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఆత్మరక్షణ కోసం అవసరానికి మించిన క్షిపణులను మోహరించడం వల్ల చైనాలోని టిబెట్, యునాన్ ప్రావిన్స్‌లకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటూ చైనా సోమవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని భాగాలు తమకు చెందినవంటూ చైనా మరోసారి క్లెయిమ్ చేసింది. దీంతో, బ్రహ్మోస్ తరలింపుపై చైనా వాదనను భారత్ చీపురుపుల్ల తీసిపడేసినట్లు తీసిపడేసింది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

తాము చైనా ప్రభావానికి లోనై ఈ పనిచేయడం లేదని, తమ భూభాగాన్ని రక్షించేందుకు మిసైల్ వ్యవస్థను ఇప్పటికే చాలా చోట్ల భారత్ మోహరించిందని, అరుచాల్ ప్రదేశ్‌లో మోహరించడం కూడా అలాంటిదేనని ఆర్మీ ఉన్నతాధికారులు చైనాకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

అరివీర భయంకర మిసైల్‌గా చెప్పుకునే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను సబ్‌మెరైన్లు, ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్స్ నుంచే కాకుండా నేలపై నుంచి కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

300 కేజీల బరువైన వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే ఈ క్షిపణులు భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలుగుతాయి.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఈక్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మొస్‌క్వా నదులపేరిట దీనికి నామకరణం చేశారు.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఇది ధ్వని కన్నా 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళుతుంది. సంప్రదాయ వార్‌హెడ్లను 300 కిలోల వరకూ మోసుకెళ్లగలుగుతుంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఈ అస్త్రంలో రెండంచెలు ఉంటాయి. ఘన ఇంధనంతో పనిచేసే బూస్టర్‌, ద్రవ ఇంధనంతో పనిచేసే రామ్‌-జెట్‌ వ్యవస్థ ఉంటాయి.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, నేల మీద సంచార ప్రయోగ వేదికల వంటి విభిన్న చోట్ల నుంచి ఈ అస్త్రాన్ని ప్రయోగించే వీలుంది.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

అవసరాన్ని బట్టి ఎగువ, దిగువ ఎత్తుల్లో ప్రయాణిస్తూ శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థను ఏమారుస్తుంది. లక్ష్యం వరకూ స్వయంగా దిశానిర్దేశం చేసుకుంటుంది. ప్రయోగానంతరం ఎలాంటి మార్గదర్శనం అవసరంలేదు.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఈ అస్త్రాన్ని ఇప్పటికే భారత త్రివిధ దళాల్లో ప్రవేశపెట్టారు. సైన్యంలో ఇప్పటికే మూడు బ్రహ్మోస్‌ రెజిమెంట్లు ఉన్నాయి.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

కొత్తగా ఏర్పాటయ్యే రెజిమెంట్‌లో దాదాపు 100 క్షిపణులు, భారీ ట్రక్కులపై ఏర్పాటు చేసిన ఐదు సంచార ప్రయోగ వేదికలు, ఒక సంచార కమాండ్‌ పోస్ట్‌ ఉంటాయి.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఈ రెజిమెంట్‌లో అద్భుత విన్యాస సత్తా ఉన్న అధునాతన శ్రేణి బ్రహ్మోస్‌ క్షిపణి ఉంటుంది. పర్వత వాలు వెంబడి నిట్టనిలువుగా దిగగల సామర్థ్యం దీని సొంతం.

చైనాకు దిమ్మతిరిగే వార్నింగ్

ఇప్పుడు ఈ మిసైల్ ను అరుణాచల్ సరిహద్దులో మొహరించి చైనాకు చుక్కులు చూపేందుకు ఇండియా రెడి అయింది. బిత్తర పోతున్న చైనా దీన్ని ఆపాలని చెబుతోంది. ఈ  నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల వేడి రాజుకుంది. ముందు ముందు ఇది ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

ఇండియా ఆయుధాలపై స్పెషల్ స్టోరీలు

శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

పాకిస్తాన్‌కు వణుకు పుట్టించే వార్త

బ్రహ్మోస్‌‌తో శత్రు దేశాలకు ఇక చుక్కలే

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write China warns of counter measures after India deploys BrahMos missile in Arunachal Pradesh
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot