వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం : పెనుముప్పంటూ శాస్త్రవేత్తల ఆందోళన

Written By:

పాత రాతి యుగం, కొత్త రాతి యుగం.. ఇలాంటి దశల నుంచి క్రమంగా మనం ప్లాస్టిక్ యుగం వైపు వెళ్లిపోతున్నామట. దీని గురించి పరిశోధకులు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ అంత తొందరగా నశించకపోవడం, భూమిలో కలవకపోవడం వల్ల భూగ్రహంపై తీవ్ర ప్రభావం, అది కూడా దీర్ఘ కాలం పాటు చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్వత శిఖరాల నుంచి సముద్ర అంతర్భాగాల వరకు ఎక్కడ చూసినా ప్లాస్లిక్ కనపడుతోందని, భవిష్యత్తుకు ఇది చాలా ముప్పుగా పరిణమిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజీ శాఖలోని పాలియోబయాలజీ ప్రొఫెసర్ జాన్ జలాసియావిజ్ హెచ్చరించారు. ప్రతి మూడేళ్లకు వంద కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారుచేస్తున్నామని ఈ మొత్తం భూమ్మీద అనేక పొరలుగా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్లాస్టిక్ వల్ల మానావాళికి సంక్రమించే ప్రమాదాలు ఏంటో మీరే చూడండి.

Readmore: 6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా : షాక్ పుట్టిస్తున్న అస్థి పంజరాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

సృష్టిలోని ప్రతిపదార్థం జనించి కొంతకాలానికి అవసానం చెందుతుందనేది విజ్ఞానశాస్త్రాలు చెబుతోన్న విషయం. అయితే ప్లాస్టిక్‌కు మాత్రం ఇది అంత తొందరగా వర్తించదు. కొన్ని వందల సంవత్సరాలు గడిస్తేకానీ.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. ఇది అక్షరాల నిజం.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతి 30 సెంటిమీటర్లకు ఏడాదికి ఐదు గోనేసంచుల వ్యర్ధాలు నీళ్లల్లో కలుస్తున్నాయట. 2010 సంవత్సరం నాటి లెక్కలు చూస్తే..192 దేశాల తీరప్రాంతాలలో 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ చెత్త సముద్రంలోకి చేరిందట. ఇప్పుడు ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఊహకే అందనిది.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఇలాంటి ప్లాస్టిక్ ను సముద్రం నుంచి తీసే క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆయిల్‌ను 400 డిగ్రీల వద్ద మరిగించి. నాఫ్తానుగా రూపొందిస్తారు. దీనిని 800డిగ్రీల వరకు వేడిచేసి వచ్చిన పదార్థాన్ని 200 డిగ్రీల వరకు చల్లారుస్తారు. అప్పుడు ప్లాస్టిక్ అణువులు ఏర్పడాయి.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

వీటిలో పాలిమర్లు, మోనోమర్ల యూనిట్లు ఉంటాయి. వీటికి ఎథిలీన్ కలిపితే పాలిథిన్ రూపొందుతుంది. ఒక కణం, మరొక కణంతో పెనవేసుకుని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో కలిపే పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎజోడైలు కలిపేకొద్దీ రకరకాల వస్తువులుగా రూపుదాలుస్తాయి.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఇలా తయారైన ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. వాటిని కాల్చినా విషవాయువులు, భూమిపైనే ఉంటాయి. మానవాళికి పెను ప్రమాదాన్ని కలుగజేస్తాయి.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఇక ఈ ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనం వల్ల గర్భస్థ దశలో మగశిశువులపై పెరుగుదల, వికాసాలు దెబ్బతింటున్నాయని, అమెరికా శాస్త్ర వేత్తలు బాగా హెచ్చరిస్తున్నారు.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంకా ఎంత ప్రమాదమంటే వర్షపు జలాలు భూగర్బానికి చేరకుండా అడ్డుకుంటాయి. ప్లాస్టిక్ బ్యాగులు, కప్స్, గ్లాసుల్లో వేడి ఆహర పదార్థాలను తీసుకోవడం ద్వారా మనం క్యేన్సరుకు ఆహ్వానం పలికినట్లే అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిని తగలబెట్టడం వల్ల డైయోక్సిన్ వాయువు గాలిలోకి వెళ్లి క్యేన్సర్ వ్యాధికి దారితీస్తుంది.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

సముద్రాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా దూరం పాటు ప్రయాణిస్తాయని, మధ్యలో ఏమాత్రం పాడవ్వవని, చివరకు ఏదో ఒక బీచ్‌లో అవి తేలుతాయని వివరించారు. వీటివల్ల జలచరాలకు కూడా తీవ్ర స్థాయిలో ముప్పు ఉంటుందన్నారు.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

చెరువులు నదులలో ఈ వ్యర్థాలను వేయడం వలన వీటిని తినే చేపలు వేల సంఖ్యలో మృత్యు వాత పడుతున్నాయి. నీటి పక్షులు, తాబేళ్లు వంటివి ప్రమాదకర సంఖ్యలో నశించిపోతున్నాయని, దీంతో సమతుల్యం దెబ్బతింటోందని గ్రీన్ పీస్ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఇక ఈ ప్లాస్టిక్ కాలుష్యం ఓజోన్ రంధ్రం మరియు గ్లోబల్ వార్మింగ్ కంటే పెద్ద ప్రమాదంమని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆక్సిజన్ ని హరించి వేస్తుందని రానున్న కాలంలో ఆక్సిజన్ అందకుండా ఉండే ప్రమాదముందని వారంటున్నారు.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

ఇక ఏడాదికి 2.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను సముద్రంపాలు చేస్తు చైనా అగ్రస్థానంలో వుంది. ప్రపంచ స్థాయి కాలుష్యంలో 30 శాతం చైనా నుంచే వస్తుందన్న మాట. తరువాతి స్థానాల్లో వరుసగా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, శ్రీలంక, థాయిలాండ్, ఈజిప్టు, మలేషియా దేశాలు వచ్చాయి.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

మన దేశంలో 2020 నాటికి ఇ-వ్యర్థాల సంఖ్య 5.2 మిలియన్ల మెట్రిక్‌ టన్నులకు చేరొచ్చని అంచనా. ప్రస్తుతానికి 1.8 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఇ-వ్యర్థాల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందట.

వచ్చేది భయంకర ప్లాస్టిక్ యుగం

వ్యర్థాల పెరుగుదలలో 30 శాతం వద్ధి ఉందని ఇది భారత్‌కు ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటిలో మొబైల్‌ వ్యర్థాల సంఖ్యే అధికంగా ఉంటోంది. పాత వాటిని డస్ట్ పిన్ లో పడేయడం వల్ల ఈ విపరీతమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వారంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Earth has entered into an 'age of plastic': Scientists
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot