స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

Written By:

టెక్నాలజీ ఓ చోట ఆగదు..ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది .. మొన్న టెలిఫోన్లు, నిన్న సెల్ ఫోన్లు , ఇప్పుడు వైర్‌లెస్ ఛార్జర్లు..అవును ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి. ఛార్జింగ్ అంతా ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీ మీద నడుస్తోంది. అవును కొత్తగా వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ తో మీ ఫోన్లను ప్రయాణంలో ఎక్కడికెళ్లినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

Read more : స్నాప్‌డీల్,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్‌లకు షాకివ్వడానికి మరో చైనా కంపెనీ రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

సెల్ ఫోన్ల‌లో ఛార్జింగ్ ఎక్కించ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం వైర్ ఉన్న ఛార్జర్ నే ఉప‌యోగిస్తున్నాం. అయితే త్వ‌ర‌లోనే వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాల‌జీ అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

ఎనర్జీస్క్వేర్ పేరుతో ఈ ఛార్జ‌ర్ త్వ‌ర‌లో వినియోగ‌దారుల చెంత‌కు రానుంది. దీనితో స్మార్ట్ ఫోన్‌ల‌నే కాదు ట్యాబ్‌ల‌ను సైతం ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఎక్క‌డి కెళ్లిన ఈ వైర్‌లెస్ ఛార్జ‌ర్‌ని సులువుగా తీసుకెళ్లొచ్చు.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

ఈ వైర్‌లెస్ చార్జింగ్ మ్యాట్‌తో ఓ స్టిక్క‌ర్ ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ స్టిక్క‌ర్‌ స్మార్ట్ ఫోన్‌ను అంటుకునేలా ఉంటుంది. ఛార్జింగ్ సాకెట్‌లో ఈ స్టిక్క‌ర్ ను ఉంచి, స్మార్ట్ ఫోన్‌ను మ్యాట్‌పై పెట్టాలి. అంతే మ‌న మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

ఇందులో ఇప్పటివరకు చార్జింగ్ కోసం వాడుతున్న ఇండక్షన్, ఎలక్ట్రో మేగ్నటిక్ టెక్నాలజీని కాకుండా కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే చార్జింగ్ ప్యాడ్ సహాయంతో నాలుగైదు ఫోన్లను సైతం ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

గత ఐదేళ్లలో తయారుచేసిన ఏ స్మార్ట్‌ఫోన్ అయినా ఈ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. స్టిక్కర్లలో ఉండే రెండు కండక్టీవ్ డాట్స్ సహాయంతో నేరుగా మొబైల్ బ్యాటరీకి లింక్ అయ్యేలా దీనిని రూపొందించారు.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉప‌యోగించి ఈ ఛార్జింగ్ మ్యాట్ ను రూపొందిస్తున్నారు. చార్జింగ్ మ్యాట్‌తో పాటు నాలుగు స్టిక్కర్‌లను కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ఎనర్జీస్క్వేర్ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

వ‌చ్చేనెల‌లో మార్కెట్లోకి రానున్న ఈ ఛార్జింగ్ మ్యాట్ దానిలోని కండ‌క్టివ్ డాట్స్ మొబైల్ బ్యాట‌రీకి లింక్ అయ్యేలా ఉంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్లలో ఛార్జింగ్ ఎక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే రోజులు పోయాయి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Energysquare is a wireless phone charging pad that doesn’t use induction
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot