స్నాప్‌డీల్,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్‌లకు షాకివ్వడానికి మరో చైనా కంపెనీ రెడీ

By Hazarath
|

స్నాప్‌డీల్,ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లకు షాకివ్వడానికి మరో చైనా కంపెనీ రెడీ అయింది. చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో భారత ఈ-కామర్స్ లోకి దూసుకువస్తోంది. తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'లీమాల్' ను భారత్ లో ఆవిష్కరించబోతోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8న అధికారిక మెగా ఈవెంట్ ను సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో భారత ఈ-కామర్స్ లోకి తమ ప్లాట్ ఫామ్ లాంచ్ చేస్తున్నట్లు 'లీఇకో' ప్రతినిధులు వెల్లడించారు కూడా. 2013లో మొదటిసారి చైనాలో ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు.

Read more: ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. లీఇకో కు చెందిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, స్పీకర్లు లాంటివి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తర్వాతి తరం 'సూపర్ ఫోన్లు' రెండింటిని 'టూ ఫ్యూచర్స్ ' ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. అయితే గత నెల ఏప్రిల్ లోనే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్(పీడీఏఎఫ్)తో ఈ సూపర్ ఫోన్లను చైనాలో ప్రవేశపెట్టింది.

Read more : లీ 1ఎస్ రికార్డ్ సేల్, 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు

ఇండియాలో ఈ ఫోన్లు ఓ రేంజ్ లో అమ్మకాలు జరిగాయి. చాలామంది. లీ అంటే ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారో ఓ 10 కారణాలు చెబుతున్నారు. అవేంటో మీరే చూడండి.

1

1

వర్కింగ్ ఫ్రొపెషనల్స్ స్మార్ట్ గా ఉండే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారు ఈ లీ స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా ఇష్టపడతారు కూడా. ఇతర ఫోన్లతో పోలిస్తే ఈ పోన్ ధర తక్కువగా ఉండటం అంతే కాకుండా అత్యాధునిక ఫీచర్లు ఉండటం కూడా వారికి బాగా కలిసివచ్చింది.

2

2

ఈ ఫోన్ బ్యాటరీలైప్ కూడా ఎక్కువ మన్నిక కావడంతో అందరూ దీని వైపే దృష్టి పెట్టారు. ఈ ఫోన్ లో యాప్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు షట్ డౌన్ చేసే ఆప్షన్ ఉండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది. క్విక్ ఛార్జింగ్ కూడా దీనికి తోడయింది.

3
 

3

ఫోన్ బ్రైట్ నెస్ కూడా ఇతర ఫోన్ల కన్నా ధీటుగా వస్తుండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది.హైఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఆఫర్ చేసే బీజిల్ లెస్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్ వంటి క్లాసికల్ ఫీచర్లను లీ 1ఎస్ ఫోన్‌లో మీరు చూడొచ్చు. పూర్తి మెటల్ బాడీతో వచ్చే ఫోన్ లు ఎంత వేగంగా హీట్ అవుతాయో అంతే వేగంగా కూల్ అవుతాయి. అదే విధంగా సిగ్నల్ రిసీవింగ్ కూడా వేగంగా ఉంటుంది.

4

4

ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

5

5

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

6

6

మీరు అత్యవసర మైన మీటింగ్ లో ఉన్నప్పుడు పోన్ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ తో మీరు ఆటోమేటిగ్గా మేసెజ్ లను అలాగే కాల్స్ ను డిస్ కనెక్ట్ చేయవచ్చు.

7

7

ఈ ఫోన్ లో కొత్తగా పిన్ టాప్ బటన్ చేర్చారు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నపుడు మీకు ఎటువంటి స్పామ్ మెయిల్స్ రాకుండా ఈ బటన్ ద్వారా అడ్డుకోవచ్చు.

8

8

స్టూడెంట్స్ కు ఈ ఫోన్ తో చాలానే ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. అలాగే నాలెడ్జికి సంబంధించిన అంశాలు ఈ ఫోన్ ద్వారా వారు పొందవచ్చు. సెల్పీలు ఇష్టపడేవారు ఈ ఫోన్ తో ట్రావెలింగ్ సమయంలో దర్జాగా ఫోటోలు దిగవచ్చు. పెద్ద డిస్ ప్లే తో ఆకట్టుకునే విధంగా మీ ఫోటోలను చూపెడుతుంది.

9

9

ఇది 2004 నవంబర్ లో లీకో కంపెనీని స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం చైనాలోని బీజింగ్ నగరంలో ఉంది. స్మార్ట్ పోన్లనే కాకుండా ఇంటర్నెట్ టీవీ, వీడియో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ,స్మార్ట్ డివైసెస్, మొదలుగు ఉత్పత్తులను కూడా అందిస్తోంది.

10

10

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Wrtie Chinese conglomerate LeEco may launch e-commerce platform in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X