ఇండియా చేతికి కొత్త అస్త్రం..ఇక చైనాకు చుక్కలేనా..?

Written By:

ప్రతిష్టాత్మక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే లో చేరికతో భారత్ కు ఇప్పుడు పదునైన ఆయుధం దొరికినట్లయింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలిలో చైనాకు చోటు చిక్కలేదు. మొత్తం 38 దేశాల కూటమి ఉన్న ఈ ఎంటీసీఆర్ లో భారత్ చేరికతో అనేక ప్రయోజనాలు పొందేందుకు అలాగే పాకిస్తాన్, చైనా లాంటి దేశాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మార్గం సుగుమం అయింది. అదెలాగో చూద్దాం.

ఆదర్శం : రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్‌తో గ్రామాన్ని పరుగులెత్తిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.

ఎంటీసీఆర్ అనేది విధ్వంసక క్షిపణులు, వాయిమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల విచ్చలవిడి వ్యాప్తిని నిరోధించేందుకు ఏర్పాటయిన ఓ కూటమి. ఎంటీసీర్‌లో స‌భ్య‌త్వం వ‌ల్ల భార‌త్ హై-ఎండ్ మిసైల్ టెక్నాల‌జీని పొందే అవ‌కాశం ఉంటుంది. ర‌ష్యాతో త‌న క్షిప‌ణి సాంకేతికతను మ‌రింత స‌మృద్ధి చేసుకోవ‌చ్చు.

2.

ఇందులో మొత్తం 34 దేశాలు ఉన్నాయి.భారత్ చేరికతో ఆ సంఖ్య 35కి చేరింది. ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్.. అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానంతోపాటు నిఘా డ్రోన్లను కొనుగోలుచేసుకునే వీలుంటుంది.

3.

భారత్ తో అణు ఒప్పందంలో భాగంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని కూటములలో సభ్యత్వాన్ని సమర్థిస్తానని అమెరికా గతంలో చేసిన వాగ్ధానానికి కార్యరూపమే ఎంటీసీఆర్ లో చేరిక.

4

 ఈ కూటమిలోని దేశాలన్నీ 500 కేజీల బరువు, లక్ష్యం పరిధి 300 కిలోమీటర్లకు పైబడిన బాలిస్టిక్ క్షిపణులు తయారుచేయబోవు. ఒకవేళ ఇంతకు ఉంటే గనుక వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది.

5.

ఇందులో చేరడం ద్వారా సభ్యదేశాల నుంచి అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానాన్ని, డ్రోన్లు, ఇతర వాహక నౌకలను దిగుమతి చేసుకోవచ్చు. మున్ముందు భారత్ సొంతగా రూపొందించబోయే టెక్నాలజీని కూడా అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే అవకాశం లభిస్తుంది.

6.

ఎంటీసీఆర్ లో సభ్యత్వం లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ తాను రూపొందించిన అత్యాధునిక అంతరీక్ష నౌక(షావిత్)లను అమ్ముకోలేక పోవడం గమనార్హం.

7.

2004 నుంచి ఎంటీసీఆర్ లో చైనా సభ్యత్వం పరిశీలనలో ఉంది. అయితే ఎంటీసీఆర్ లో సభ్యత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఏడాది లోపే భారత్ కు ఎంటీసీఆర్ సభ్యత్వం దక్కడం గమనార్హం.

8.

వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఉత్తర కొరియాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఎంటీసీఆర్ లోని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఆ దేశ సభ్యత్వాన్ని పరీశీలనలోనే ఉంచాయి.

9.

చైనా మాత్రం పైకి తాను బాలిస్టిక్ క్షిపణుల తయారీని నిలిపేశానని చెప్పుకుంటోంది. లోలోన మాత్రం విధ్వంసక ఆయుధాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ తో చైనా చేసుకున్న ఆయుధ సరఫరా ఒప్పందం కూడా అలాంటిదే.

10.

ఇప్పుడు చైనా ఎంటీసీఆర్ లో చేరకుండా భారత్ కు ఆయుధం దొరికినట్లయింది. ఎలాగైతే భారత్ కు ఎన్ఎస్ జీ సభ్యత్వం దక్కకుండా చైనా మోకాలడ్డిందో, భవిష్యత్ లో భారత్ కూడా చైనా ఎంటీసీఆర్ సభ్యత్వానికి అడ్డుపడొచ్చు.

11.

48 దేశాల అణు సరఫరాల గ్రూపు (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం విషయంలో భారత్‌కు చుక్కెదురైన తరుణంలో ఎంటీసీఆర్‌లో సభ్యత్వం లభించడం చారిత్రక పరిణామం.

12.

ఇండియా అలా ఎంటీసీఆర్ లోచేరిందో లేదో అప్పుడే చైనా కొత్త పల్లవి అందుకుంది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆ దేశం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

13.

మరి ముందు ముందు ఇంకెన్ని సన్నాయి నొక్కులు నొక్కుతుందనేది వేచి చూడాల్సిన విషయం.

14.

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India joins Missile Technology Control Regime as full member
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot