మరో చరిత్రను లిఖించిన నాసా

Written By:

అంతర్జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ నాసా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జూనో అంతరిక్ష నౌక సుదీర్ఘ ప్రయాణం చేసి జూపిటర్ (బృహస్పతి) కక్ష్యలోకి చేరుకుంది. ఇందుకుగాను దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. సౌర వ్యవస్థలో ప్రాణి జీవించేందుకు అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం జూపిటర్ ఒక్కటే అని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆ మేరకే పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగా 2011 ఆగస్టు 5 న నాసా జూనో అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 260 కోట్ల కిలో మీటర్లు ప్రయాణించిన జూనో చివరకు జూపిటర్ కక్షలోకి చేరింది. జూపిటర్ గ్రహం గురించి చాలామందికి తెలియని విషయాలు.

కొత్త ఫోన్.. కంటిచూపుతో అన్‌లాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరో చరిత్రను లిఖించిన నాసా

బృహస్పతి ని ఆంగ్లంలో జూపిటర్. ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. సూర్యుడి నుండి ఇది 5 వ గ్రహం అలాగే సౌరమండలము లో అతి పెద్ద గ్రహం. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు రెండున్నరరెట్లు ఎక్కువ.

మరో చరిత్రను లిఖించిన నాసా

రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది. భూమ్మీద నుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు, శుక్రుడుల తరువాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. కొన్ని సార్లు అంగారకుడు బృహస్పతి కన్నా ఎక్కువ మెరుస్తున్నట్లు అగుపిస్తాడు.

మరో చరిత్రను లిఖించిన నాసా

గురు గ్రహం అయస్కాంత క్షేత్ర నియంత్రణలో పనిచేసే రేణువుల ఉనికిని అవి కనుగొన్నాయి. వీటిపై పరిశోధన ద్వారా ఆ గ్రహం అంతర్భాగంపై విలువైన సమాచారం వెలుగులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరో చరిత్రను లిఖించిన నాసా

నాసా పంపిన వ్యోమనౌక గురుగ్రహం మేఘాల కిందకి వెళ్లి గ్రహ ఉపరితలాన్ని పరిశీలిస్తుంది. పొడవైన మూడు భారీ సౌరఫలకాలు కలిగిన ఈ వ్యోమనౌక ఫ్యాన్ లా ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా సౌరకుటుంబంలోని అతి పెద్ద గ్రహం గురుడికి సంబంధించి రహస్యాలను ఛేదించనుంది.

మరో చరిత్రను లిఖించిన నాసా

భూమి మీద ఏర్పడినట్లే ఈ గ్రహం ధ్రువ ప్రాంతాల్లో రంగు రంగుల అరోరాలు ఏర్పడుతుంటాయి. వీటిని పరిశీలించడం ద్వారా గురుగ్రహం పుట్టుక, నిర్మాణం, వాతావరణం, అయస్కాంతక్షేత్రం వంటి అంశాలు నిగ్గు తేల్చాలని నాసా భావిస్తోంది.

మరో చరిత్రను లిఖించిన నాసా

ఈ వ్యోమనౌక 1.7 బిలియన్ మైళ్లు ప్రయాణించి గురుగ్రహ కక్ష్యలో చేరింది. జూనో దాదాపు 20 నెలలపాటు జూపిటర్ చుట్టూ 37 సార్లు తిరిగి ఈ గ్రహాన్ని పరిశీలిస్తుంది.

మరో చరిత్రను లిఖించిన నాసా

సూర్యుడికి 74,1 కోట్ల కిలోమీటర్ల దూరంలో జూపిటర్ ఉండగా..భూమికి 58.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి కన్నా ఇది 11.2 రెట్లు పెద్దది. ఇక సౌరమండలంలో ఈ గ్రహమే అన్నింటికన్నా పెద్దదని ఇప్పటికే తెలిసిందే.

మరో చరిత్రను లిఖించిన నాసా

దాదాపు 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2011లో ఈ జూనోను అంతరిక్షంలోకి ప్రయోగించారు.గంటకు లక్షా 60 వేల కిలోమీటర్ల వేగంతో ఈ జూనే ప్రయాణిస్తుంది.

మరో చరిత్రను లిఖించిన నాసా

భూమి, అంగారక గ్రహాలకు భిన్నంగా గురుగ్రహం పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. సౌరకుటుంబంలో సూర్యుని తర్వాత మొదట ఏర్పడిన గ్రహంగా జూపిటర్కు పేరుంది. అందుకే ఈ గ్రహాన్ని అధ్యయనం చేస్తే భూమితోపాటు మిగతా సౌరకుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరో చరిత్రను లిఖించిన నాసా

1989 లో గెలీలియో తర్వాత జూపిటర్ కక్ష్యలో చేరిన రెండో స్పేస్క్రాఫ్ట్ జూనో. గతంలో పదేళ్లపాటు జూపిటర్ చుట్టూ తిరిగిన గెలీలియో .. దాని ఉపగ్రహం యురోపాపై సముద్ర జాడలను కనిపెట్టింది. జునో 20 నెలల తర్వాత 2018 లో జూపిటర్ వాతావరణంలోకి వెళ్లిపోయి తననుతాను విచ్ఛిన్నం చేసుకుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Juno probe Nasa spacecraft successfully enters Jupiter's orbit
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot