తెల్లని చందమామ ఇలా..తెలియని రహస్యాలనేకం

Written By:

చీకటిలో సైతం తెల్లగా మెరిసిపోయేది ఎవరంటే టక్కున ఎవరైనా చెప్పే సమాధానం చందమామనే..అయితే ఆ చందమామ అమావాస్య రోజున ఎలా ఉంటాడు..ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కుంటాడు.అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా అనే సందేహం అందరికీ రావచ్చు. కాని ఆ రోజు ఎక్కడుంటాడు.ఎలా ఉంటాడనే విషయాన్ని నాసా ఫోటోల ద్వారా బయటపెట్టింది. సూర్యుడి వెలుగులు చందమామపై పడకుంటే ఎలా ఉంటాడన్న విషాయన్ని నాసా తన డీప్‌ స్పేస్‌ క్లైమేట్‌ అబ్జర్వేటరీ (డిస్కవర్‌)లో బంధించింది. ఉపగ్రహం చీకట్లో ఉన్న చందమామ ఇలా బూడిద రంగులో నిస్తేజంగా కనిపించాడు. ఈ ఫోటో ఈ జూలై 5న తీసింది. ఇలాంటి ఫోటోనే గతేడాది జూలై 16న కూడా మరొకటి తీసింది. ఈ ఫోటోను నాసా అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది.

చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు ఇవే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

భూమి మీదనే కాదు. చంద్రునిపై కూడా భూకంపాలు వస్తాయి. వాటిని Moonquakes గా పిలుస్తారు. అవి నాలుగు రకాలుగా సంభవిస్తాయి. మొదటి మూడు సూర్యుని వేడి వల్ల సంభవిస్తే నాలుగోది అకారణంగా సంభవిస్తుంది. ఇలా అకారణంగా సంభవించే భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదవుతుంది. నాసా ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరంతో కూడుకున్న తుఫాను.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

భూమి చంద్రుడు చుట్టూ తిరుగుతాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే భూమి ద్రవ్యరాశిలో చంద్రుడి ద్రవ్యరాశి 1.2 శాతంగా ఉంటుంది.కాబట్టి ఈ రెండింటిని ట్విన్ ప్లానెట్ గా వ్యవహరిస్తారు.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామ మీద చెత్త ఉందన్న విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఇది నిజం. చందమామపై దాదాపు 181,437 kilograms (about 400,000 lbs) చెత్త ఉందని నాసా చెబుతోంది. దీన్ని వ్యోమగాములు వదిలేసారు.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై పరిశోధనలు సాగించిన షోమేకర్ అస్థికలను చందమామపై వదిలారు. అతను చనిపోయినప్పుడు అతని జ్ఙాపకార్థం అస్థికలను లూనార్ ప్రాస్పెక్టర్ లో చందమామపైన వదిలేశారు. ఇది 1998లో జరిగింది. అతని అస్థికలు అక్కడ చెల్లా చెదురై ఉన్నాయి.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై అనేక రకాలైన పెంకులు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అసలు అవేంటనేది నాసా ఇంతరవకు కనుగొనలేదు. అవి దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై ఉన్న బూడిదతో నాసా అనేక సమస్యలను అనుభవించింది. దుమ్ము ధూళితో నిండిన చందమామపై రోవర్లు ల్యాండ్ అయితే ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందోనని నాసా భయపడింది కూడా. ఈ బూడిదను ఇప్పుడు కిందికు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై వాతావరణం చాలా ఢిపరెంట్ గా ఉంటుంది. అసలు ఆ వాతావరణంలో మనిషి జీవించగలడా అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే ఉంది. అక్కడ ఓజోన్ పొర అసలే ఉండదు. పగలు భగ భగ మండే వాతావరణం, రాత్రి గడ్డకట్టించే చల్లదనంతో ఉంటుంది.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామ ఎలా పుట్టాడో ఎవ్వరికీ తెలియదు. కాని 400 ఏళ్ల క్రితం ఓ పెద్ద ప్రళయంతో చంద్రుడు పుట్టాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని అధ్యయన చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

న్యూ మూన్ సమయంలో మనుషులు మంచి నిద్రను పొందుతారు. అదే ఫుల్ మూన్ సమయంలో.. నిద్ర సరిగా ఉండదని అధ్యయనాలు తేల్చాయి. పుల్ మూన్ వచ్చిన సమయంలో ఎవ్వరూ సరిగా నిద్రపోలేరని University of Basel in Switzerland పరిశోధకులు చెబుతున్నారు.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన నీడ మనకు దగ్గరగా పడుతుంది. అదే చంద్రునిపై నడిచినప్పుడు మన నీడ ఎంతో దూరంలో కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ అకారణంగా సంభవించే వాతావరణ మార్పులేనట.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చంద్రునిపై అయస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దాని కారణంగా అక్కడక్కడా మనకు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక అయస్కాంత క్షేత్రమని అన్నీ తనలో లాగేసుకునే శక్తి కలిగి ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి, నీరు లేకపోవడమే. అవి రెండూ ఉన్నట్లయితే, అక్కడి మట్టి కదిలేది! కాలి ముద్రలు చెరిగిపోయేవి.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. అయస్కాంత క్షేత్ర బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని శిలలు నల్లగాను, సూర్యుడి నుండి వచ్చే వేడి గాలులవల్ల ప్రభావితం చెందిన అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగానూ కనిపిస్తాయి.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

ప్రతీ సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెం. మీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోదనల్లో తేలింది. ఇది ఇలాగే కొనసాగితే, భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత 47 రోజులు తీసుకుంటాడంట!

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

భూమి గురుత్వాకర్షణ శక్తి ఆరు వంతులుగా అనుకుంటే, చంద్రుని ఆకర్షణ శక్తి ఒక వంతుకన్నా తక్కువ. అంటే, భూమి పైన అరవై కిలోలున్న మనిషి, చంద్రునిపై పది కిలోలు మాత్రమే తూగుతాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇందనం, దాని వ్యయం పూర్తిగా సేవ్ అవుతుందట.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

చందమామపై ఆరు జెండాలను నిలబెట్టారు. వాటిలో 5 మాత్రం అలాగే నిలబడి ఉన్నాయి. చందమామపై పాతిన అమెరికన్ ఫ్లాగ్స్ ఇప్పుడు.. తెల్లగా మారాయి. ఇలా రంగు మారడానికి సూర్యుడి రేడియేషనే కారణం.

చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు

సూర్యుడు.. చందమామ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే భూమికి 400 రెట్లు మరింత దూరంగా ఉంటుంది. కానీ.. రెండూ ఆకాశంలో ఒకే సైజులో కనిపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA camera catches moon 'photobombing' Earth
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot