పడిలేచిన నార్త్ కొరియా..యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన

Written By:

ప్రపంచానికి ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా ఏదైనా మిగిలి ఉందంటే అది నార్త్ కొరియానే.. ఆ దేశం తనకు తనే రాజుగా ప్రకటించుకుని ముందుకు దూకుతోంది. క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మధ్య చేసిన అన్ని ప్రయోగాలు ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయిన నార్త్ కొరియా ఇప్పుడు క్షిపణి ప్రయోగం విజయవంతంతో ప్రపంచదేశాలకు మరో సమస్యలా మారింది. నార్త్ కొరియా ప్రయోగంపై ఓ స్మార్ట్ లుక్.

Read more : నార్త్ కొరియా గురించి కొన్ని విచిత్రమైన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

ప్రపంచ దేశాలన్నీ వద్దు వద్దంటున్నా వినని ఉత్తర కొరియా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. సొంత టెక్నాలజీతో నిర్మించిన ముసుదాన్ క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశం దిగ్విజయంగా ముగించింది.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

మంగళవారం ఉదయం సరిగ్గా 6 గంటలకు ప్రయోగించిన తొలి ముసుదాన్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. అయితే రెండు గంటల తర్వాత ప్రయోగించిన ముసుదాన్ నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. దీంతో ఉత్తర కొరియా విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

ఈ ప్రయోగంలో మొదటి క్షిపణి ప్రయోగం పూర్తిగా విఫలం కాగా.. రెండో క్షిపణి మాత్రం కేవలం 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సౌత్ కోరియా జాయింట్ చీఫ్ స్టాఫ్ వెల్లడించింది. మధ్యతరహా క్షిపణుల 3,500 కిలోమీటర్ల లక్ష్యానికి ఉత్తర కొరియా చాలా దూరంలోనే నిలిచిపోయినట్లు వారు వెల్లడించారు.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

అయితే ముసుదాన్ పేరిట ఉత్తర కొరియా రూపొందించిన ఈ మధ్యంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించేందుకు ఆ దేశం ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు యత్నించి విఫలమైంది.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

ఈ ప్రయోగాలపై ప్రచంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆ దేశం పట్టించుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ దేశం ముసుదాన్ ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం విజయవంతమైన వెంటనే పొరుగు దేశం దక్షిణ కొరియాతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఘాటుగా స్పందించింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

ఆదేశ చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ... క్షిపణి ప్రయోగాలను మాత్రం ఆపడం లేదు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను నార్త్ కొరియా ధిక్కరిస్తూ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది.

పడిలేచిన నార్త్ కొరియా

ఇదిలా ఉంటే తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు.

పడిలేచిన నార్త్ కొరియా

అధ్యక్షుడే స్వయంగా మాట్లాడుతూ నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు.అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

అయితే పొరుగుదేశం జపాన్ మీదుగా ఉత్తర కొరియా మరిన్ని మిసైల్స్ ను పంపాలని వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జపాన్ ముందుగానే అలర్టయినట్లు సమాచారం.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

దేశ సరిహద్దులో ఒక్క మిసైల్ పడినా ఉత్తర కొరియాకు తగిన బుద్ది చెప్పాలని జపాన్ అధికారులు ఆ దేశ సైనికులకు ఇప్పటికే సూచించారు. ఉత్తర కొరియా అణుపరిక్షలు వదిలేసే ఆలోచన లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ స్పష్టం చేసిన విషయం విదితమే.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

మా చేతిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలతో అమెరికాను బూడిద చేస్తాం. ఒకే ఒక్క బటన్ నొక్కితే మీ రెండు దేశాలు నాశనమైపోతాయంటూ ఆ మధ్య ఓ వీడియోను రిలీజ్ చేసి అమెరికాకు చుక్కలు చూపించిన విషయం విదితమే.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

దీంతో పాటు దక్షిణ కొరియా అధ్యక్ష భవనాన్ని పేల్చివేసే ఓ వీడియోను రిలీజ్ చేసి ఇంకా సంచలనాలకు తెరలేపింది దక్షిణ కొరియా. ఈ వీడియోలో ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా.. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

అంతేకాదు, ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ వాక్యాలను కూడా చేర్చారు. ఇలా ప్రపంచదేశాలను ముప్ప తిప్పలు పెడుతూ ముందుకు సాగుతోంది. మరి ముందు ముందు ఏ తీరాలకు ఈ ప్రయాణం చేరుతుందో చూడాలి.

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న నార్త్ కొరియా లోపలి నిజాలు

మంటల్లో కాలిపోతున్న అమెరికా: సంచలనం రేపుతున్న వీడియో

పడిలేచిన నార్త్ కొరియా.. విజయగర్వంతో కిమ్ జాంగ్

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write North Korea test fires two powerful, mid range missiles after earlier test fails
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot