ఆ సముద్రంలో వేల ఏళ్ల నగరం బయటపడింది

Written By:

మనకు తెలియకుండా సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. శాస్ర్తవేత్తలు ఆ రహస్యాలను చేధిస్తున్నప్పటికీ ఇంకా ఎన్నో రహస్యాలు రహస్యాలుగానే మిగిలున్నాయి. లక్షల ఏళ్ల క్రితమే సముద్ర అడుగుభాగాన ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై సైంటిస్టలుకు సవాలు విసరుతున్నాయి. అయితే ఇప్పుడు సముద్రంలో నుంచి ఓ కొత్త ప్రపంచం బయటపడింది. అమెరికాలోని ఫ్లరిడా తీరంలొ ఈ ప్రపంచాన్ని గుర్తించారు.

Read more: 14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.

ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను సైంటిస్టులు కనుగొన్నారు.

ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు.

ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి.

సముద్ర గర్భానికి అడుగున

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే మానవులు నివసించారని తెలుస్తోందని వారు చెబుతున్నారు.

1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ నివసించిన క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు.

2012 నుంచి 2014 మధ్య కాలంలో

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించారు.

35 అడుగుల లోతులోని భూభాగంలో

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు.

క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు.

ముందు ముందు ఇంకెన్ని అవశేషాలు

ఆ సముద్రం నుంచి వేల ఏళ్ల నాటి రహస్యం బయటకొచ్చింది

మరి ముందు ముందు ఇంకెన్ని అవశేషాలు బయటపడతాయో ఇంకా ఏ నాగరికతలకు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తాయో చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Remarkable evidence of ancient humans found under Florida river
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot