14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

|

ఓ ఐడియా జీవితానే మార్చేస్తుంది అంటారు..అచ్చం అలాంటి ఓ ఐడియాను కనిపెట్టిన ఓ బుడ్డోడికి జీవితం మార్చే అవకాశం వచ్చినా ఆ ఐడియాను మాత్రం ఎవ్వరికీ ఇవ్వనంటున్నాడు. ఆ ఐడియాను మాకిస్తే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 200 కోట్ల రూపాయలను మీకిస్తాం అన్నప్పటికీ ఆ బుడ్డోడు మాత్రం ససేమిరా అంటున్నాడు. ఇంతకీ ఆ బుడ్డోడు దగ్గర ఉన్న ఐడియా ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

బుడ్డోడి పేరు టేలర్ రోసెంథాల్. వయస్సు 14 ఏళ్లు. ఈ బుడ్డోడు ఓ ఐడియాని కనిపెట్టాడు. దానికి పెద్ద పెద్ద కంపెనీలు రూ. 200 కోట్లు ఇస్తామన్నా నో అనేశాడు.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

అమెరికాలో బేస్ బాల్ పోటీలు జరుగుతున్న వేళ, తన స్నేహితులు గాయపడితే, వారికి ప్రాథమిక చికిత్సల కోసం మెడికల్ షాపులకు పరుగులు పెట్టే తల్లిదండ్రులను చూసిన 14 ఏళ్ల టేలర్ రోసెంథాల్ కు వచ్చిన ఓ చిన్న ఆలోచన, అతన్ని వ్యాపార ప్రపంచానికి పరిచయం చేసింది.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని ఓ వెండింగ్ మిషన్ (ఏటీఎం లాంటిది)ను తయారుచేశాడు. మీట నొక్కితే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

ఇప్పుడు అతని ఆలోచనను తమకు విక్రయించాలని క్యూ కడుతున్న కంపెనీలెన్నో ఉన్నాయి. రూ. 200 కోట్ల ఆఫర్ ఇచ్చినా టేలర్ తిరస్కరించాడు.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

శరీరానికి గాయాలైనా, ఎండలో సొమ్మసిల్లినా, కాలిన గాయాలైనా... ఫస్ట్ ఎయిడ్ కిట్ లను ఈ వెండింగ్ మెషీన్ విక్రయిస్తుంది. సమస్య ఏంటో సెలక్ట్ చేసుకుని, బటన్ ప్రెస్ చేస్తే, అందుకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేస్తుంది.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

అన్ని గాయాలకు వేర్వేరు ఫస్ట్‌ఎయిడ్ కిట్‌ను వెండింగ్ మిషన్‌లో ముందుగానే సిద్ధంగా ఉంచాడు. సమస్యను సెలెక్ట్ చేసుకొని, మీట నొక్కితే దానికి సంబంధించిన ఫస్ట్‌ఎయిడ్ కిట్ బయటకు వచ్చేలా చేసిన ఈ ఆలోచన టేలర్‌కు ఎంతగానో పేరు తెచ్చింది.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

ఈ వినూత్న ఆలోచన టేలర్ కు పేరుతో పాటు డబ్బునూ తెచ్చి పెట్టింది. ఈ ఐడియాకు సంబంధించిన హక్కులన్నీ టేలర్, తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు. రెక్ మెడ్ పేరిట ఓ స్టార్టప్ సంస్థనూ ప్రారంభించాడు.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ మల్టీనేషనల్ హెల్త్‌కేర్ సంస్థ ‘ఐడియా'ను అమ్మాల్సిందిగా టేలర్‌ను కోరింది. అందుకు ప్రతిఫలంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫర్ చేసింది. అందుకు టే లర్ ససేమిరా అన్నాడు.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

తానే స్వయంగా మరిన్ని యంత్రాలు తయారు చేసి విక్రయిస్తానని చెబుతున్నాడు. ఒక్కో మెషీన్ ను రూ. 35 లక్షలకు విక్రయిస్తుంటే, ప్రస్తుతం టేలర్ వద్ద 100 మెషీన్లకు ఆర్డర్లు ఉన్నాయట.

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

14 ఏళ్ల బుడ్డోడి ఐడియాకి రూ. 200 కోట్లు : సారీ అంటున్న బుడ్డోడు

సో ఐడియా జీవితాన్ని మార్చే విషయం పక్కన బెడితే మనోడి ఐడియా ఇప్పుడు ఏకంగా కోట్లు తెచ్చిపెట్టేందుకు రెడీ అయింది. సో మీరు కూడా ఏదైనా కొత్తగా ఐడియాను ట్రై చేయండి.

Best Mobiles in India

English summary
Here Write Schoolboy rejected 30 million offer for his invention

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X