ఆ రక్త జలపాతంపై మిస్టరీ వీడింది

Written By:

ప్రపంచంలో కెల్లా అత్యంత చల్లని ప్రాంతం ఏదైనా ఉందంటే అది అంటార్కిటికా ఖండం అనే చెప్పాలి. అయితే ఆ మంచు ఖండంలో ఓ చోట జలపాతంలాగా రక్తంతో తడిసినట్లుగా ఓ ధార ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. మొన్నటిదాకా అదేంటనేది పెద్ద మిస్టరీగానే మారింది. అయితే శాస్త్రవేత్తలు దాన్ని గుట్టు రట్టు చేశారు. ఆ రక్తపు మంచు వెనుక ఉన్న రహస్యాన్ని ప్రపంచానికి అందించారు. మరి అదేంటో మీరే చూడండి.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

కోటీ 44 లక్షల చదరపు కిలోమీటర్లతో విస్తరించి దాదాపు 98 శాతం మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటాకా ఖండం. ఇక్కడ మనుషులు మచ్చుకైనా కనిపించరు.కేవలం ఆ చలిని తట్టుకునే జంతువులు, మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

అంతటి భయంకరమైన చలిని కలిగి ఉన్న ఆ ఖండంలో ఓ ప్రదేశం శాస్త్రవేత్తలను ఇంకా షాకింగ్ అయ్యేలా చేసింది. గడ్డ కట్టుకుపోయిన మంచు ఖండంలో ఎర్రని రక్త జలపాతంలా పారుతూ ఉన్న చిన్న నదిని చూశారు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

1911 లో శాస్త్రవేత్త గ్రిఫ్ఫిత్ టేలర్ నాయకత్వంలో అంటార్కిటికాలో అణ్వేషణ యాత్ర చేస్తున్న బృందానికి ఈ అద్భుతమైన, భయంకరమైన దృశ్యం కనబడింది.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

ఎటువంటి ద్రవమైనా గడ్డకట్టుకుపోయే చలి ఉన్న ప్రాంతంలో ఎర్రని ద్రవం ధారలా, జలపాతంలా కారడమంటే ఎవరికైనా భయం చోటుచేసుకుంటుంది. మొదటగా గ్రిఫ్ఫిత్ టేలర్ కనుగొన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి టైలర్ హిమానీనదం అనే పేరు స్థిరపడింది.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

మొదట శాస్త్రవేత్తలు ఆ ఎర్రటి జలపాతానికి కారణం సిల్మద్రలు (ఆల్గే) అనుకున్నారు. ఐదు అంతస్తుల మంచు గడ్డలపై నుండి పారుతున్న ఈ రక్త జలపాతం క్రింద ఉన్న ఒక చిన్న సరస్సులో కలుస్తోంది.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

ఆ ద్రవంపై జరిపిన తదుపరి పరిశోధనలలో అద్భుతమైన వారు విషయాన్ని తెలుసుకున్నారు. అది ద్రవం కాదు నీరు అని తేల్చుకున్నారు. ఆ నీటికి ఎర్రరంగు ఎలా వస్తోంది, ఆ నీరు ఎందుకు గడ్డకట్టకుండా పారుతోంది అనే విషయాలపై మరికొన్ని పరిశోధనలు జరిపేరు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

టైలర్ హిమానీనదం క్రింద 2 మిల్లియన్ సంవత్సరాలకు క్రితం 1300 అడుగుల లోతులో ఒక చిన్న సరస్సు ఉండేదని పరిశోధనలలో తెలుసుకున్నారు. కాని ఆ సమాధానం కొంతమందిని సంతృప్తిపరచలేదు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

మరింతగా పరిశోధన చేయగా కొన్ని విషయాలు తెలిసాయి. ఆ హిమానీనదం, దాని క్రింద ఉన్న సరస్సులో ఉండే సూక్ష్మజీవులకు సహజ కాల వాహక భాగం లాగా పనిచేసేది. ఆ సరస్సులో జీవించే అదృశ్య సూక్ష్మజీవులు ప్రాణ వాయువు (ఆక్సిజన్), వెలుతురు (సూర్య రస్మి) మరియు వేడి (ఉష్ణోగ్రత) లేకుండా మనుగడ సాగించేవట.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

ఈ సూక్ష్మజీవులను ఆదికాలపు సూక్ష్మజీవ ప్రాణులు అని అంటారు.అయితే మరొక విచిత్రం ఏంటంటే ఈ సూక్ష్మజీవుల నుండే భూమి మీద ప్రాణులు ఉద్భవించాయట. జీవరాసులు తీవ్రమైన వాతావరణాల్లోనూ, బహుశ ఇతర గ్రహాలలోనూ ఉంటాయనడానికి ఈ రక్తస్రావ జలపాతం ఒక రుజువు అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్ ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఈ గాలిని స్వేచ్చగా పీల్చుకుని మనం హాయిగా బ్రతుకుతున్నాం. మరి శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రైమార్డియల్ స్రవించు ను సృష్టించిందెవరు

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

మరి ఎందుకు సృష్టించారు..ఆక్సిజన్, వెలుతురు, వేడి లేకుండా అవి అక్కడ మనుగడ ఎలా సాగిస్తున్నాయనేదానికి సైన్స్ దగ్గర సమాధానం లేదు. అయితే వారు మాత్రం అదొక మిస్టరీ అని చెబుతున్నారు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

ఇక అక్కడ ఎండాకాలంలో 24 గంటలూ సూర్యుడు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడు ఉదయించటం, అస్తమించడం అనేది లేనేలేదు. కొంచెం ఏటవాలుగా ఆకాశంలో 24 గంటలూ ఏదో ఒక ప్రక్క సూర్యుడు కనబడుతూ వుంటే కలిగే మధురానుభూతి వర్ణనాతీతం.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

అక్కడ పేరుకుపోయిన మంచు దెబ్బకి భూమి అనేది అక్కడ కనపడకుండా పోయింది. అక్కడ మంచు దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తున పేరుకుపోయి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 19 వ శతాబ్దం చివరిలోనే మానవుడు మొట్టమొదటి సారిగా అంటార్కిటికాపై అడుగు పెట్టగలిగాడు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

అంతటి మంచు ఖండంలోని రక్త జలపాతం ఇప్పటికీ దృశ్యపరంగానూ, సైన్స్ పరంగానూ ఒక ఆశ్చర్యకరమైన, మర్మమైన విషయంగా మిగిలిపోయింది. మరి శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేసి ఆ మర్మాని తేల్చుతారని ఆశిద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Scientists find the origin of Antarcticas creepy Blood Falls
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot